Friday, March 12, 2021

4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా!

 


 

ప్రపంచం దృష్టి రాబోయే 5జీ మీద ఉంటె మనదేశంలో మాత్రం చాలా ప్రాంతాలలో సరిగ్గా 4జీ స్పీడ్ రాక భాదపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన మొబైల్ లో 4జీ డేటా స్పీడ్ ఎందుకు తక్కువగా వస్తుంది అనేది ప్రధానంగా తెలుసుకోవాలి. మన మొబైల్ స్పీడ్ అనేది మీరు మొబైల్ టవర్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు, ఎంత మంది వినియోగదారులు 4జీ మొబైల్ టవర్ ను ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే, మీరు మీ ఇంటి లోపల లేదా వెలుపల ఉన్నారా అనే దానిపై ఆధారపడి పనిచేస్తుంది. సాధారణంగా రాత్రి సమయంలో డేటా స్పీడ్ తక్కువగా రావడం గమనించవచ్చు. 

అయితే, కొన్ని పరిస్థితులలో మన మొబైల్ లో ఉండే నెట్ వర్క్ సిగ్నల్ సెట్టింగ్స్ కారణంగా కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 4జీ వోఎల్టీఈ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ ఫోన్ల సంఖ్య నానాటికి పెరగడం ఒక కారణం. ఇంటర్నెట్ స్పీడ్ అనేది పరిమిత పరిధిలో స్పెక్ట్రమ్ ఫలితంగా వస్తుంది. మీరు మీ ఫోన్ లో 4జీ వేగాన్ని మెరుగుపరచడానికి కొన్ని పద్ధతులు తెలుసుకుందాం.. 

  • మొదట మీ ఫోన్ సెట్టింగులకు వెళ్లి మొబైల్ నెట్వర్కుల ద్వారా "4జీ"ను ఎనేబుల్ చేయండి. 
  • మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగుకు వెళ్లి యాక్సెస్ పాయింట్ పేర్లను క్లిక్ చేసి ఏపీఎన్ ను డిఫాల్టుగా రీసెట్ చేయండి 
  • కొన్ని అవసరం లేని యాప్స్ ఇంటర్నెట్ వేగాన్నీ తగ్గిస్తాయి
  • వాటిని ఆన్ ఇంస్టాల్ చేయడం లేదా బ్యాక్ గ్రౌండ్ డేటా ఆప్షన్ నిలిపి వేయడం ఉత్తమం
  • 4జీ ఇంటర్నెట్ సరిగ్గా రాణి సందర్భంలో ఒకసారి ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేయడం మంచిది
  • కొన్ని ప్రత్యేక సందర్భాలలో మీ నెట్వర్క్ సెట్టింగ్స్ ను రీసెట్ చేయడం మంచిది.    
Tags: 4G, 5G, Telugu tech News,