రిలయన్స్ జియో కేవలం నాలుగేళ్లలో దేశంలోనే నంబర్ -1 టెలికం కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం జియో కస్టమర్ల సంఖ్య 400 మిలియన్లను దాటింది. జియోలో చాలా ప్లాన్‌లు అధిక డేటాతో ఆన్ లిమిటెడ్ కాలింగ్ అందిస్తున్నాయి, అయితే జియో నంబర్‌ను ఆక్టివ్ లో ఉంచడానికి మాత్రమే రీఛార్జ్ చేయాలనుకునే వారికి చాలా తక్కువ ప్లాన్లు ఉన్నాయి. ఇప్పుడు జియోలో ఇలాంటి చౌకైనా ప్లాన్స్ గురించి తెలుసుకోండి, దీని కోసం మీరు ప్రతి నెలా 108 రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మీ నంబర్ ఆక్టివేట్ లో ఉంచడానికి తక్కువ ఖర్చుతో లభించే చౌకైన ప్లాన్ కోసం మీరు చూస్తున్నట్లయితే, మీ కోసం ఉన్న బెస్ట్ ప్లాన్ 1,299 రూపాయలు దీని వాలిడిటీ 336 రోజులు. మై జియో యాప్ లేదా జియో.కామ్‌లోని ప్లాన్ విభాగంలో అదర్స్ లోకి వెళ్లడం ద్వారా ఈ ప్లాన్ చూడవచ్చు. ఇది పాపులర్ ప్లాన్ లేదా వేరే ప్లాన్స్ లో కనిపించదు. ...
ఈ ప్లాన్‌ని మీరు రీఛార్జ్ చేస్తే, మీరు నెలకు 108.25 రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది, కానీ మీరు ఒక్కసారి మాత్రమే రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ఇతర నెలవారీ ప్లాన్ కంటే చాలా ఉత్తమం. జియో నెలవారీ ప్లాన్ ధర రూ .149 వాలిడిటీ 24 రోజులు. దీని ద్వారా మీరు నెలకు సుమారు 40 రూపాయలు ఆదా చేయవచ్చు
జియో రూ.1,299 ప్లాన్ వాలిడిటీని 336 రోజులు అందిస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందులో మీరు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ పొందుతారు, ఇంటర్నెట్ ఎక్కువగా వాడని వారికి కాల్స్ మాత్రమే అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ సరైనది, అయినప్పటికీ ఈ ప్లాన్‌లో మొత్తం 24 జిబి డేటా వస్తుంది
జియో ఈ ప్లాన్ ద్వారా మొత్తం 3600 ఎస్‌ఎంఎస్ ఇస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అన్ని జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ కూడా అక్సెస్ చేయవచ్చు. మీరు ఒకేసారి ఇంత ఖరీదైన రీఛార్జ్ చేయకూడదనుకుంటే, జియోలో రూ. 329 ప్లాన్ కూడా ఉంది, దీని ద్వారా 6 జీబీ డేటా 84 రోజుల వాలిడిటీ, అన్ని నెట్‌వర్క్‌లలో ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు.