Thursday, September 19, 2024

76 సెక్యూరిటీ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ.. ఎంపికైతే రూ.40వెలు జీతం.. AIESL Security Staff Recruitment Apply

 



గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!

  • భారీగా సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు.
  • భారతీయ/ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్  లిమిటెడ్ (AIESL), అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ Ref.No.: AIESL/HR-HQ/2024/4779 తేదీ:04.09.2024 న జారీ చేసింది. హైదరాబాద్ తో సహా దేశవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్ లైన్ లో Google Form ద్వారా దరఖాస్తులు సమర్పించి, ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, 24.09.2024 సాయంత్రం 05:00 వరకు చేరే విధంగా సమర్పించండి.

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య : 76.

విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 
  2. హిందీ ఇంగ్లీష్ భాషలతో ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం.

 

వయోపరిమితి : 

  • 01-09-2024 నాటికి అభ్యర్థుల వయస్సు
  1. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు - 30 సంవత్సరాలు,
  2. ఓబీసీ అభ్యర్థులకు - 35 సంవత్సరాలు,
  3. జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు - 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి.

 

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.


ఒప్పంద కాలం :: 05 సంవత్సరాలు,

 

📌 అభ్యర్థి క్రమశిక్షణ, & అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.


గౌరవ వేతనం :

  1. రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఎంపికైన అభ్యర్థులకు రూ.47,625/-,
  2. అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీగా ఎంపికైన అభ్యర్థులకు రూ.27,940/-.


దరఖాస్తు ఫీజు : రూ.1,000/-.

  • SC/ ST/ Ex-servicemen అభ్యర్థులకు మినహాయించారు.


అధికారిక వెబ్సైట్: https://www.aiesl.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

Chief Human Resource Officer

AI Engineering Service Limited 

Personal Department,

2nd Floor, CRA Building,

Safdarjung Airport Complex,

Aurobindo Marg, New Delhi - 110003.


ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 24.09.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.

 


Wednesday, September 18, 2024

తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహాలు?

 
చంద్రునిపై నీటి జాడను వెతకడం బి. చంద్రుని త్రిమితీయ అట్లాస్‌ను తయారు చేయడం 



1. కింది వాటిలో చంద్రయాన్‌ ముఖ్య ఉద్దేశం కానిది/కానివి?
ఎ. చంద్రునిపై నీటి జాడను వెతకడం
బి. చంద్రుని త్రిమితీయ అట్లాస్‌ను తయారు చేయడం
సి. చంద్రునిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం
డి. బెరీలియం-4ను వెతకడం
1) ఎ, బి 2) బి
3) సి, డి 4) డి

2. భూమి నీటి అంచుల్లో ఉండే పలుచని నీటి ప్రాంతం చంద్రునిపై పడటం వల్ల ఏర్పడే చంద్రగ్రహణం?
1) సంపూర్ణ చంద్రగ్రహణం
2) పాక్షిక చంద్రగ్రహణం
3) ప్రచ్ఛాయ/ఉపచ్ఛాయ చంద్రగ్రహణం
4) వలయాకార చంద్రగ్రహణం

3. వలయాకార సూర్య గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందడాన్ని ఏ సూర్యగ్రహణం అంటారు?
1) మిశ్రమ సూర్యగ్రహణం
2) వలయాకార సూర్యగ్రహణం
3) పాక్షిక సూర్యగ్రహణం
4) సంపూర్ణ సూర్యగ్రహణం
4. కింది వాటిలో సరైనది/సరైనవి?
ఎ. ప్రతి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది
బి. ప్రతి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడదు
సి. 1980, ఫిబ్రవరి 16న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి

5. జీవిత: లక్షలు, కోట్ల నక్షత్రాలు గల పెద్ద గుంపులను గెలాక్సీలు అంటారు
కవిత: సప్తర్షి మండలాన్ని ఆకాశంలో ఉత్తరం వైపు గల దీర్ఘ చతురస్రాకార గల భాగంలో గుర్తించవచ్చు అసత్య వాక్యాన్ని తెలిపినది ఎవరు?
1) జీవిత 2) కవిత
3) ఎ, బి 4) ఏదీకాదు

6. కింది వాటిలో సరైనది(వి)?
ఎ. శర్మిష్ట రాశిలోని ఆరు నక్షత్రాలు ‘U’ ఆకారాన్ని పోలి ఉంటాయి
బి. శర్మిష్ట రాశిలోని ‘M’ ఆకారంలోని నక్షత్రాల్లో మధ్యలో గల నక్షత్రం నుంచి తిన్నగా ఊహించిన రేఖ ధ్రువ నక్షత్రాన్ని చూపుతుంది
సి. 2008, నవంబర్‌ 22న మన దేశం చంద్రుని గురించి తెలుసుకోవడానికి చంద్రయాన్‌-1ను ప్రయోగించింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) బి

7. సత్య: ధ్రువ నక్షత్రం భూభ్రమణ అక్షానికి సూటిగా పై వైపున ఉన్నది. కాబట్టి భూభ్రమణం వల్ల అన్ని నక్షత్రాలు తిరుగుతున్నట్లు కనబడినా ధృవ నక్షత్రం మాత్రం నిలకడగా ఉన్నట్లు కనబడుతుంది
నిత్య: విశ్వంలోని అనేక కోట్ల గెలాక్సీల్లో ఒకటైన పాలపుంత అనే గెలాక్సీలో సూర్యుడు ఒకానొక నక్షత్రం సరైన వాక్యాన్ని తెలిపినది ఎవరు?
1) సత్య 2) నిత్య
3) ఎ, బి 4) ఏదీకాదు

8. సూర్యుని నుంచి దూరాన్ని బట్టి గ్రహాల సరైన వరుస?
1) బుధుడు, భూమి, కుజుడు, శుక్రుడు
2) బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు
3) బుధుడు, భూమి, శుక్రుడు, కుజుడు
4) భూమి, బుధుడు, శుక్రుడు, కుజుడు

9. ఎ. మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం-సూర్యుడు బి. ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ ఒక ప్రత్యేకమైన మార్గంలో పరిభ్రమిస్తుంది. ఈ మార్గాన్ని కక్ష్య అంటారు సి. సూర్యుని నుంచి గ్రహాలకున్న దూరం పెరుగుతున్న కొద్దీ వాటి పరిభ్రమణ కాలం తగ్గుతుందిఅసత్య వాక్యం?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) సి

10. ఏ అంతరిక్ష వస్తువైనా మరో దాని చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు?
1) గ్రహం 2) ఉపగ్రహం
3) ఆస్టరాయిడ్‌ 4) ఉల్క

11. బుధుడు ఏ గ్రహానికి సంబంధించి సరైన వాక్యం(లు)?
ఎ. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం
బి. శుక్ర గ్రహం కంటే పెద్ద గ్రహం
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు

12. బుధుడు ఏ గ్రహానికి సంబంధించి సరికానిది(వి)?
ఎ. ఈ గ్రహాన్ని సూర్యోదయానికి కొద్ది సమయం ముందు గానీ సూర్యాస్తమయం వెంటనే గానీ, దిజ్మండలంకు దగ్గరలో దీన్ని చూడవచ్చు
బి. బుధ గ్రహానికి ఒక ఉపగ్రహం ఉంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు

13. శుక్ర గ్రహానికి సంబంధించి సరైన భావన(లు)?
ఎ. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం
బి. అన్ని గ్రహాల్లో కెల్లా
ప్రకాశవంతమైన గ్రహం
సి. దీన్ని వేగుచుక్క, సాయంకాలం చుక్క అనే రెండు పేర్లతో పిలుస్తారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి

14. శుక్ర గ్రహానికి ఉపగ్రహాల సంఖ్య?
1) 1 2) 2 3) 0 4) 4

15. కింది వాటిలో తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహాలు?
1) శుక్రుడు, యురేనస్‌
2) శుక్రుడు, నెఫ్ట్యూన్‌
3) యురేనస్‌, శని
4) కుజుడు, యురేనస్‌

16. వీణ: సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలోకి జీవాన్ని కలిగి ఉన్న గ్రహం-గురుడు
వాణి: ఓజోన్‌ పొరను కలిగి ఉన్న గ్రహం-భూమిసరైన వాక్యాన్ని తెలిపినది ఎవరు?
1) వీణ 2) వాణి
3) ఎ, బి 4) ఏదీకాదు

17. జతపరచండి.
గ్రహం పేరు పరిభ్రమణ కాలం
ఎ. బుధుడు 1. 687 రోజులు
బి. యురేనస్‌ 2. 84 సంవత్సరాలు
సి. బృహస్పతి 3. 12 సంవత్సరాలు
డి. కుజుడు 4. 88 రోజులు
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-1, సి-3, డి-4

