Thursday, March 20, 2014

జలుబు, గొంతు నొప్పి ఉంటే...ఆరోగ్యదాయిని రెడ్‌ క్యాబేజి....కిడ్నీలు ఫెయిలయితే?

 జలుబు, గొంతు నొప్పి ఉంటే...

గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి గొంతులో పడేలా పుక్కిట పట్టాలి. పుక్కిట పట్టేప్పుడు సుమారు 10నుంచి 15 నిముషాలపాటు చేయాలి. రోజుకు 4నుంచి 6సార్లు పుక్కిట పట్టాలి. చల్లని నీళ్లు, ఐస్‌క్రీమ్‌, కూల్‌డ్రింక్‌ తీసుకున్నవారు వీలైనంత త్వరగా గోరు వెచ్చని నీటితో నీళ్లను పుక్కిలిస్తే జలుబు, గొంతు నొప్పి, బొంగురు గొంతు రాకుండా నివారించుకోవచ్చు. 


ఆరోగ్యదాయిని రెడ్‌ క్యాబేజి

 ఆకుపచ్చని ఆకుకూరలు, కాయగూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసినదే. కొన్ని రకాల కూరగాయలు సాధారణ ప్రయోజనాలను అందిస్తే, మరికొన్ని రకాల కూరగాయలు మరింత సమర్థంగా పని చేస్తాయి. ఒకే రకానికి చెందిన కూరగాయలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఉదాహరణకు వంకాయ ఊదా రంగులోనే కాకుండా, తెలుపు రంగులోనూ లభిస్తుందనే విషయం మనకు తెలిసినదే. క్యాప్సికమ్‌ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. క్యాబేజ్‌ కూడా తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఇలా భిన్న రంగులున్న కూరగాయలు, పండ్లు ఎంతో సమర్థంగా పని చేస్తాయి. ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పెప్సిన్‌ పదార్థాలు పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు యాపిల్‌, టమాటో, బెల్‌ పెప్పర్‌ వంటి ఎరుపు రంగు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో అనేక పోషక విలువలు ఉంటాయి. ఎరుపు రంగు క్యాబేజ్‌ ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిద్దాం. బరువు తగ్గడం రెడ్‌ క్యాబేజిలో నీరు అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఊబకాయ సమస్య ఉన్నవారు బరువు తగ్గడానికి ఈ క్యాబేజి జ్యూస్‌ లేదా సలాడ్‌ రూపంలో తీసుకోవడం మంచిది. 



కిడ్నీలు ఫెయిలయితే?

