Friday, January 12, 2024

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ నెల 31 వరకు పెండింగ్‌ చలాన్ల రాయితీ గడువు పెంపు

 


 

హైదరాబాద్‌: రాష్ట్రంలో వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు. ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది. వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో గడువు పొడిగించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్వినియోగం చేసుకొని పెండింగ్‌ చలాన్లు మొత్తం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం డిసెంబర్‌ 26 నుంచి పెండింగ్‌ చలాన్లపై రాయితీలను ప్రకటించింది.

టూ, త్రీ వీలర్‌ వాహనాల చలాన్లపై 80 శాతం రాయి తీ, ఆర్‌టీసీ బస్సులపై 90 శాతం, లైట్‌, హెవీ వెహికిల్స్‌పై 60 శాతం రాయితీ ఇస్తున్నారు. వాహనదారులు పెండింగ్‌ చలాన్ల వివరాలను www. echallan.tspolice.gov.in/ pu blicviewలో చూసి, చెల్లించాలని సూచించారు. చలాన్లను మీ సేవా, టీ వాలెట్‌, ఈ సేవా, ఆన్‌లైన్‌, పేటీం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చని వెల్లడించారు. చలాన్ల రాయితీ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.113 కోట్ల ఆదాయం వచ్చింది. పెండింగ్‌ చలాన్లు 3.59 కోట్లు ఉండ గా, ఇప్పటివరకు 1.29 కోట్ల చలాన్లను వాహనదారులు చెల్లించారు.

 

బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్ గా దిశా గా మార్పు..!?

 

 



తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ తిరిగి శక్తి పుంజుకొనే ప్రయత్నం చేస్తోంది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో పార్టీ పేరు పైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్పు చేయాలని సీనియర్లు కోరుతున్నారు. మరి ఈ దిశగా కేసీఆర్ అంగీకరిస్తారా.

తిరిగి మారుస్తారా : బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ మార్చే ఆలోచన ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేరులో తెలంగాణ లేకపోవటం నష్టం చేసిందనే అభిప్రాయంలో సీనియర్లు ఉన్నారు. దీంతో, తిరిగి పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని కోరుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్‌ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని చెప్పుకొచ్చారు. కొంత మంది ప్రజలు అలా భావించి పార్టీకి దూరమై ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేసారు. తెలంగాణ ఇంటి పార్టీగా పేరులోనే తెలంగాణ ఉండాలనేది సీనియర్లు చెబుతున్న మాట. పార్టీ పేరులో తిరిగి తెలంగాణ చేర్చటం ద్వారా పూర్వవైభవం సాధ్యమేనని అంచనా వేస్తున్నారు.

సీనియర్ల కీలక వ్యాఖ్యలు : ఎక్కువమంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్టు కడియం చెప్పినట్టు సమాచారం. పార్టీ పేరులో ‘తెలంగాణ’ను తొలగించి, ‘భారత్‌’ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా పార్టీలో తిరిగి తెలంగాణ ఉండేలా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని కోరుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలోనే కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యతగా మారింది. ఒకవేళ జాతీయస్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలనుకుంటే అలాగే ఉంచి.. రాష్ట్ర రాజకీయాలకు ‘టీఆర్ఎస్’ను తెర మీదకు తీసుకొచ్చే విషయాన్ని ఆలోచించాలి. ఇందులో న్యాయపరమైన అంశాలేమైనా ఉంటే మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ వంటివారు ఈ విషయంలో సంబంధిత నిపుణులతో చర్చిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ సిద్దమేనా : ఈ మార్పు అంశాన్ని కేసీఆర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కడియం శ్రీహరి వివరించారు. అయితే, ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ పోటీ చేయాలని కేసీఆర్ ఆలోచన గా తెలుస్తోంది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురు కావటంతో ఇప్పుడు ముందుగా తెలంగాణలో తిరిగి బలం పెంచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమయంలో పార్టీ మార్పు పైన చర్చ మొదలైంది. అదే విధంగా పార్టీ పరంగానూ కీలక పదవుల్లో మార్పులు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. కేటీఆర్ పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ పేరు తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్ పైన కేసీఆర్ తీసుకొనే నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.

 

Wednesday, January 10, 2024

ఆ రోజు కన్నీళ్లు కార్చాను.. మంత్రి పొంగులేటి ఎమోషనల్‌

 ఖమ్మం జిల్లా: గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షతకు గురయ్యారని,  నిరుద్యోగులు అందరూ కలసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారంటూ వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఖమ్మం నగరంలోని భక్త రామదాస్  కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఆత్మీయ సత్కారంలో మంత్రి పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో  ఆ కుటుంబం చెప్పిందే వేదం.. గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది. మా ప్రభుత్వంలో ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందని మంత్రి పేర్కొన్నారు.


 

మంత్రి ఎమోషనల్‌..
నన్ను ఒంటరిగా చేసినప్పుడు కన్నీళ్లు కార్చానని.. ఆ రోజు అభిమానులు బాధపడతారని వారి ఎదుట ఎమోషనల్ కాలేదని.. మంత్రి  పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు.

Tuesday, January 9, 2024

New Year Offer: జియోలో ఆ ప్లాన్ రిఛార్జ్ చేసుకుంటే 24 రోజుల అదనపు లబ్ధి.

 


 

ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం జియో "హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024"ని ప్రకటించింది. వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకదాన్ని రిఫ్రెష్ చేసింది. న్యూ ఇయర్ ఆఫర్ లో 24 రోజుల అదనపు చెల్లుబాటు ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది దాని సాధారణ 365 రోజుల చెల్లుబాటుకు అనుబంధంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం కేవలం రూ. 2,999 ప్లాన్ తో లభిస్తుంది. ప్లాన్‌లో అందించే ప్రయోజనాలు అలాగే ఉంటాయి.

రిలయన్స్ యాజమాన్యంలోని నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్ తన వెబ్‌సైట్‌లో నిబంధనలు, షరతుల వివరించింది. దీర్ఘకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 2,999 తో అదనంగా 24-రోజుల చెల్లుబాటు వోచర్‌తో వస్తుంది. ఇది ప్లాన్‌ని దాని సాధారణ 365-రోజుల చెల్లుబాటు ముగిసిన తర్వాత అదనంగా 24 రోజుల పాటు కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఫలితంగా మొత్తం 389 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ప్లాన్‌ని Jio వెబ్‌సైట్‌లోని ప్రీపెయిడ్ ప్లాన్ పేజీ ద్వారా లేదా MyJio అప్లికేషన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

 

ఆ 24 అదనపు రోజులలో అంతకు ముందు ఉన్న ప్రయోజనాలు కొనసాగుతాయి. దీన్ని కొనుగోలు చేయడానికి ఎంచుకున్న కస్టమర్లు రూ. 2,999 చెల్లించాలి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMSలను పొందుతారు. ఈ ప్లాన్ అపరిమిత 5G డేటా కూడా వస్తుంది. అయితే 5G యాక్సెసిబిలిటీ ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది. 5G నెట్‌వర్క్ కవరేజ్ ప్రాంతంలోని వినియోగదారులు దీన్ని యాక్సెస్ చేయగలరు.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో JioTV, JioCinema, JioCloudకి కూడా యాక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్యాకేజీతో చేర్చబడిన JioCinema సబ్‌స్క్రిప్షన్ JioCinema ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కాదు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కావాలనుకుంటే JioCinema పోర్టల్ ద్వారా 1,499 రిఛార్జ్ చేసుకోవాలి.. JioTV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఒకే ప్లాన్ కింద గరిష్టంగా 14 రకాల OTT యాప్‌లకు యాక్సెస్‌ చేసుకోవచ్చు.

 

2023 సంవత్సరం అత్యధిక మంది డౌన్ లోడ్ చేసుకున్న యాప్స్ ఇవే..

 

ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. దాదాపు అందరి వద్ద ఫోన్లు ఉన్నాయి. అయితే మనం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నట్లయితే ఎక్కువగా యాప్స్ వాడతాం. గూగుల్ ప్లే స్టోర్ లో నిమిషాని ఒక యాప్ షేర్ అవుతుందంటే.. అర్థం చేసుకోవచ్చు.. ఏ రేంజ్ లో యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారో. 2023లో అత్యధిక మంది డౌన్ లోడ్ చేసుకున్న 5 ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..

రీల్సీ రీల్ మేకర్ యాప్. ఇది ఈ డిజిటల్ జనరేషన్ లో రీల్స్ మేకింగ్ అనేది ఒక్కోసారి కెరీర్ ను కూడా సెట్ చేస్తోంది. కంటెంట్ క్రియేషన్ కోసం ఇప్పటికే వచ్చిన ఎన్నో యాప్‌లు మార్కెట్‌లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇక ఇటీవలి కాలంలో వచ్చిన ఈ రీల్సీ రీల్ మేకర్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా మారడంతో భారీగా డౌన్ లోడ్స్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్‌ పోస్ట్ చేసేందుకు యూజర్స్ కు ఇది ఉపయోగపడడంతో భారీగా స్పందన వచ్చింది.

 

రీల్సీ రేటింగ్ యాప్ ఇది జెడ్ ఇటాలియా యాప్‌లచే డెవలప్ చేసింది. ఈ యాప్‌ పర్చేస్ బేస్ లో అంటే కొనుగోలు ప్రక్రియ ద్వారా పని చేస్తుంది. దాదాపు 15వేల రివ్యూస్ తో 3.9 రేట్ ఉన్న ఈ యాప్ ను 5లక్షల డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడిస్టోరీ - మూడ్ ట్రాకర్ యాప్.. ఇది
మూడ్ ట్రాకర్ అండ్ ఎమోషన్ ట్రాకర్ యాప్ గా మంచి గుర్తింపు పొందింది. ఇది ఒక్క పదం కూడా రాయకుండా 5 సెకన్లలోపు మూడ్ ట్రాకింగ్ ఎంట్రీలను క్రియేట్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. 4.3 రేటింగ్ తో 10వేల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

వాయిడ్‌పెట్‌ గార్డెన్ మెంటల్ హెల్త్ యాప్. ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన యాప్ గా పేరు పొందింది. యూజర్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. 9400 రివ్యూస్ తో 4.4 రేటింగ్ ఉండడంతో పాటు ఈ యాప్ ను 1లక్ష మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. థ్రెడ్స్ యాప్.. దీన్ని ఫేస్ బుక్ మెటా యాజమాన్యం తీసుకొచ్చారు. దీన్ని X(ట్విట్టర్)కి పోటీగా తీసుకొచ్చారు. ఈ యాప్ ను 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇన్ సైట్ జర్నల్ యాప్ AI- పవర్డ్ ప్రాంప్ట్‌లతో పని చేస్తుంది. అందులో వచ్చే సమస్యలను పరిష్కరించడంలో యూజర్స్ కు ఉపయోగపుతుంది. దీన్ని 10వేల కంటే ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.


 

G
M
T
Y
Text-to-speech function is limited to 200 characters