18. సౌర కుటుంబంలో భూ కక్ష్యకు బదులు ఉన్న గ్రహాల్లో మొదటిది?
1) అంగారకుడు 2) శుక్రుడు
3) గురుడు 4) యురేనస్‌

19. జతపరచండి.
గ్రహాలు ఉపగ్రహాల సంఖ్య
ఎ. కుజుడు 1.13
బి. గురుడు 2.50
సి. యురేనస్‌ 3.27
డి. నెఫ్ట్యూన్‌ 4.2
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-4, బి-2, సి-3, డి-1

20. కింది వాటిలో అరుణ గ్రహం అని దేనికి పేరు?
1) యురేనస్‌ 2) కుజుడు
3) గురుడు 4) శని

21. ధ్వనుల పిచ్‌ ఆరోహణ క్రమం?
1) పురుషుడు, మహిళ, శిశువు, కీటకం
2) శిశువు, కీటకం, మహిళ, పురుషుడు
3) కీటకం, శిశువు, మహిళ, పురుషుడు
4) మహిళ, పురుషుడు, కీటకం, శిశువు

22. జతపరచండి.
ఎ. లాన యంత్ర శబ్దం 1. 90 db
బి. జెట్‌ ఇంజిన్‌ 2. 120 db
సి. సాధారణ సంభాషణ 3. 60 db
డి. కారు హారన్‌ 4. 110 db
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4

23. మానవుని శ్రవ్య అవధి?
1) 20 Hz కంటే తక్కువ
2) 20 Hz – 20 KHz మధ్య
3) 20,000 Hz కంటే ఎక్కువ
4) 20 Hz-200 KHz మధ్య

24. సముద్ర గర్భంలోని గనులను, తల్లి గర్భంలోని శిశువులను గుర్తించడానికి ఉపయోగపడేవి?
1) పరశ్రావ్యాలు 2) అతి ధ్వనులు
3) శ్రవ్య ధ్వనులు 4) ఏదీకాదు

25. జతపరచండి.
జంతువులు ధ్వనులు
ఎ. కుక్క 1,00,000 Hz
బి. గబ్బిలం 1,00,000 Hz కంటే ఎక్కువ
సి. డాల్ఫిన్స్‌ 50,000 Hz
1) ఎ-3, బి-1, సి-2
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-2, బి-3, సి-1



TG Govt : భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, కొత్త స్కీమ్ తెచ్చే ఆలోచనలో తెలంగాణ సర్కార్


TG Govt : తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రజా పాలన ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.
తెలంగాణ సర్కార్ రైతన్నలకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క... మీడియాతో మాట్లాడుతూ ప్రజల చేత, ప్రజల అవసరాల కోసం ఏర్పడిందే ఈ ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు. భారత రాజ్యాంగం మేరకు ప్రజాపాలన నడుస్తుందన్నారు. ప్రజాస్వామ్యాని గౌరవించే ప్రతి ఒక్కరు ప్రజాపాలనను స్వాగతించాలని కోరారు.

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి చూశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలాంటి పాలనా నుంచి నేడు విముక్తి పొందామన్నారు. ప్రజాపాలనలో అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్నారు. రైతులకు పంట బీమా, వ్యక్తిగత ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామన్నారు. దీంతో పాటు సోలార్ పంపు సెట్లతో ఆదాయం వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నామన్నారు. అలాగే భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు చొప్పున ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఐకేపీ ద్వారా మహిళలు ఆర్గానిక్ ఫార్మిగ్ చేసేలా కృషి చేస్తున్నామన్నారు. పక్కదారి పట్టిన దళిత బంధు యూనిట్లు తిరిగి అమల్లోకి తెచ్చే బాధ్యత అధికారులదే అన్నారు.

సన్న వడ్లకు రూ.500 బోనస్
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది విప్లవాత్మక నిర్ణయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు 500 రూపాయల బోనస్ అందించనున్నట్లు మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచే సన్నాలకు(సన్న రకం ధాన్యం) 500 రూపాయల బోనస్ ను చెల్లించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

సన్న వడ్లకు వానాకాలం నుంచి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు రైతులకు హామీలు ఇచ్చారు. వీటిల్లో రూ.2 లక్షల రైతు రుణ మాఫీ, వరి పంటకు రూ.500 బోనస్. తాజాగా బోనస్ పై ప్రభుత్వం ప్రకటన చేసింది

 


Tuesday, September 17, 2024

DTH Signal: డీటీహెచ్‌ సిగ్నల్‌ సరిగ్గా రావడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఫుల్‌ సిగ్నల్‌!

