ఇద్దరి మనసులు కలిసిన శుభ వేళ.. వారిద్దరి ఆలోచనలు ఒక్కటైతే.. మాటల పూతోటల్లో తేలియాడాలన్న భావాలతో జీవిత గమ్యాన్ని 'పొదుపు'బంధంతో ముడివేస్తే.. అవధులు లేని ఆనందానికి మార్గాన్ని సృష్టిచుకుంటారు. ఇదేదో చమత్కారానికో.. లేక పదాతలో ఆకట్టుకోవడానికో అని భావిస్తే మీరూ తప్పులో కాలేసినట్లే... ఇది కొత్తగా పెళ్లైన వారిని ఉద్ధేశించినదే అయినా.. పెళ్లైన వారూ ఇప్పటి నుండైనా క్రయం తప్పకుండా జీవితం సాఫీగా సాగిపోవడానికి వీలుగా 'ఆర్ధిక' వంతెనను నిర్మించుకోవడం ఎంతో అవసరం. ప్రస్తు తం పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో నేటి తరం వారు ఒక్క అడుగు పొదుపు, వారి జీవితానికి అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం ఎంతో అవసరం. వివాహం అనేది జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఒక్క టైన దంపతులు జీవితాంతం ఎలా ఉండాలో నిర్ణయించుకోవడంలో ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉండాలి. అటువంటి సందర్భంలోనే కష్టాలకు స్వస్తి చెప్పి.. ఆనంద డోలికలల్లో తేలియాడే రోజులు ముందుంటాయి. ఇద్దరి మధ్య అవగాహన ముఖ్యం. అవగాహనతో పాటు సమా చారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఇంకా ముఖ్యం. కొత్తదంపతుల ఆలొ చనలు సమాంతరంగా ఉంటే.. ఆర్ధిక ఒడుదుడుకులను నెట్టుకు వచ్చే ఓర్పు నేర్పు వాటంతట అవే వస్తాయి. ఆర్ధిక సంబంధ విషయాలలో కొత్తగా పెళ్ళైన దంపతులు తీసుకోవాల్సిన జాగ్రతలు.. ఆర్ధికాంశాలతో కూడిన ఏడడుగులు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. వాస్తవాలను గుర్తించడం : వివాహం అయిత తరువాత భార్యా భర్తలిద్దరూ పూర్తి స్వేచ్ఛా వాతావరణంలో మనసువిప్పి మాట్లాడుకో వడం అవసరం. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలన్న చం దాన.. కష్టాలు నెత్తిన పడ్డాక ఆలోచనలు ప్రారంభించడం అంత మం చిది కాదు. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగస్తులయితే వారిద్దరికి వచ్చే నెల సరి ఆదాయం, ఖర్చులను మొదటి అంచనా వేసుకోవాలి. ఉన్నత చదువుల కోసం ఏదైనా బ్యాంక్ రుణాలు పొంది ఉంటే.. వాటిని సాధ్య మైనంత త్వరగా చెల్లించడం ముఖ్యం. తల్లితండ్రులు వారి ఉన్నత విద్యాభ్యాసానికో.. విదేశీ చదువులకో.. విదేశీ ఉద్యోగ అవకాశాలకో రుణాలు పొంది ఉంటే తిరిగి చెల్లించి మంచి రుణ చెల్లింపుల కుటుం బంగా జీవితపు తొలిమెట్టు ఎక్కడంలో ఎంతో సంతోషముంటుంది. మీ ఆలోచనలకు ఆర్ధిక స్థోమతను సరి చూసుకోవాలి : ఇక రెండవ మెట్టు ఎక్కేముందు ఒక్కసారి ఇద్దరి ఆలోచనలకూ పదును పెట్టండి. భవిష్యత్తులో ఎలాంటి ఇంటిని నిర్మించుకోవాలి భావిస్తు న్నారు..? ఎలాంటి వాహనాన్ని కొనాలని ఉత్సాహ పడుతున్నారు..? అసలు ఇంటికి కావలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటి..? వాటికి ఎంత ఖర్చు అవుతుంది. ఊహించిన దానికంటే మరింత ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంటే మీరు ఏదైనా బ్యాంక్ నుండి రుణ సదుపా యాన్ని పొందాల్సి ఉంటుంది. అలాంటి సమయంలోనే మీరు గతం లో రుణాలు తిరిగి చెల్లించడంలో ఎలాంటి రిమార్క్ లేకుండా ఉండ టం ఇప్పుడు మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇక ఆలోచిం చేది ఏముంది.. మీ రాబడిని ఊహించి రుణాలకు ప్రయత్నించండి. పొదుపు అలవాటు ఎంతో ముఖ్యం : పె ళ్ళైన కొత్తలో భార్యా భర్తలిద్దరూ చేసే ఖర్చులు ఆతరువాత పరిశీలించి చూస్తే గుండె గుభే లంటుంది. అయితే ముందు నుండీ ఒక ప్రణాళికా బద్ధంగా మీరు చేసే ప్రతీ పైసాని ఒక కాగితంపై రాసిపెట్టుకోవడం ఎంతో అవసరం. అలా చేయడం వల్ల మీరు ఖర్చు చేసే ప్రతీ రూపాయి అవసరంగా ఖర్చు చేశారో.. అనవసరమైన ఖర్చులకు వెళ్లిందో తెలుసుకోవడం ఎంతో తేలిక. మీరు ఖర్చుల జాబితాను పరిశీలించిన తరువాత ఆదా యంలోకి కొంత సొమ్మును 'పొదుపు' వైపు మళ్లించుకోవడం కీలక మైనది. మీ జీవితంలో భార్యాభర్తలు కావడంలో ఎటువంటి సంతో షాన్ని అనుభవించారో మీరు చేసే పొదుపు మూలంగా భవిష్యత్తులో అంతకు నూరు రెట్లు సంతోషాన్ని అనుభవిస్తారన్నది సత్యం. ఈ పొదుపును జీవితంలో ఒక అలవాటుగా చేసుకోవడం ఇద్దరికీ మంచిది. పొదుపు సొమ్ముపై దృష్టి పెట్టండి : ప్రతీ నెలానెలా లేదా ఏటా మీరు చెల్లిస్తున్న పొదుపు సొమ్ముపై మీరు దృష్టి పెట్టాలి. అయితే పొదుపు సొమ్మును ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవడానికి ప్రయత్నించ వద్దు. అలాగే ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీనే మీరు ఉపయోగించుకోవాలే తప్ప. వాటి ప్రీమియం కాల పరిమితి పూర్తి కాకుండానే మధ్యలో రద్దు చేసుకోవడం, లేదా వాటిపై అధిక రుణాలు పొందడం కొంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందువల్ల ఫిక్సిడ్ చేసిన వాటి కాలపరిమితి వరకూ వాటి జోలికి వెళ్లకుండా ఉండటం ఎంతో మేలు.