యూట్యూబ్ తెలిసినంతగా చాలామందికి యూట్యూబ్ స్టూడియో తెలిసి ఉండకపోవచ్చు. ఆ స్టూడియోలో ఏం ఉంటాయి? క్రియేటర్లకు దారి చూపించే విశ్లేషణ పరికరాలు ఉంటాయి. మన బండికి వేగం పెంచే ఇంధనాలు ఉంటాయి...
‘యూట్యూబ్ స్టూడియో’ క్రియేటర్స్‌కు ఇల్లులాంటిది. ఆ ఇంటిలో చిన్నవాళ్లకు విలువైన సలహాలు ఇచ్చే పెద్దమనిషిలాంటిది. భరోసా ఇచ్చే బాస్‌లాంటిది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా వీజి. దాన్ని నిలబడేలా చేయడం, పరుగెత్తేలా చేయడం శానా కష్టం. ఇది ఎందరికో అనుభవంలో ఉన్న విషయం. యూట్యూబ్ ఛానల్ హిట్టు,ఫట్టు వెనుక ‘అదృష్టం’ పాత్ర ఏమీ ఉండదు. మన పాత్రే ఉంటుంది. ఆ పాత్ర రక్తి కట్టాలంటే, మీరు విజయపథంలో దూసుకెళ్లాలంటే.. మీకు అవసరమైనది యూట్యూబ్ స్టూడియో. ఆడియన్స్ ఇంటరాక్షన్ నుంచి ఛానల్ డెవలప్‌మెంట్ వరకు రకరకాలుగా ఉపయోగపడుతుంది.
యూట్యూబ్ స్టూడియోలో.. ఛానల్ డ్యాష్‌బోర్డ్, వీడియోస్, ప్లేలిస్ట్, ఎనాలిటిక్స్, కామెంట్స్, సబ్‌టైటిల్స్, మోనిటైజేషన్, కస్టమైజేషన్, ఆడియోలైబ్రరీ.. మొదలైన ఫీచర్లు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి ప్లేలిస్ట్, ఎనలిటిక్స్. ఛానల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండాలంటే ప్లేలీస్ట్‌లు తప్పనిసరి. యూట్యూబ్ స్టూడియోలో ప్లేలీస్ట్‌లు క్రియేట్ చేయడానికి...
1.సైన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో
2. లెఫ్ట్ మెను, సెలెక్ట్ ప్లేలీస్ట్
3. క్లిక్–న్యూ ప్లే లీస్ట్
4.ఎంటర్–ప్లే లీస్ట్ టైటిల్
5. సెలెక్ట్–ప్లేలీస్ట్ విజిబిలిటీ సెట్టింగ్స్
6. క్లిక్ ఆన్ క్రియేట్ ఎడిట్ చేయడానికి...
1.సైన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో
2. సెలెక్ట్ ప్లేలీస్ట్
3.ఎడిట్–క్లిక్
4. డిస్క్రిప్షన్–క్లిక్
5.సేవ్ ఛానల్ స్పీడ్ అందుకోవడానికి,
కంటెంట్ స్ట్రాటజీని రీడిజైన్ చేసుకోవడానికి ‘ఎనాలిటిక్స్’ కావాలి. ఇందులోకి వెళ్లాలంటే...1.మీ ఎకౌంట్‌లోకి లాగ్ అవ్వాలి 2. క్లిక్–ప్రొఫైల్ ఐకాన్ 3.సెలెక్ట్–యూట్యూబ్ స్టూడియో 4. క్లిక్–గో టూ ఛానల్ ఎనాలిటిక్స్ 5. సెలెక్ట్–ఎనాలిటిక్స్ (లెఫ్ట్ హ్యాండ్ మెనూ) బిగ్గెస్ట్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూట్ కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే వినూత్నమైన అప్‌డెట్స్‌తో ముందుంటుంది.
‘యూట్యూబ్ స్టూడియో’కి సంబంధించి తాజా అప్‌డ్‌ట్‌ల విషయానికి వస్తే.. హైలీ రిక్వెస్టెడ్ ఫీచర్‌గా చెప్పుకునే ‘డార్క్‌మోడ్’ ఫీచర్ యూట్యూబ్‌కు మాత్రమే కాకుండా ‘యూట్యూబ్ స్టూడియో’కు వచ్చేసింది. ఫ్రెష్‌లుక్ ఇవ్వడమే కాదు కళ్లకు భారం పడకుండా తేలిగ్గా ఉంటుంది. బ్యాటరీ సేవ్ అవుతుంది. రియల్‌టైమ్ కార్డ్స్‌ను మెరుగుపరిచారు. గతంలో ఈ కార్డ్స్ ‘బేసిక్ వోవర్ వ్యూ డాటా’ డిస్‌ప్లేకే పరిమితం. తాజా అప్‌డేట్‌తో సబ్‌స్క్రైబర్ కౌంట్స్, వీడియో వ్యూస్.. ఇలా అప్–టు–ది–మినిట్ డాటా డిస్‌ప్లే అవుతుంది. యూట్యూబ్ స్టూడియోలోని ‘మెన్షెన్ ఇన్‌బాక్స్’తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. దీని ద్వారా మీ ఛానల్ ఎక్కడెక్కడ మెన్షెన్ అయిందనే విషయం తెలుసుకోవచ్చు.
ఉదా: మరో ఛానల్ వీడియో కామెంట్ సెక్షన్‌లో మీ ఛానల్ ట్యాగ్ అయితే దాని గురించి తెలుసుకోవచ్చు. ‘మీ సినిమా ఆడాలంటే మీకు నచ్చగానే సరిపోదు. ప్రేక్షకులకు మీకంటే బాగా నచ్చాలి’ అనేది అత్యంత పాత విషయం అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా మరిచిపోతూనే ఉంటాం. ఛానల్ వ్యవహారం కూడా అంతే. ‘చేసిందంతా చేసేశాను. ఇంకేటి సేత్తాం’ అనుకోవద్దు. ‘యూట్యూబ్ స్టూడియో’పై లుక్కేయండి. ఆడియెన్స్ నాడి కనిపెట్టండి. సరదిద్దుకోండి. దూసుకుపోండి.