Saturday, September 4, 2021

UGC NET Notification 2021 | Download Information Bulletin | Check eligibility and online apply process

  వివిధ యూనివర్సిటీలు/కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నకు ఉద్దేశించిన అర్హత పరీక్ష యూజీసే నెట్ జూన్ 2021 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టి‌ఏ) విడుదల చేసింది. కొవిడ్ 19 కారణంగా 2020 డిసెంబరు సిషన్ ఎగ్జామ్ ను వాయిదా వేశారు. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఈ రెండు సెషన్లకు కలిపి పరీక్షను నిర్వహిస్తారు. 2020 డిసెంబరు సెషన్ కు రిజిస్ట్రేషన్ చేసుకొని, దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయని అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

 


యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హ్యూమానిటీస్ సోషల్ సైన్స్ (లాంగ్వేజ్ లు సహ) కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర స్పెషలైజేషన్లతో మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నదమవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

వయసు:

జే‌ఆర్‌ఎఫ్ అభ్యర్థులకు అక్టోబరు 1 నాటికి 21 సంవత్సరాలకు మించకూడదు.

అసిస్టెంట్ ప్రొఫెసరకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

 

యూజీసీ నెట్ వివరాలు:

 ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది.

ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.

మొదటి పేపర్లో 50 ప్రశ్నలు ఇస్తారు.

రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్షింట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్, టీచింగ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాల్లో అభ్యర్థి ప్రతిభను గుర్తించేలా ప్రశ్నలు అడుగుతారు.

రెండో పేపర్ అభ్యర్థి ఎంచుకొన్న సుబ్జెక్ట్ కు సంబంధించి ఉంటుంది.

ఇందులో 100 ప్రశ్నలు ఇస్తారు.

ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. మొత్తం మార్కులు 200

పరీక్ష సమయం 3 గంటలు ప్రశ్న పత్రాన్ని ఇంగ్లిషు, హింది మాధ్యమాల్లో ఇస్తారు.

 

ముఖ్య సమాచారం:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సేప్టెంబరు 5, 2021,

ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: సెప్టెంబరు 6, 2021,

యూజీసీ నెట్ 2021 తేదీలు: అక్టోబరు 6 నుంచి 11 వరకు

అదికారిక వెబ్ సైట్: https://ugcnet.nta.nic.in/

అదికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.