ఆలేరు ప్రభుత్వ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్‌లో లైంగిక వేధింపులతో పాటు బలవంతపు వ్యభిచారం చేయిస్తున్నారంటూ రాసి ఉన్న ఓ లేఖ కలకలం రేపుతోంది. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ స్కూల్ ప్రిన్సిపల్ చెబుతున్నారు.. ఎం జరిగిందనే దానిపై ఉన్నతాధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యే దృష్టిసారించారు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మైనారిటీ స్కూల్‌లో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారంటూ వెలువడిన ఓ లేఖ కలకలం రేపుతోంది. అయితే ఈ లేఖ స్థానిక ఎమ్మెల్యేతోపాటు ఉన్నతాధికారులకు చేరడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో హుటాహుటిన విచారణ సైతం చేపట్టారు
ఆలేరు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే ఓ బాలిక జిల్లా మైనార్టీ అధికారి, జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, స్థానిక ఎస్‌ఐ, మీడియా రిపోర్టర్లను వేడుకుంటూ ఓ ఉత్తరం చేరుకుంది. అయితే ఆ లేఖలో అంత్యంత జుగుప్సాకరమైన విషయాలు పేర్కొని ఉన్నాయి.. లేఖలో తెలిపిన వివరాల ప్రకారం స్కూలు విద్యార్థినిలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారంటూ.. పేర్కొంది. స్కూలు పక్కనే ఓ అద్దెగదిని తీసుకుని వారానికి ఒక విద్యార్థిని చొప్పున పంపుతున్నట్టు తెలిపింది. కాగా ఈ వారం తన వంతు రావడంతో ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని వాపోయింది.
స్కూల్‌లో పనిచేసే వారిపై ఆరోపణలు
ఈ క్రమంలోనే స్కూల్‌లో పనిచేసే గౌస్‌తో పాటు అంజు , సాజియా, సబిహా, రిజ్వానా అర్షియా అనే మహిళలపై ఆమె ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే గౌస్ విద్యార్థినిల సిక్ రూంలోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పేర్కోంది. రిజ్వానా అనే మహిళ భర్త రాత్రిపూట విద్యార్థినిలను తీసుకుని వెళుతున్నట్టు చెప్పింది. బయటి వ్యక్తులకు వ్యభిచారం చేయిస్తున్నారని అందుకోసం వారి వద్ద 20వేల రూపాయలు కూడా తీసుకుని, విద్యార్థినిలకు 500 రూపాయలు కూడా ఇస్తున్నట్టు తెలిపింది. ఎవరైనా ఎదిరిస్తే టీసి ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు.
అంతా ఉత్తదే.. ప్రిన్సిపల్
అయితే ఈ లేఖ బయటపడిన తర్వాత స్కూల్లో ఉన్న విద్యార్థినిలను ప్రిన్సిపల్ విచారణ జరిపినట్టు చెప్పారు. ఇదంతా తప్పుడు ప్రచారమని తేల్చారు. వ్యక్తిగత కక్షలను స్కూలుకు రుద్దారని తెలిపారు.. ఈ క్రమంలోనే స్కూల్‌లో ఆయాగా పనిచేసే అర్షియా నుంచి ఆమె భర్త విడాకులు తీసుకున్నాడని.. అతడే ఇలాంటి లేఖను ఉద్దేశపూర్వకంగా సృష్టించి స్కూల్ పరువు తీయాలని చూస్తున్నాడని ఆరోపించారు.. వారిద్దరి మధ్య గొడవను స్కూల్ మీద రుద్దారని వివరించాడు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కలెక్టర్‌కి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రిన్సిపల్ తెలిపారు.
Tag:తెలుగు వార్తలు, . రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, చదవండి.