Showing posts with label Laptops. Show all posts
Showing posts with label Laptops. Show all posts

Tuesday, March 9, 2021

JioBook Laptop 10 వేల JioLaptop అన్ని వివరాలు ఇక్కడ!

 

 

Reliance Jio కాల క్రమేణా అన్ని విభాగాల్లో తన ముద్రని చాటుతోంది. టెలికం రంగం తోపాటు, Jio Fiber బ్రాడ్‌బాండ్, రిటైల్ రంగంలో కూడా ప్రవేశించిన ఆ సంస్థ ఇప్పుడు తాజాగా ఎక్కడా లేని విధంగా పది వేల రూపాయలకు JioBook లేదా JioLaptop పేరిట ఓ ల్యాప్‌టాప్‌ని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.


 

4G ఆధారంగా పనిచేసే ఈ Laptopలో మామూలు ల్యాప్టాప్ ప్రాసెసర్ కాకుండా, smartphoneలలో ఉపయోగించబడే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉపయోగింబడుతుందని తెలుస్తోంది. వాస్తవానికి అది 10, 15 వేల రూపాయల ధరలో లభించే smartphoneలలో గతంలో ఉపయోగించబడిన ప్రాసెసర్.

ఇది Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే జియో సంస్థకు చెందిన JioOS కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. JioStore, JioMeet, JioPages వంటి ఇతర జియో సర్వీసులు కూడా దీంట్లో ఉంటాయి. వీటితోపాటు Microsoft సంస్థకు చెందిన మైక్రోసాఫ్ట్ టీమ్స్, Edge బ్రౌజర్, ఎమ్మెస్ ఆఫీస్ కూడా లభించవచ్చు. వీడియో ఔట్‌పుట్ కోసం HDMI కనెక్టర్, dual band WiFi, Bluetooth, క్వాల్కామ్ ఆడియో చిప్ పొందుపరచబడి ఉంటాయని తెలుస్తోంది.

చైనాకు చెందిన బ్లూ బ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ సహకారంతో Reliance Jio ఈ సరికొత్త JioBookని తయారు చేస్తోందని ప్రాథమిక సమాచారం. JioLaptop ఎప్పుడు అందుబాటులో వస్తుంది అన్న విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ లాప్టాప్ లో 4జిబి ర్యామ్, 64 జీబీ ఒక మోడల్, 2GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ మరో మోడల్ లభించే వీలుంది.

స్క్రీన్ పరిమాణం వెల్లడి కావాల్సి ఉంది. 1366×768 పిక్సెళ్ల స్క్రీన్ రిసల్యూషన్ ఈ లాప్టాప్‌లో లభిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు NPCI ( National payments Corporation of India) సహకారంతో Reliance Jio మార్కెట్లో ఉన్న అన్ని JioPhoneలలో నిక్షిప్తం చేసే విధంగా పేమెంట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే సన్నాహాలు చేస్తోంది.

 

 Tags: JioBook Laptop, Jio,Laptops,Tech News, Telugu Tech News,

 

Friday, March 5, 2021

Jio ల్యాప్‌టాప్‌లు రాబోతున్నాయి!

 


భారత్‌ టెలికాం రంగంలో తక్కువ ధరకే ఇంటర్నెట్‌ అందించి రిలయన్స్‌ జియో రికార్డు సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే త్వరలో 5జీ మొబైల్స్ కూడా తీసుకొస్తున్నట్లు గతంలో జియో ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రోడక్ట్ ను ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి తీసుకొనిరాబోతుంది. జియో త్వరలో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దానికి సంబందించిన పనులు కీలక దశకు చేరుకున్నాయని తెలుస్తుంది. ‘జియో బుక్‌’ పేరుతో ఈ ల్యాప్‌టాప్‌లను ఈ ఏడాది మే నాటికి తీసుకోని రావొచ్చు.

రిలయన్స్ జియో బడ్జెట్ ల్యాప్‌టాప్ “జియోబుక్”‌లో కొత్త జియో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనుంది. జియోబుక్‌ 4జీ ఎల్‌టీఈకు కూడా సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. సెల్యులార్‌ కనెక్షన్‌తో పనిచేసే ల్యాప్‌టాప్‌ల తయారీపై జియో ఆసక్తిగా ఉన్నట్లు అమెరికాకు చెందిన క్వాల్‌కోమ్‌ టెక్నాలజీస్‌ సీనియర్‌ ప్రొడక్ట్ డైరక్టర్‌ మిగ్యుల్‌ న్యూన్స్ 2018లో తెలిపిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఈ అంశం తెరమీదకు వచ్చింది. జియోబుక్ ల్యాప్‌టాప్ తయారీ కోసం జియో చైనా తయారీదారు బ్లూ బ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సంస్థ ఇప్పటికే తన కర్మాగారంలో 5జీ జియోఫోన్ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

 జియోబుక్‌ స్పెసిఫికేషన్లు(అంచనా)
స్పెసిఫికేషన్ల పరంగా.. జియోబుక్ 1,366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 4జీ ఎల్‌టీఈ మోడెమ్ మోడెమ్‌తో డిస్ప్లేని కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌ తయారీ ఖర్చు తగ్గించడం కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ తీసుకొనిరానున్నారు. ఇది 11 నానో మీటర్‌ టెక్నాలజీతో పని చేస్తుంది. ఒక మోడల్‌లో 2జీబీ ఎల్‌పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్ తో పాటు 32జీబీ ఇఎంఎంసి స్టోరేజ్ ఉంది. మరో మోడల్‌లో 4జీబీ ఎల్‌పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్, 64జీబీ ఇఎంఎంసి 5.1 స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్‌డీఎంఐ, 5గిగా హెడ్జ్‌ వైఫై సపోర్ట్‌, బ్లూటూత్‌, 3 యాక్సిస్‌ యాక్సెలెరోమీటర్‌, క్వాల్‌కోమ్‌ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. జియో ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరలోనే తీసుకొస్తుందని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు.