భారతీ ఎయిర్‌టెల్ యొక్క డిటిహెచ్ ఆర్మ్ మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి
ప్రస్తుత లాక్డౌన్ కాలంలో తన యొక్క నాలుగు ప్లాట్‌ఫాం సేవలను ఉచితంగా
అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత లాక్డౌన్ కాలంలో
ఎయిర్టెల్ డిజిటల్ టివి ఏప్రిల్ 14 వరకు తన చందాదారులకు అదనపు ఖర్చు
లేకుండా నాలుగు ప్లాట్‌ఫాం ఛానెళ్లను ఉచితంగా అందించనుంది.
డిటిహెచ్ ఆపరేటర్లు
టాటా స్కై మరియు డిష్ టీవీ వంటి ఇతర డిటిహెచ్ ఆపరేటర్లు కూడా ఇటువంటి ఉచిత
ఛానల్లను ఇటీవల ప్రకటించారు. కఠినమైన కాలంలో చందాదారులను వినోదభరితంగా
ప్రేరేపించడానికి DTH ఆపరేటర్లు తమ ప్రీమియం ప్లాట్‌ఫాం సర్వీస్ ఛానెల్‌లను
ఉచితంగా అందించడానికి ముందుకు వస్తున్నారు.
లాక్‌డౌన్ వ్యవధిలో టాటా స్కై
తన ఫిట్‌నెస్ సర్వీసును ఉచితంగా అందించడం ప్రారంభించింది. దీనితో పాటుగా
అత్యవసర క్రెడిట్ సేవ వంటి ఇతర కార్యక్రమాలు మరియు మరో పది ప్లాట్‌ఫాం
సర్వీస్ ఛానెల్‌లను ఉచితంగా అందిస్తున్నాయి.
ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ఉచిత ఛానెల్‌లు
ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ఉచిత ఛానెల్‌లు
డిటిహెచ్ ఆపరేటర్లు అందిస్తున్న ప్లాట్‌ఫామ్ సర్వీస్ ఛానెల్‌ల విషయానికి
వస్తే ఎయిర్‌టెల్ డిజిటల్ టివి అధికంగా అందిస్తున్నది. ప్రస్తుతం ఆఫర్‌లో
30 కంటే ఎక్కువ వాల్యూ-ఆధారిత ఛానెల్‌లు ఉన్నాయి.
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ
ఇప్పుడు తన చందాదారులకు అందిస్తున్న ఉచిత ఛానెళ్ల గురించి ఒక SMS
పంపుతోంది.ఈ నాలుగు ప్లాట్‌ఫాం మరియు ప్రీమియం సర్వీస్ ఛానెల్స్-
లెట్స్‌డాన్స్, ఆప్కిరాసోయి, ఎయిర్‌టెల్ సీనియర్స్ టివి మరియు ఎయిర్‌టెల్
క్యూరియాసిటీ స్ట్రీమ్ వంటి ఛానెల్‌లు 2020 ఏప్రిల్ 14 వరకు ఉచితంగా
లభిస్తాయి.
ప్లాట్‌ఫాం సేవలు
ప్లాట్‌ఫాం సేవలు
లాక్డౌన్ ప్రకటన తర్వాత పలు ప్లాట్‌ఫాం సేవలను ఉచితంగా అందుబాటులోకి
తెచ్చిన టాటా స్కై మాదిరిగా కాకుండా ఎయిర్‌టెల్ డిజిటల్ టివి కేవలం ఒక వారం
మాత్రమే సేవలను ఉచితంగా అందిస్తోంది. లాక్డౌన్ మరింత విస్తరించబడుతుందని
మేము ఆశిస్తున్నాము. ఎయిర్టెల్ డిజిటల్ టివి నుండి మరొక కొత్త ఆఫర్ కూడా
అందించవచ్చు.
ఎయిర్‌టెల్ ఫ్రీ ఛానెల్‌ల నంబర్స్
ఎయిర్‌టెల్ ఫ్రీ ఛానెల్‌ల నంబర్స్
ఎయిర్‌టెల్ క్యూరియాసిటీ స్ట్రీమ్ ఛానెల్‌ను కంపెనీ గత వారం
ప్రవేశపెట్టింది. వినియోగదారులు దీనిని ఛానల్ నంబర్ 419 లో యాక్సెస్
చేయవచ్చు. ఇతర ఛానెళ్ల విషయానికొస్తే లెట్స్‌డాన్స్ 113 ఛానల్ నంబర్‌లో,
ఛానల్ నంబర్ 407 లో ఆప్కి రసోయి మరియు 323 ఛానల్ నంబర్‌లో ఎయిర్‌టెల్
సీనియర్స్ టివి అందుబాటులో ఉన్నాయి. ఈ ఛానెల్‌లకు ఇప్పటికే చందాదారులైన
వారు వీటి ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారు. కానీ సభ్యత్వం లేని వారు కూడా ఈ
ఛానెల్‌లను ఉచితంగా చూడవచ్చు.
ఎయిర్టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫాం సర్వీస్ ఛానల్స్
ఎయిర్టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫాం సర్వీస్ ఛానల్స్
ఎయిర్టెల్ డిజిటల్ టివి ప్రస్తుతం టాటా స్కై మరియు డిష్ టివి వంటివాటిని
ఓడించి వాల్యూ యాడెడ్ సర్వీస్ లేదా ప్లాట్‌ఫాం సర్వీస్ ఛానల్స్ విభాగంలో
అందరి కంటే ముందుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ఎయిర్‌టెల్ క్యూరియాసిటీ
స్ట్రీమ్, ఎయిర్‌టెల్ షార్ట్స్ టివి, గుడ్‌లైఫ్, ది హర్రర్ టివి, తెలుగు
టాకీస్, స్పాట్‌లైట్, లెట్స్ డాన్స్, హాలీవుడ్ డైరీస్, ఫిట్‌నెస్ స్టూడియో,
మినిప్లెక్స్, ఎమ్యూసిక్, సదాబహార్, ఓఎం శక్తి, ఐకెఐడిఎస్ , డిస్నీ
స్టోరీస్, పంజాబ్ తడ్కా, ఇగామ్స్, హమర్ కానిమా మొదలైనవి అందిస్తూ ముందు
వరుసలో ఉంది.