Sunday, September 5, 2021

యూ‌పి‌ఐ చెల్లింపులలోతో జాగ్రత్త.. ఉపయోగించే ముందు ఈ‌ విషయాలు తెలుసుకోండి..

 


కరోనా కాలం నుండి భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బి‌ఐ) డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నది. భారతదేశంలోని ప్రజలు డిజిటల్ లావాదేవీల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూ‌పి‌ఐ)ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)రిటైల్ పేమెంట్, సెటిల్మెంట్ వ్యవస్థల ఆపరేటివ్ సంస్థ. 

ఇది రిజర్వ్ బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చొరవ, అలాగే భారతదేశంలో  పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను బలంగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌పి‌సి‌ఐ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్  మల్టీ బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ అప్లికేషన్‌కు కనెక్ట్ చేయడం ద్వారా ఆర్థిక లావాదేవీలను అనుమతిస్తుంది.

యూ‌పి‌ఐ అంటే ఏమిటి?

యూ‌పి‌ఐ అనగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అనేది ఇంటర్‌బ్యాంక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ, దీని ద్వారా ఫోన్ నంబర్ అండ్ వర్చువల్ ఐడి సహాయంతో స్మార్ట్‌ఫోన్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇది ఇంటర్నెట్ బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్ విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థ ఎన్‌పి‌సి‌ఐ నియంత్రిస్తుంది. వినియోగదారులు ఇంట్లో కూర్చుని కొద్ది నిమిషాల్లో యూ‌పి‌ఐ నుండి డబ్బును బదిలీ చేయవచ్చు.

యూ‌పి‌పి‌ఐ ఎంత వరకు సురక్షితం?

అసలు ప్రశ్న ఏమిటంటే యూ‌పి‌ఐ ఎంత వరకు సురక్షితమైనది..? డిజిటల్ లావాదేవీలు వినియోగదారులకు లాభదాయకంగా ఉండటమే కాకుండా వారికి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. దేశంలో టెక్నాలజీ అభివృద్ధితో పాటు ఆన్‌లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలను మోసం చేయడానికి హ్యాకర్లు ప్రతిరోజూ కొత్త కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరాల సంఘటనలు ప్రతిరోజూ తెరపైకి వస్తున్నాయి, ఇందులో ప్రజల ఖాతాల నుండి లక్షల రూపాయలు స్వాహా ఆవుతున్నాయి. అందుకే సురక్షితమైన లావాదేవీల కోసం  మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి దీని ద్వారా మీరు మోసాలకి గురయ్యే అవకాశం చాలా తక్కువ.

యూ‌పి‌ఐ పిన్ ని సురక్షిత అప్లికేషన్‌లలో మాత్రమే ఉపయోగించండి

హానికరమైన అప్లికేషన్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా హ్యాకర్లకు చేరవేస్తాయి. ఇందులో చెల్లింపుల సంబంధిత సమాచారం కూడా ఉంటుంది. మీరు అలాంటి అప్లికేషన్లకు దూరంగా ఉండాలి.  సేఫ్టీ కోసం భీమ్ యూ‌పి‌ఐ వంటి సురక్షిత అప్లికేషన్‌లలో మాత్రమే యూ‌పి‌ఐ పిన్ ని ఉపయోగించండి. యూ‌పి‌ఐ పిన్ ఎంటర్ చేయడానికి ఒక వెబ్‌సైట్ లేదా ఫారమ్‌కు లింక్ ఉంటే దాన్ని నివారించండి. 

 

డబ్బు పంపడానికి మాత్రమే యూ‌పి‌ఐ పిన్ ఎంటర్ చేయండి

ఏదైనా లావాదేవీ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, మీరు డబ్బు పంపాలనుకున్నప్పుడు మాత్రమే యూ‌పి‌ఐ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఎక్కడి నుంచైనా లేదా ఇతరుల నుండి డబ్బును పొందడానికి  మిమ్మల్ని యూ‌పి‌ఐ పిన్ అడుగుతున్నట్లయితే అది మోసం కావచ్చునని తెలుసుకోండి.

 కస్టమర్ సర్వీస్ 
మీరు ఏదైనా లావాదేవి తో  సమస్య ఎదుర్కొంటున్నట్లయితే మీరు కస్టమర్ సర్వీస్ సంప్రదించండి. ఇంటర్నెట్‌లో ఇచ్చిన వేరిఫై కానీ ఫోన్ నంబర్‌కు కాల్ చేయవద్దు.

మీ యూ‌పి‌ఐ పిన్ ఇతరులకి చెప్పవద్దు
మీ యూ‌పి‌ఐ పిన్ ఏ‌టి‌ఎం పిన్‌తో సమానం. కాబట్టి దానిని ఎవరితోనూ పంచుకోవద్దు. ఇలా చేయడం ద్వారా మోసగాళ్లు మిమ్మల్ని మోసం చేయవచ్చు.