 మన శరీరంలో అనేక క్రియలను నిర్వర్తించే అవయవాల్లో మూత్రపిండాలు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. చిక్కుడు గింజ ఆకారంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఇవి కడుపులో వెనుకభాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఛాతీకి కింది భాగంలో ఎముకల మధ్య సురక్షితంగా ఇమిడి ఉంటాయి. ప్రతి మూత్రపిండం సాధారణంగా 10 సెంటీమీర్ల పొడవు, 5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని బరువు 150నుంచి 170 గ్రాముల వరకూ ఉంటుంది. మూతపిండాలు శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలను మూత్రవిసర్జన ద్వారా బైటకు పంపుతుంది. వీటితోపాటు శరీరంలో నీటి సమతుల్యత, రక్తపోటు, రక్తపు గడ్డలు, కాల్షియం మొదలైన వాటిని నియంత్రిస్తుంది. మన శరీరంలో ప్రతి రెండు నిముషాలకు రెండు మూత్రపిండాలలో 1200 మిల్లిdలీటర్ల రక్తం శుభ్రమవుతుంది. 24 గంటలలో 1700 లీటర్ల రక్తం శుద్ది అవుతుంది. మూత్రపిండాల వ్యాధి లక్షణాలు ఉదయం నిద్ర లేచిన వెంటనే కళ్లు వాచి ఉండటం ఆకలి తక్కువగా ఉండటం, వాంతులు, వికారంగా అనిపించడం రాత్రిళ్లు ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం చిన్న వయస్సులోనే రక్తపోటు ఉండటం కొంచెం నడిస్తే ఆయాసం, నీరసంగా అనిపించడం ఆరు సంవత్సరాల తరువాత కూడా మంచంపై మూత విసర్జన చేయడం మూత్ర విసర్జన సమయంలో మంట, చీము, రక్తం రావడం, మూతం బొట్లు బొట్లుగా రావడం కడుపులో పుండ్లు కావడం, కాళ్లు, నడుము నొప్పులు పై లక్షణాలు ఏవైనా ఉంటే మూత్రపిండాల వ్యాధిగా అనుమానించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ దీనిలో క్రమబద్ధంగా పని చేస్తున్న మూత్రపిండాల హఠాత్తుగా తక్కువ సమయంలో పని చేయకుండా పోతాయి. దీనికి వాంతులు కావడం, మలేరియా, రక్తపోటు మొదలైనవి ప్రధాన కారణాలు. తగిన మందులు ఇవ్వడం, డయాలిసిస్‌ చేయడం ద్వారా సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు. క్రానిక్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ మూత్రపిండాలు మెల్లమెల్లగా దీర్ఘకాలంలో క్షీణిస్తుంటాయి. శరీరంలో వాపు రావడం, ఆకలి తక్కువగా ఉండటం, వాంతులు, నీరసం, మనస్సు సరిగ్గా లేకపోవడం, తక్కువ వయస్సులోనే రక్తపోటు అధికంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. రక్తపరీక్షలో క్రియాటిన్‌, యూరియాల పరిమాణం ద్వారా మూత్రపిండాలు పని చేసే విధానం గురించి తెలుసుకుంటారు. మూత్రపిండాల పనితీరుమందగించిన కొద్దీ రక్తంలో క్రియాటిన్‌, యూరియా పరిమాణం ఎక్కువవుతుంది. మూత్రపిండాలు అత్యధికంగా పాడైపోతే అంటే సామాన్యంగా క్రియాటిన్‌ 8 నుంచి 10 మిల్లిdగ్రాములు పెరిగినప్పుడు మందులు తీసుకున్నప్పటికీ ఆహార నియమాలు పాటించినప్పటికీ రోగి పరిస్థితిలో మెరుగు కనిపించదు. ఇటువంటి పరిస్థితుల్లో రెండు రకాల మార్గాలు ఉంటాయి. డయాలిసిస్‌, కిడ్నీ మార్పిడి. డయాలిసిస్‌ శరీరంలో రెండు మూత్రపిండాలు పాడైపోయినప్పుడు శరీరంలో అనవసరమై, విసర్జించబడిన పదార్థాలు, నీటి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని బయటకు పంపించే ప్రక్రియను డయాలిసిస్‌ అంటారు. మిషన్‌ ద్వారా శుద్ధి చేయడం (హీమోడయాలిసిస్‌) ఈ పద్ధతిలో హీమోడయాలిసిస్‌ అనే మిషన్‌ సహాయంతో కృత్రిమ కిడ్నీ (డయలైజర్‌)లో రక్తాన్ని శుద్ధి చేస్తారు. మిషన్‌ సాయంతో రక్తాన్ని శుభ్రపరిచి తిరగి శరీరంలోకి పంపుతుంటారు. రోగి ఆరోగ్యకరంగా ఉండటానికి వారానికి రెండు లేదా మూడుసార్లు డయాలిసిస్‌ చేయాల్సి ఉంటుంది. హీమోడయాలిసిస్‌ చేసుకునే సమయంలో రోగి మంచంపై పడుకుని ఉండగానే ఆహారం తీసుకోవడం, టి.వి. చూడటం వంటి పనులు చేసుకోవచ్చు. ప్రతిసారి డయాలిసిస్‌ చేసుకునేందుకు 4 గంటల సమయం పడుతుంది. పెరిటోనియల్‌ డయాలిసిస్‌ (పొట్ట డయాలిసిస్‌ సిఎపిడి) ఈ పద్దతిలో రోగి మిషన్‌ ఉపయగించుకుండా, నేరుగా ఇంట్లోనే డయాలిసిస్‌ చేసుకోవచ్చు. సిఎపిడిలో ఒక రకమైన అనువుగా ఉండే ఒక పైప్‌ను పొట్టలో అమరుస్తారు. ఈ పైప్‌ ద్వారా ప్రత్యేకమైన ఫ్లూయిడ్‌ను పంపుతారు. కొన్ని గంటల తర్వాత ఆ ద్రవాన్ని మళ్లిd బైటకు తీసినప్పుడు ద్రవంతోపాఉటగా వ్యర్థాలు కూడా బయటకు వచ్చేస్తాయి. యురినరీ ఇన్‌ఫెక్షన్‌ మూత్రం పోసేప్పుడు మంటగా ఉండటం, మాటిమాటికీ యూరిన్‌ రావడం, బొడ్డు కింద భాగంలో నొప్పి, జ్వరం రావడం యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ ముఖ్య లక్షణాలు. దీన్ని మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో దీనికి చికిత్స ఇస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం అవసరం. చికిత్స ఇవ్వడం ఆలస్యం చేసినా, సరైన చికిత్స ఇవ్వకపోయినా మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. డాక్టర్‌ శ్రీధర్‌ నెఫ్రాలజిస్ట్‌,గ్లోబల్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌ సెల్‌ : 9885376705