Friday, September 13, 2024

రంగనాథ్ పై ఆమ్రపాలి సీరియస్ |హైడ్రా అధికారులకు అమ్రపాలి వార్నింగ్..!!

 


హైడ్రాలో అధికారుల పై జీహెచ్ఎంసీ కమిషన్ అమ్రపాలీ సీరియస్ అయ్యారు. హైడ్రా కొద్ది రోజులుగా సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ సైతం హైడ్రా కు మరిన్ని అధికారాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జీహెచ్‌ఎంసీలో జీతం తీసుకుంటూ, హైడ్రాలో పని చేస్తున్న అధికారులపై బల్దియా కమిషనర్‌ ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైడ్రా నిర్ణయాలతో

హైడ్రా నిర్ణయాలతో హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ చెరువులను ఆక్రమించి నిర్మాణాలను క్రమబద్దీకరించేది లేదని తేల్చి చెప్పారు. హైడ్రా ఆ నిర్మాణాల విషయంలో కఠినంగా ఉంటుందని స్పష్టం చేసారు. హైడ్రాను మరింతగా విస్తరించటంతో పాటుగా మరిన్ని అధికారాలు ఇవ్వటం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. జీహెచ్‌ఎంసీలో జీతం తీసుకుంటూ, హైడ్రాలో పని చేస్తున్న అధికారులపై బల్దియా కమిషనర్‌ ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


కమిషనర్ సీరియస్
 కమిషనర్ సీరియస్ హైడ్రాకు సిబ్బందిని పలు విభాగాల నుంచి సర్దుబాటు చేసారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం హైడ్రాలో పనిచేస్తున్నారు. వారిని తిరిగి పాత స్థానాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ, ఆ అధికారులు మాత్రం హైడ్రాలోని పనిచేస్తున్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్​కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దీంతో తమ పరిధిలో పని చేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దు అని కమిషనర్‌ ఆమ్రపాలి పరిపాలన విభాగాన్ని ఆదేశించారు.