నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు
ఐఐటీ, ఎస్ఈటీ, ట్రిపుల్ ఐటీ, జీఎసీఐలలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి23 వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహిం చిన తొలి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ రోజు 08.03.2021 (సోమవారం) వెలువడనున్నాయి. ఇందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ) అవసరమై న చర్యలు చేపట్టింది. వాస్తవానికి ఆదివారం రాత్రే ఫలితాలను విడుదల చేయాల్సి ఉన్నా సాంకేతిక సమస్యలతో నిలిపేశారు. గత నెలలో నిర్వహించిన మొదటి విడత పరీక్షలకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా 6,61,761 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరై నట్లు అంచనా.. ఇక తెలంగాణ నుంచి 73,782 మంది విద్యా ర్డులు దరఖాస్తు చేసుకోగా వారిలో 70 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కరోనా కారణంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి నాలుగు విడతల్లో జేఈఈ మెయినన్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో తొలుత జరగ్గా.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా విడతలుగా నిర్వ హించనున్నారు. విద్యార్ధులు తాము కోరు కుంటే నాలుగు సార్లు పరీక్షలకు హాజరయ్యే వీలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ) కల్పించింది. నాలుగింటిలో ఎందులో ఎక్కువ స్కోర్ వస్తే దానినే పరిగణ నలోకి తీసుకొని తుది ర్యాంకును ఖరారు చేస్తామని వెల్లడించింది.
జేఈఈ మెయిన్ తుది కీ విడుదల:
జేఈఈ మెయిన్ మొదటి విడత పేపర్-1 తుది కీని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టిఏ) (07.03.2021) ఆదివారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఎన్ఏటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాలో అర్హత పొందేందుకు గత నెల 24 నుంచి 26వ తేదీ వరకు పేపర్-1 ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన తుది కీని (07.03.2021) ఆదివారం రాత్రి 11.15కు వెల్లడించారు. విద్యార్థుల స్కోర్ (మార్కులు)ను కూడా సోమవారం విడుదల చేస్తారు. దేశ వ్యాప్తంగా దాదాపు 6.20 లక్షల మంది వరకు పేపర్-1 రాశారు.
తెలుగు రాష్ట్రాల్లో సుమారు లక్షన్నర మంది ఉన్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు ముగిసిన అనంతరం ఎందులో ఎక్కువ స్కోర్ సాధిస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు ఇస్తారు. మొత్తం 300 మార్కులకు పేపర్-1 నిర్వహించారు. గత ఏడాది జనవరిలో జరిగిన మొదటి విడతలో నలుగురు 100 పర్సంటైల్ సాధించగా... ఈసారి కూడా ఒకరిద్ద రైనా ఉంటారని అంచనా వేస్తున్నారు. ఒక విద్యార్థికి 290 మార్కులు దాటనున్నాయని సమాచారం.
జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలను చూసుకునే విధానం:
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల అయిన తరువాత, ఫిబ్రవరి 2021 స్టేషన్ లో నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చును.
1. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ https://jeemain.nta.nic.in చేసి టైప్ చేసి సెర్చ్ చేయండి.
2. జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి ఫలితాలు లింక్ పై క్లిక్ చేయండి.
3. లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
4. మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
5. జేఈఈ మెయిన్ ఫిబ్రవరి 2021 పరీక్షకు సంబంధించిన ఫలితాలు మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తాయి. భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://nta.ac.in/
జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి ఫలితాలు డైరెక్ట్ లింక్ : jeemain.nta.nic.in
Tags : JEE Main FEB 2021 Results, JEE Main 2021