Thursday, September 26, 2024

IMP: గుండెపోటు నుంచి పాము కాటు వరకు 10 రకాల ప్రథమ చికిత్సల వివరాలు- మీరు తెలుసుకోండి

 


 First Aid for Emergency Cases : ప్రమాదాలనేవి చెప్పిరావు. అవి వచ్చినప్పుడు ఆందోళన పడకుండా అప్పటికప్పుడు చేపట్టే తాత్కాలిక ఉపశమన చర్యే ప్రథమ చికిత్స. అయితే, కాలిన గాయాలు, ప్రమాదాలు, విరిగిన ఎముకలు, గుండెపోటు, పక్షవాతం, కుక్క కాటు, పాము కాటు, వడదెబ్బలు లాంటి వాటికి ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

First Aid for Emergency Cases
: ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లెలోపు రోగికి చేసే చికిత్సనే ప్రథమ చికిత్స అంటారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను వైద్య పరిభాషలో 'Golden Hour' అంటారు. రోగికి మొదటి గంటలో సరైన చికిత్సను అందించడం ద్వారా అతడిని ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించవచ్చని వైద్యలు చెబుతున్నారు. అందులో భాగంగా 10 రకాల ప్రథమ చికిత్సలను గురించి ఇప్పడు తెలుసుకుందాం.

    బెణికిన గాయాలు : బెణికిన గాయం (Sprain Injuries)పై ఆయింట్‌మెంట్‌తో గట్టిగా రుద్దకూడదని వైద్యలు సూచిస్తున్నారు. మొదట దళసరి వస్త్రం, పాలిథీన్ కవర్‌లో ఐస్ ఉంచి కాపడం పెట్టాలంటున్నారు. అనంతరం ఆ వ్యక్తికి క్రేప్ బ్యాండేజ్‌తో కట్టుకట్టాలని, గాయం అయిన ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టి విశ్రాంతి తీసుకునేలా చూడాలంటున్నారు వైద్యులు. అనంతరం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

    కాలిన గాయాలు : ఎదైనా ప్రమాదం జరిగినప్పుడు శరీరం కాలిపోతే ముందుగా కాలిన ప్రాంతాన్ని చల్లని నీటిలో 15-20 నిమిషాలు ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అరచేయి మందంలోపు గాయం అయితేనే గాయంపై ఆయింట్‌మెంట్ రాయాలని చెబుతున్నారు.కాలిన బొబ్బలను చిదమకూడదు. బ్యాండేజ్‌తో కట్టు కట్టకూడదు. ఐస్ కూడా పెట్టకూడదని, మంటలు అంటుకున్నప్పుడు పరిగెత్తకూడదు. ఎస్​డీఆర్ (SDR) నియమం పాటించాలి. ఆగడం, కింద పడిపోవడం, అటూ ఇటూ దొర్లడం లాటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

    పాయిజన్ (విషం) తీసుకోవడం: పాయిజన్ తీసుకున్న వ్యక్తికి విషతీవ్రతను (Poison) తగ్గించడానికి ఎక్కువ నీటిని ఇస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యలు సూచిస్తున్నారు. అలాంటివారిని ఆస్పత్రికి వెళ్లేవరకూ స్పృహ తప్పిపోకుండా చూసుకోవాలని వైద్యలు సలహా ఇస్తున్నారు. పక్కకు పడుకోబెట్టి గడ్డాన్ని ఎత్తిపెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లాలంటున్నారు. వెళ్లకిలా పడుకోబెట్టకూడదు, దానివల్ల నాలుక గొంతుకు అడ్డుపడి శ్వాస ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యలు.

    ఎముకలు విరగడం: ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగితే (Bones Break), రోగి ఆందోళన చేందకుండా చూసుకోవాలని, ఆ తరువాత ఎముక విరిగిన ప్రాంతాన్ని కదలనివ్వకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెబుతున్నారు.

    పక్షవాతం : బీపీ (రక్తపోటు) ఎక్కువగా ఉన్నవారు ఒళ్లు తిరుగుతుందనీ, తిమ్మిరిగా ఉందని చెబితే ఆ వ్యక్తిని నవ్వమని అడగండి. అలా అతడు నవ్వేటప్పుడు మూతి వంకరగా ఉన్నా, సరిగ్గా మాట్లాడలేకపోయినా, చేతులు ఎత్తలేకపోయినా పక్షవాత (Paralysis) చిహ్నంగా భావించాలని వైద్యులు చెబుతున్నారు. వెంటనే (గోల్డెన్ అవర్)లోపు ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యలు సూచిస్తున్నారు.