 


 

 మీరు టీవీలో మీకు ఇష్టమైన సీరియల్ చూస్తున్నారు. మధ్యలో సిగ్నల్ పోయింది. వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో దీనిని నివారించవచ్చు. DTH సిగ్నల్‌ని ఎలా మెరుగుపరచాలో తెలుసుకుందాం..

వర్షాకాలంలో డీటీహెచ్‌ (డైరెక్ట్-టు-హోమ్) సిగ్నల్ బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే మేఘాలు, వర్షం, గాలి సంకేతాలను ప్రసారం చేయడం కష్టతరం చేస్తాయి. ఈ సమస్య ముఖ్యంగా భారీ వర్షం లేదా తుఫాను వాతావరణంలో సంభవిస్తుంది. దీనిని "రైన్ ఫేడ్" అంటారు. దీని కారణంగా టీవీ ఛానెళ్లను స్తంభింపజేస్తుంది. ఈ సమస్యను ఎదుర్కోవటానికి మీరు అనుసరించగల కొన్ని సాధారణ పద్ధతులు ఉన్నాయి.

 కవర్‌తో కప్పేయండి: DTH డిష్‌ను గొడుగుతో లేదా వర్షంలో తడకుండా కప్పేయండి. వర్షం నేరుగా పడటం సిగ్నల్‌లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే డీటీహెచ్‌ డిష్‌పై గొడుగు లేదా ఏదైనా కవర్‌తో కప్పడం మర్చిపోవద్దు. దీని కారణంగా, నీరు నేరుగా డిష్‌పై పడదు. సిగ్నల్ నాణ్యత బాగుంటుంది. ఇలా చేస్తున్నప్పుడు, గొడుగు లేదా కవర్‌ కప్పడం వల్ల సిగ్నల్స్‌కు ఎలాంటి ఆటంకం కలిగించదు.

 డిష్ ఎలివేషన్, కోణాన్ని సరి చేయండి: నిరంతర వర్షం కారణంగా సిగ్నల్ సమస్య కొనసాగితే, DTH డిష్ ఎత్తు, కోణాన్ని తనిఖీ చేయండి. డిష్ సరైన దిశలో ఉంచినట్లయితే, వర్షం సమయంలో కూడా సిగ్నల్ మెరుగ్గా ఉంటుంది.

 సిగ్నల్ బూస్టర్‌ని ఉపయోగించండి: సిగ్నల్ బూస్టర్ అనేది బలహీనమైన సిగ్నల్‌లను పెంచడం ద్వారా మీ డీటీహెచ్‌ సిస్టమ్‌ను మెరుగుపరిచే ఒక రకమైన పరికరం. మీరు దానిని కొనుగోలు చేసి, ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. తద్వారా వర్షాల సమయంలో సిగ్నల్ సమస్యలు తగ్గుతాయి.

 డిష్‌ని రెగ్యులర్‌గా శుభ్రం చేయండి: డిటిహెచ్ డిష్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ముఖ్యం. దుమ్ము, మట్టి, నీరు చేరడం సిగ్నల్ నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. శుభ్రం చేస్తుండటం వల్ల మెరుగైన సంకేతాన్ని అందుకుంటుంది.

 వాటర్‌ఫ్రూఫింగ్ కూడా ఒక ఎంపిక: కొంతమంది డీటీహెచ్‌ సర్వీస్ ప్రొవైడర్లు వాటర్‌ప్రూఫ్ డిష్ కవర్ల సౌకర్యాన్ని కూడా అందిస్తారు. ఈ కవర్ వర్షం సమయంలో నీటిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. సిగ్నల్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ ఉపాయాన్ని అనుసరించడం ద్వారా మీరు వర్షాకాలంలో కూడా DTH సిగ్నల్‌ను మెరుగుపర్చుకోవచ్చు. ఎటువంటి సమస్య లేకుండా వినోదాన్ని ఆస్వాదించవచ్చు.

Monday, September 16, 2024

TGPSC Books, Study Materials | Group 2, 3, 4 - History Books Download

 

 

Telangana Udyamam Volume Download 

 

TS History Notes ( IMP)   Download

 

TS Movements NOTE'S (IMP) - Download

 
 
 
 తెలంగాణ చరిత్ర రంజిత్ కేయ్ నోట్స్ Download