Monday, August 10, 2015

దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న.


మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. కళలు, సాహిత్యం,వైఙానిక,రాజకీయ, ప్రజాసేవారంగాల్లో విశిష్ట కృషి చేసినవారికి ఈపురస్కారం అందిస్తారు.1954 జనవరిలో ఈ పురస్కారం ప్రారంభించినపుడు మరణానంతరం అందించే ఉద్దేశ్యం లేదు. అందుకే మహాత్మా గాంధికి భారతరత్న ఇవ్వలేదంటారు.1965 జనవరి నుంచి మరణానంతరం కూడా వీటిని ప్రకటించడం ప్రారంభించారు..ఇప్పటికి 42 మంది ఈ పురస్కారం పొందారు.10 మందికి మరణానంతరం ఇచ్చారు. ఈ కోవలోనే 1992లో సుభాష్ చంద్రబోస్ కు ఇచ్చినా సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో వెనక్కు తీసుకున్నారు.భారతరత్న గ్రహీతలు పుట్టుకతో భారతీయులై ఉండి ఉండాల్సిన అవసరం లేదు.విదేశాల్లో పుట్టినా భారతదేశం లో ఉండి ఆతర్వాత భారత పౌరసత్వం తీసుకున్న మదర్థెరిసాకు 1980 లో ఈ పురస్కారం లభించింది.ఆతర్వాత ఇద్దరు భారతీయేతరులకు 1987 లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, 1990లో నెల్సన్ మండేలాకు భారతరత్న లభించింది.
ఇటువంటి ప్రభుత్వ పురస్కారాలకు ఉన్న రాజ్యాంగ బద్ధతపై అనేకసార్లు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు తలెత్తాయి.1954లో పొందుపరిచిన నియమనిబంధనల ప్రకారం భారతరత్న గ్రహీతకు స్వర్ణపతకం ఇస్తారు. ఆ పతకంపై సూర్యుడి బొమ్మ, హిందిలో భారతరత్న అనే మాటలు, పతకం వెనుక ప్రభుత్వచిహ్నం , సత్యమేవజయతే సూక్తి ఉంటాయి. 1957 జనవరి 26 నుంచి నిబంధనలను మార్చారు. పతకాన్ని రావి ఆకు రూపంలో అలంకరించాలి. దీనిని రూపొందించేందుకు కాంస్యాన్ని ఉపయోగించాలి. పతకం వెనుక ఉండే ప్రభుత్వ చిహ్నం, సూర్యుడి చిత్రాలను ప్లాటినంతో చేయాలి.

భారతరత్నను ప్రదానం చేసిన తర్వాత ఎప్పుడైనా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అప్పుడు గ్రహీత పతకం తదితరాలను వాపసు చేయాలి. భారతరత్న అందుకున్న వారి పేర్లతో ఒక రిజిస్టర్ నిర్వహిస్తున్నారు.
అవార్డులు పొందిన వారి వివరాలు పేరు, కాలం, అవార్డు పొందిన సంవత్సరం , కృషిచేసిన రంగాలు ఇలా ఉన్నాయి.

1     సర్వేపల్లి రాధాకృష్ణన్     1954  ఉత్తమ ఉపాధ్యయుడు  
2     సి.రాజగోపాలాచారి     1954    
3     సి.వి.రామన్     1954     శాస్త్రవేత్త
4     భగవాన్ దాస్     1955    
5     ఎం.విశ్వేశ్వరయ్య     1955     తొలి ఇంజనీయరు
6     జవహార్‌లాల్ నెహ్రూ     1955    
7     గోవింద్ వల్లభ్ పంత్     1957    
8     ధొండొ కేశవ కార్వే     1958    
9     బీ.సీ.రాయ్     1961    
10     పురుషోత్తమ దాస్ టాండన్     1961    
11     రాజేంద్ర ప్రసాద్     1962    
12     జాకీర్ హుస్సేన్     1963    
13     పాండురంగ వామన్ కానే     1963    
14     లాల్ బహదూర్ శాస్త్రి     1966     మరణానంతరం
15     ఇందిరాగాంధీ     1971     తొలి మహిళ
16     వి.వి.గిరి     1975    
17     కే.కామరాజు     1975     మరణానంతరం
18     మదర్ థెరీసా     1980     సేవ
19     ఆచార్య వినోబా భావే     1983    
20     ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్     1987     తొలి విదేశీయుడు
21     యం.జి.రామచంద్రన్     1988    
22     బి.ఆర్.అంబేద్కర్     1990     మరణానంతరం
23     నెల్సన్ మండేలా     1990     రెండో విదేశీయుడు
24     రాజీవ్ గాంధీ     1991    
25     సర్దార్ వల్లభాయి పటేల్     1991     మరణానంతరం
26     మొరార్జీ దేశాయి     1991    
27     మౌలానా అబుల్ కలామ్ ఆజాద్     1992     మరణానంతరం
28     జే.ఆర్.డీ.టాటా     1992    
29     సత్యజిత్ రే     1992    
30     సుభాష్ చంద్ర బోస్     1992     తర్వాత ఉపసంహరణ
31     ఏ.పి.జె.అబ్దుల్ కలామ్     1997    
32     గుర్జారీలాల్ నందా     1997    
33     అరుణా అసఫ్ అలీ     1997     మరణానంతరం
34     ఎం.ఎస్.సుబ్బలక్ష్మి     1998     తొలి గాయని
35     సి.సుబ్రమణ్యం     1998    
36     జయప్రకాశ్ నారాయణ్     1998    
37     రవి శంకర్     1999    
38     అమర్త్యా సేన్     1999    
39     గోపీనాథ్ బొర్దొలాయి     1999    
40     లతా మంగేష్కర్     2001    
41     బిస్మిల్లా ఖాన్     2001    
42     భీమ్ సేన్ జోషి     2008    
43     సచిన్ టెండుల్కర్     2013     తొలి క్రీడాకారుడు
44     సి.ఎన్.ఆర్.రావు     2013    
45     అటల్ బిహారి వాజపేయి     2014    ఉత్తమ రాజీకీయ వేత్త
46     మదన్ మోహన్ మాలవీయ     2014    
No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.