    కుక్కకాటు : కుక్కకాడు (Dog Bite), పిల్లి, కోతి, ఎలుక కరిచిన వెంటనే ఆ ప్రాంతాన్ని సబ్బునీటితో కడగాలని వైద్యలు సూచిస్తున్నారు. బ్యాండేజ్ కట్టుకట్టడం, కుట్లు వేయడం లాంటివి చేయకూడదని చెబుతున్నారు. వెంటనే మీకు దగ్గర్లో ఉన్న వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

    కరెంట్ షాక్ : ఏ వ్యక్తికైనా కరెంట్ షాక్ (Electric shock) కొట్టినట్లు అనిపిస్తే వెంటనే స్విచ్‌లు ఆపాలి, ప్లగ్‌లు తొలగించాలి. షాక్ తగిలిన వ్యక్తి గడ్డాన్ని పైకెత్తి ఉంచాలి. శ్వాస తీసుకోలేకపోతే కృత్రిమ శ్వాస కల్పించాలి. షాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ జరిగితే గుండె తిరిగి కొట్టుకునేలా ప్రయత్నాలు చేయాలని ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యలు సూచిస్తున్నారు.

    గుండెపోటు : ఛాతీ ప్రాంతంలో తీవ్రంగా పొడిచినట్లుగా అనిపించడంతో పాటుగా నొప్పి పెరిగిపోవడం, శరీరంలో ఇంకెక్కడైనా నొప్పిగాఉంటే గుండెపోటు (Heart Attack) లక్షణాలుగా వైద్యలు చెబుతున్నారు. ఆగకుండా చెమటలు, కడుపులో వికారంతో కూడిన ఛాతీ నొప్పిని గుండెపోటు లక్షణాలని చెబుతున్నారు. అలాంటి సమయంలో ఆ వ్యక్తిని పడుకోబెట్టకూడదు, నిల్చోబెట్టకూడదు, నడిపించవద్దు కూర్చోబెట్టి దగ్గమని చెబుతూ దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించాలని వైద్యలు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కాస్త ఫలితం కనిపిస్తుందని అంటున్నారు.

    కళ్లు తిరిగి పడిపోవడం :
కళ్లుతిరిగి పడిపోవడం అనేది అనేక అనారోగ్య కారణాల వల్ల వస్తుంది. కళ్లు తిరిగి పడిపోయిన వ్యక్తి కాళ్లను ఎత్తుగా పెట్టి తలను పక్కకు పెట్టి ఉంచాలని వైద్యలు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెదడుకు రక్తస్రావం జరిగి తిరిగి త్వరగా కోలుకుంటారని వైద్యలు సూచిస్తున్నారు.

    పాముకాటు : పాముకాటుకు గురైన వ్యక్తి మరణించడానికి 90% కారణం భయమే కారణం అంటున్నారు నిపుణులు. అందుకనే పాముకాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అయితే, పాముకాటు (Snake Bite), తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం, రక్తంపీల్చడం లాంటివి చేయరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు ఉన్నాయి.

ప్రథమ చికిత్స చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి : ఎవ్వరికైనా ప్రథమ చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైతే గ్లోవ్స్ ధరించాలంటున్నారు. డెట్టాల్ లాంటి యాంటీసెప్టిక్ లోషన్‌ను నేరుగా వాడకూడదని సూచిస్తున్నారు. కొన్ని చుక్కలు నీళ్లలో కలిపి, దూదితో గాయాలను శుభ్రం చేయాలని పేర్కొంటున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

 

ఇజ్రాయెల్ రక్షణ కవచం! 10సెకన్లలో 20క్షిపణుల ప్రయోగం- 'ఐరన్ డోమ్' సక్సెస్‌ రేటు 90%!! - Israel Iron Dome Technology

 


 ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా పరస్పర దాడులతో మరోసారి వినిపిస్తున్న పేరు ఐరన్ డోమ్‌. ఇజ్రయెల్ రూపొందించిన ఈ రక్షణ వ్యవస్థ ఈ నెల 23న హెజ్‌బొల్లా ప్రయోగించిన వందలాది రాకెట్లను గాలిలోనే పేల్చివేసింది. రాత్రివేళ ఆకాశంలో బాణసంచాలా కనిపించినప్పటికీ అది ఇజ్రాయెల్ ప్రజలకు జీవన్మరణ సమస్య. దూసుకొస్తున్న రాకెట్లు, క్షిపణులను ఐరన్ డోమ్‌ అడ్డుకోకపోతే భారీగా మరణాలు సంభవిస్తాయి. 2005లో హెజ్‌బొల్లా దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ కసితో ఈ వ్యవస్థను రూపొందించింది. అదే మరోసారి ఆ దేశానికి రక్షణ కవచంగా మారింది.

 ఇజ్రాయెల్‌ పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ. ప్రత్యర్థులు వందలాది రాకెట్లు ప్రయోగిస్తున్నా ఉక్కు కవచంలా ఆ దాడులను అది అడ్డుకొంటోంది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ మూడు దశల్లో పనిచేస్తుంది. అవుటర్‌ లేయర్‌లో యారో-2, యారో-3 క్షిపణి వ్యవస్థలు ఉంటాయి. ఇవి వేలాది కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే క్షిపణులను అడ్డుకుంటాయి. అంతేకాకుండా వాటి నుంచి వెలువడే శకలాల ముప్పును నివారిస్తాయి. మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా డేవిడ్‌ స్లింగ్‌ పనిచేస్తుంది. ఇది 100 నుంచి 200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో ఐరన్ డోమ్ వ్యవస్థ చివరిది. ఇది ఇప్పటివరకు హెజ్‌బొల్లా, హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను, క్షిపణులను సమర్థంగా అడ్డుకుని రక్షణ కల్పించింది.

10 సెకన్లలో 20 క్షిపణుల ప్రయోగం
ఐరన్‌ డోమ్‌ను ఇజ్రాయెల్‌లో కిప్పాట్‌ బార్జెల్‌గా కూడా పిలుస్తారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. అన్ని వాతావరణ పరిస్థితులలో పని చేస్తుంది. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. రాడార్‌ ట్రాకింగ్ స్టేషన్‌, కంట్రోల్‌ సెంటర్‌, మిసైల్‌ బ్యాటరీ సిస్టమ్‌. రాడార్‌ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోతే వదిలేస్తుంది. అదే జనావాసాలు ఉంటే రాకెట్‌ను ప్రయోగించి దానిని కూల్చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్‌ సిస్టమ్‌ సంస్థలు పనిచేశాయి. చివరిదైన మిసైల్ బ్యాటరీ సిస్టమ్‌లో 3 యాంటీ మిసైల్ బ్యాటరీలుంటాయి. ప్రతి ఐరన్‌ డోమ్‌ బ్యాటరీలో నాలుగు లాంచర్లు ఉంటాయి. ఒక్కోటి 10 సెకన్లలో 20 క్షిపణులను ప్రయోగించగలవు. అత్యధిక ముప్పులను ఏకకాలంలో ఎదుర్కొనేలా దీనిని రూపొందించారు.

ఐరన్‌ డోమ్‌ సక్సెస్‌ రేటు 90శాతం
2006లో హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్‌ మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఆ సమయంలో వేల రాకెట్లను ఇ‌జ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ఐరన్‌ డోమ్‌ను తయారీ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు అమెరికా సాయం అందించింది. 2008 నాటికి తమిర్‌ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011లో ఐరన్ డోమ్‌ అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలో గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన మిసైల్‌ను ఐరన్ డోమ్‌ సమర్థంగా అడ్డుకుంది. ఐరన్‌ డోమ్‌ సక్సెస్‌ రేటు 90శాతంగా ఉంది.

50 వేల డాలర్ల వరకు ఖర్చు
గతేడాది అక్టోబర్‌లో హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను ఈ ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసింది. అయితే వాటిలో కొన్ని తప్పించుకుని జనావాసాలపై పడటంతో పలువురు ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దూసుకొస్తున్న ప్రమాదాన్ని అడ్డుకునేందుకు లక్ష్యంపై రెండు క్షిపణులను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ప్రయోగిస్తుంది. అందులో ఒక్కో క్షిపణికి 50 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ వద్ద 10 ఐరన్‌ డోమ్‌ బ్యాటరీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చుకునే వీలుంటుంది. 2020లో అమెరికాకు రెండు ఐరన్ డోమ్ బ్యాటరీలను ఇజ్రాయెల్ ఎగుమతి చేసింది.

700 మంది AEEలకు నేడు నియామక పత్రాలు - కొత్తగా 1800 లష్కర్ పోస్టుల భర్తీకి సీఎం ప్రకటన! - CM Revanth

 


నీటి పారుదల శాఖలో కొత్తగా చేరిన 700 మంది ఏఈఈలకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలోని ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా 1800 లష్కర్ పోస్టులను సీఎం ప్రకటించే అవకాశం ఉంది.

CM Revanth Gives Appointment orders to Irrigation AEE : నీటి పారుదల శాఖలో కొత్తగా చేరిన ఏఈఈలకు సీఎం రేవంత్​రెడ్డి ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్ జలసౌధలో జరిగే కార్యక్రమంలో 700 మంది ఏఈఈలు నియామకపత్రాలు అందుకుంటారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సలహాదారులు, ఉన్నతాధికారులు, ఈఎన్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా 18 వందల లష్కర్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. అనంతరం ప్రాధాన్య ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇస్తారు.

కొత్తగా 6 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని సీఎం రేవంత్​రెడ్డి సమీక్షిస్తారు. నల్గొండ జిల్లాలో ఎస్​ఎల్​బీసీ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టుల్ని మంత్రులు తాజాగా సందర్శించి వచ్చారు. క్షేత్రస్థాయిలో పనుల వేగానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. నీటిపారుదల శాఖలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు అన్నిస్థాయుల ఇంజినీర్లను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు.

బీసీ కులగణన కోసం కార్యాచరణ ప్రారంభించండి : బీసీ కులగణన కోసం వెంటనే కార్యాచరణ ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తెలిపారు. బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు సచివాలయంలో బుధవారం సీఎంను కలిశారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై ముఖ్యమంత్రితో కమిషన్ ఛైర్మన్, సభ్యులు చర్చించారు. బీసీ కులగణన ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి విధానాలను పరిశీలించాలని సూచించారు. బీసీ కులగణన వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం రేవంత్ హామి ఇచ్చారు.

 

 

Wednesday, September 25, 2024

తిరుమల లడ్డూ వ్యవహారంలో జగన్‌కు పవన్ క్లీన్ చిట్ - ఢిల్లీ ఎఫెక్ట్..

 


 

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. రోజుకో మలుపు తిరుగుతోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

 

కోర్టుకూ వెళ్లారు..

కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. పలువురు జాతీయ స్థాయి నాయకులు దీనిపై స్పందించారు. ఈ ఆరోపణల వెనుక గల వాస్తవాలను వెలికి తీయాలంటూ సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు.

లడ్డూపైనే..

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.

 

దీక్షలు..యజ్ఞాలు

స్వయానా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. టీడీపీ కూటమి భాగస్వామ్య పక్షం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు. అటు తిరుమలలో మహా సంప్రోక్షణ చేపట్టారు. ఇందులో భాగంగా యజ్ఞయాగాదులను నిర్వహించారు టీటీడీ అధికారులు.

 

తిప్పికొట్టిన వైసీపీ..

తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తోన్న ఈ ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పి కొడుతున్నారు. సీబీఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. తాను తప్పు చేయలేదంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణం చేయడం- అనుకోని మలుపు.

జగన్‌పై పవన్..

ఈ పరిణామాల మధ్య పవన్ కల్యాణ్- చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తిరుమల లడ్డూ ఆరోపణల్లో వైఎస్ జగన్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తాము జగన్‌ను తప్పు పట్టట్లేదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులే ఈ పని చేశారని స్పష్టం చేశారు. వారిని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తోన్నారని పేర్కొన్నారు.

 

Tuesday, September 24, 2024

Open School Hall Ticket Download ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల

 


*ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల* 👇
 *హాల్ టికెట్స్ లింక్ 👇*

 Download