Monday, February 1, 2021

WhatsApp, Telegram : వాట్సాప్‌ టు టెలిగ్రాం.. చాట్‌ హిస్టరీని సులభంగా టెలిగ్రాంలోకి మార్చుకునే సౌకర్యం

 

 

వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ విధానంపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు డిమాండ్‌ బాగా పెరిగింది. గత రెండు వారాల్లో ఈ సంఖ్య మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో యూజర్స్‌ని మరింతగా ఆకట్టుకుని వాట్సాప్‌ తరహాలో అందించే టెలిగ్రాం, సిగ్నల్‌ యాప్‌లు ఇప్పటికే పలు రకాల కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసింది. కొన్ని రోజుల కిందట సిగ్నల్‌ యాప్‌ కస్టమ్‌ వాల్‌పేపర్స్‌, యూనిమేటెడ్‌ స్టిక్కర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా టెలిగ్రాం మరో ముందడుగు వేసింది. వాట్సాప్‌ నుంచి టెలిగ్రాంకు చాట్‌ హిస్టరీని మార్చుకునేలా కొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఈ మేరకు టెలిగ్రాం 7.4 వెర్షన్‌ను డెవలప్‌ చేసింది. ఈ అప్‌డేట్‌తో యూజర్స్‌ సులభంగా వాట్సాప్‌, లైన్‌, కాకోటాక్‌ యాప్స్‌ నుంచి తమ ఖాతాల్లోని చాట్‌ హిస్టరీని సులభంగా టెలిగ్రాంలోకి మార్చుకునే సౌకర్యం కల్పించింది.

 


 

ఎలాగంటే.. ఇందు కోసం మీరు వాట్సాప్‌లోకి వెళ్లి ఎవరి చాట్‌ హిస్టరీ మార్చుకోవాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్‌ లేదా గ్రూప్‌ ఇన్ఫోపై క్లిక్‌ చేయాలి. ఇందులో ఎక్స్‌పోర్ట్‌ చాట్‌ అనే ఫీచర్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే మీడియా ఫైల్స్‌ని యాడ్‌ చేయాలా..? వద్దా అని పాప్‌-అప్‌ విడో కనిపిస్తుంది. ఎటాచ్‌ మీడియా ఫైల్స్‌పై క్లిక్‌ చేస్తే చాట్‌ హిస్టరీ మొత్తం ఎక్స్‌పోర్ట్‌ అవుతుంది. ఆ తర్వాత కింద ఆప్షన్‌లో టెలిగ్రాం సెలెక్ట్‌ చేస్తే యాప్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో ఇంపోర్ట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే వాట్సాప్‌ చాట్‌ హిస్టరీ మొత్తం టెలిగ్రాంలోకి మారిపోతుంది. అలానే టెలిగ్రాం కూడా వాట్సాప్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హిస్టరీని ఇంపోర్టెడ్‌ మెసేజెస్‌ పేరుతో చూపిస్తుంది.