Friday, January 12, 2024

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ నెల 31 వరకు పెండింగ్‌ చలాన్ల రాయితీ గడువు పెంపు

 


 

హైదరాబాద్‌: రాష్ట్రంలో వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు. ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది. వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో గడువు పొడిగించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్వినియోగం చేసుకొని పెండింగ్‌ చలాన్లు మొత్తం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం డిసెంబర్‌ 26 నుంచి పెండింగ్‌ చలాన్లపై రాయితీలను ప్రకటించింది.

టూ, త్రీ వీలర్‌ వాహనాల చలాన్లపై 80 శాతం రాయి తీ, ఆర్‌టీసీ బస్సులపై 90 శాతం, లైట్‌, హెవీ వెహికిల్స్‌పై 60 శాతం రాయితీ ఇస్తున్నారు. వాహనదారులు పెండింగ్‌ చలాన్ల వివరాలను www. echallan.tspolice.gov.in/ pu blicviewలో చూసి, చెల్లించాలని సూచించారు. చలాన్లను మీ సేవా, టీ వాలెట్‌, ఈ సేవా, ఆన్‌లైన్‌, పేటీం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చని వెల్లడించారు. చలాన్ల రాయితీ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.113 కోట్ల ఆదాయం వచ్చింది. పెండింగ్‌ చలాన్లు 3.59 కోట్లు ఉండ గా, ఇప్పటివరకు 1.29 కోట్ల చలాన్లను వాహనదారులు చెల్లించారు.