Sunday, September 12, 2021

Hackers: రూట్‌ మార్చారు, స్కూల్‌ పిల్లల్ని టార్గెట్‌ చేస్తున్నారు

 


హ్యాకర్స్‌ తమ పంథాని మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మాల్‌ వేర్‌ సాయంతో సంస్థలపై దాడులు చేసే సైబర్‌ నేరస్తులు ఇప్పుడు స్కూల్‌ పిల్లల్ని టార్గెట్‌ చేస్తున్నారు. ఆయా స్కూళ్ల డేటా బేస్‌లో ఉన్న స్కూల్‌ చిల్డ్రన్స్‌ డేటాను దొంగిలిస్తున్నారు. ఆ డేటాతో సొమ్ము చేసుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే అక్రమ వ్యాపార కార్యకలాపాలకు వేదికగా నిలిచే ‘డార్క్ వెబ్’లో అమ్ముకుంటున్నట్లు నేషనల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ(ఎన్‌బీసీ) ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. 
 
ఈఏడాది 1200స్కూళ్లని టార్గెట్‌ చేసి.. 
నేషనల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ(ఎన్‌బీసీ) రిపోర్ట్‌ ప్రకారం..అమెరికాకు చెందిన ఓ జిల్లా స్కూల్‌కు చెందిన విద్యార్ధుల వ్యక్తిగత వివరాల్ని మాల్‌ వేర్‌ సాయంతో దొంగిలించారు. విద్యార్ధుల పేర్లు, డేటా బర్త్‌,సోషల్‌ సెక్యూరిటీ నెంబర్ల(ssn)ను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా  సైబర్‌ దాడులతో డబ్బుల్ని డిమాండ్‌ చేశారని, అలా ఇవ్వలేదనే విద్యార్ధుల వ్యక్తిగత డేటాను డార్కెవెబ్‌లో అమ్ముకున్నట్లు ఎఫ్‌బీఐ విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ సైబర్‌ దాడులతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా టీచర్స్‌ సైతం ఈ సైబర్‌ దాడులు విద్యార్ధుల భవిష్యత్‌ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

కాగా,ఈజీ మనీ ఎర్నింగ్‌ కోసం హ్యాకర్స్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్ని టార్గెట్‌ చేయడంతో పాటు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అమెరికాకు చెందిన 1200 స్కూళ్లకు చెందిన కంప్యూటర్లను మాల్‌ వేర్‌తో దాడులు చేసినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 
 
అధ్యక్షుడి ప్రకటన తరువాతే 

కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ..ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఐటీ విభాగాల్ని మరింత పటిష్టం చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సైబర్‌ నేరాలపై జరిగే న్యాయ విచారణకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అంశాల్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటన చేశారో లేదు. హ్యాకర్స్‌ దాడుల్ని ముమ్మరం చేయడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.