ఈ రోజుల్లో కాల్స్ చేయడానికి నెట్‌వర్క్‌కు సంబంధించి సమస్యలు ఎదురవుతూనే
ఉన్నాయి. సాధారణంగా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒకోసారి ఫోన్ మధ్యలో
డిస్‌కనెక్ట్ అవుతుంటుంది లేదంటే మాట్లాడుతున్నపుడు సరిగ్గా వినపడకపోవడం
జరుగుతుంది.
దేశవ్యాప్తంగా చాలా మంది ఈ సమస్యను ఎదురుకునే ఉంటారు. మీరు కూడా ఈ సమస్యను
ఎదుర్కొంటుంటే మీరు వై-ఫై కాలింగ్ వైపు మారితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ
ఫీచర్ సహాయంతో మీరు నెట్‌వర్క్ సరిగ్గా లేకున్నా లేదా వీక్ గా ఉన్న కూడా
మాట్లాడవచ్చు. వై-ఫై కాలింగ్ సమయంలో మీ కాల్ డ్రాప్స్ సమస్య బాగా
తగ్గుతుంది. ఇంకా ఫోన్‌లో మాట్లాడేటప్పుడు వాయిస్ కూడా స్పష్టంగా
వినిపిస్తుంది. ఈ ఫీచర్ కోసం టెలికాం కంపెనీలు కస్టమర్ల నుండి ఎలాంటి
రుసుమును చార్జ్ చేయవు. కాబట్టి మీరు దీని గురించి తప్పక తెలుసుకోవాలి.
మీరు మీ ఫోన్‌లో వై-ఫై కాలింగ్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..?
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వైఫై కాలింగ్ ఫీచర్
దీన్ని ఆక్టివేట్ చేయడానికి మీరు మొదట మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్ ఓపెన్
చేయాలి. సెట్టింగ్‌ని ఓపెన్ చేసిన తర్వాత, పైన ఉన్న నెట్‌వర్క్ కనెక్షన్
ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీరు వై-ఫై ఆప్షన్ లోకి వెళ్లి అడ్వాన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
వై-ఫై కాలింగ్ ఆప్షన్
తరువాత వై-ఫై కాలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆక్టివేట్ చేసుకోవచ్చు. మీ
ఫోన్‌లోరెండు సిమ్ కార్డులు ఉంటే అందులోంచి దేనినైనా ఉపయోగించవచ్చు.
మీరు ఐఫోన్ ఉపయోగిస్తే
మీరు ఐఫోన్ వాడితే మొదట సెట్టింగులను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు డేటా ఆప్షన్ ఎంచుకోవాలి. దానిని ఎంచుకున్న తర్వాత మీరు వై-ఫై కాలింగ్ ఆప్షన్ చూస్తారు, దానిపై క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత వైఫై కాలింగ్ పక్కన ఉన్న టోగుల్‌ని ఆన్ చేయండి ఆక్టివేట్ అవుతుంది.