Tuesday, August 11, 2015

అటల్ బిహార్ వాజ్ పేయి భారతరత్న






  • లోకమాన్య తిలక్ అవార్డు,గోవింద్ వల్లభ పంత్ అవార్డు, పధ్మవిభూషన్, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు పోందారు.
  • ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారత ప్రధాని
  • అవిశ్వాస తీర్మానం ద్వారా ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని లోల్పోయిన ఏకైఅక ప్రధాని
  • "జై జవాన్ , జైకిసాన్, జై విజ్ఞాన్ " నినాదం

 1926 డిసెంబరు 25న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా సమీప గ్రామం బదేశ్వర్‌లో జన్మించారు. తండ్రి సంస్కృత పండితుడు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. భారతీయ సంస్కృతి పునర్వికాసం కోసం తపించే వాజ్ పేయి.. అర్.ఎస్.ఎస్లో చేరారు. అప్పట్లో క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం అర్.ఎస్.ఎస్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేశారు. 1951లోజన్‌సంఘ్‌ లో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1953లో 31 ఏళ్ల వయస్సులోనే తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1968లో జన సంఘ్ అధ్యక్షుడయ్యారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో జన్‌సంఘ్‌ను జనతా పార్టీలో విలీనం చేశారు. ఇందిర సర్కారు ఆగడాలపై గళమెత్తారు. 1977లో మొరార్జీదేశాయ్‌ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. జనతా ప్రభుత్వం పతనం తర్వాత అద్వానీతో కలసి 1980లో బీజేపీకి ప్రాణం పోశారు. 1984లో కేవలం 2 స్థానాలతో పార్లమెంట్ లో ఉన్న బీజేపీ.. 1996లో మైనారిటీ సర్కారు ప్రధాని ప్రమాణస్వీకారం చేసే స్థాయికి పార్టీని తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది. 1998 ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి రెండోసారి ప్రధాని అయ్యారు. జయలలిత రాజకీయంతో ఈసారి 13 నెలలకే అధికారం కోల్పోయారు వాజ్ పేయి. 1999 ఎన్నికల్లో మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టి... ఇందిరాగాంధీ తర్వాత ప్రధానిగా మూడుసార్లు ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.  సంకీర్ణ ప్రభుత్వాన్ని వాజ్ పేయి విజయవంతంగా నడిపించారు. నవభారత నిర్మాణానికి పునాదులు వేశారు. టెలికామ్‌, పౌరవిమానయాన రంగం, బ్యాంకింగ్‌, బీమా, ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ వాణిజ్యం-పెట్టుబడులు, పన్నులు, విద్యుత్‌, పెట్రోల్‌ ధరలు వంటి.. అనేక అంశాల్లో సంస్కరణలు అమలు చేశారు. వృద్ధిరేటు 8 శాతానికి తీసుకెళ్లారు. 1998 లో అణు పరీక్షలు చేపట్టి.. భారత్ సత్తా చాటారు. వాజ్‌పేయి మంచి ప్రధాని, సంకీర్ణ నేత మాత్రమే కాదు.. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌. ఆయన్ను వరించి వచ్చిన పురస్కారాలెన్నో.. గోవింద్‌ వల్లభ్‌పంత్‌ అవార్డును కూడా అటల్  అందుకున్నారు అటల్‌జీ. 1992లో పద్మవిభూషణ్‌, 1993లో గౌరవ డాక్టరేట్‌, 1994లో లోకమాన్య తిలక్‌ పురస్కారం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. జీవిత చరమాంకంలో భారత రత్నతో ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.




నిర్వహించిన పదవులు

  • 1951 – వ్యవస్థాపక సభ్యుడు, భారతీయ జనసంఘ్
  • 1957 – రెండవ లోక్‌సభకు ఎన్నిక
  • 1957–77 – నాయకుడు, భారతీయ జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ
  • 1962 – సభ్యుడు, రాజ్యసభ
  • 1966-67- ఛైర్మన్, ప్రభుత్వ అస్సూరెన్స్ కమిటీ
  • 1967 – నాలుగవ లోక్‌సభకు మరలా ఎన్నిక (రెండవ సారి)
  • 1967–70 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
  • 1968–73 – అధ్యక్షుడు, భారతీయ జనసంఘ్
  • 1971 – ఐదవ లోక్‌సభకు ఎన్నిక. (మూడవ సారి)
  • 1977 – ఆరవ లోక్‌సభకు ఎన్నిక (నాలుగవ సారి)
  • 1977–79 – కేంద్ర కేబినెట్ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ
  • 1977–80 – వ్యవస్థాపక సభ్యుడు, జనతాపార్టీ
  • 1980 – ఏడవ లోక్‌సభకు ఎన్నిక ( ఐదవ సారి)
  • 1980-86- అధ్యక్షుడు, భారతీయ జనతాపార్టీ (బి.జె.పి)
  • 1980-84, 1986 మరియు 1993–96 – నాయకుడు, బి.జె.పి. పార్లమెంటరీ పార్టీ
  • 1986 – సభ్యుడు, రాజ్యసభ; సభ్యుడు, జనరల్ పర్పస్ కమిటీ
  • 1988–90 – సభ్యుడు, హౌస్ కమిటీ; సభ్యుడు, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ.
  • 1990-91- ఛైర్మన్, కమిటీ ఆన్ పిటీషన్స్.
  • 1991– పదవ లోకసభకు ఎన్నిక (ఆరవ సారి)
  • 1991–93 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ.
  • 1993–96 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్; ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
  • 1996 – 11వ లోక్‌సభకు ఎన్నిక (ఏడవ సారి).
  • 16 మే 1996 – 31 మే 1996 – భారతదేశ ప్రధానమంత్రి.
  • 1996–97 – ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
  • 1997–98 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్.
  • 1998 – 12వ లోకసభకు ఎన్నిక (ఎనిమిదవ సారి).
  • 1998–99 – భారతదేశ ప్రధానమంత్రి; విదేశీ వ్యవహారాలమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
  • 1999 – 13వ లోక్‌సభకు ఎన్నిక (తొమ్మిదవ సారి)
  • 13 అక్టోబరు 1999 నుండి 13 మే 2004– భారతదేశ ప్రధానమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
  • 2004 – 14వ లోక్‌సభకు ఎన్నిక (పదవ సారి)