Tuesday, August 17, 2021

ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ వచ్చింది!! ధరలు,ఫీచర్స్ ఏంటో తెలుసా??

 

స్మార్ట్‌ఫోన్‌లను ప్రస్తుత రోజులలో ఉపయోగించడం సాధారణం అయింది. అయితే సాధారణంగా ఉపయోగించే వాటికి బిన్నంగా ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించాలని కొంత మందికి కోరిక ఉంటుంది. ఇటువంటి వారి కోసం చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ OEM మోనీ కొత్తగా మోనీ మింట్ అనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న 4G- ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ కావడం గమనార్హం. ఈ స్మార్ట్‌ఫోన్ 3-అంగుళాల డిస్‌ప్లేను మాత్రమే కలిగి ఉంది. ఇది ముందు 3.3-అంగుళాల డిస్‌ప్లేతో విడుదలైన పామ్ ఫోన్ కంటే కొంచెం చిన్నదిగా ఉండి 89.5*45.5*11.5mm కొలతల పరిమాణంలో ఉంటుంది.

 


మోనీ మింట్ స్మార్ట్‌ఫోన్‌ ధర

ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ మోనీ మింట్ యొక్క ధర సుమారు $ 150 (సుమారు రూ.11,131). అయితే లాంచ్ ఆఫర్లలో భాగంగా ప్రారంభ ఆఫర్‌గా ఈ ఫోన్ క్రౌడ్‌ఫండింగ్ వెబ్‌సైట్, ఇండిగోగోలో $100 (సుమారు రూ.7,421) తగ్గింపు ధర వద్ద అందించబడుతోంది. అలాగే $100 ప్రారంభ స్లాట్‌లు కాకుండా ఎర్లీ బర్డ్, మరియు ఇండిగోగో స్పెషల్ స్లాట్‌లలో వరుసగా $ 115 మరియు $ 130 ధరల వద్ద లభిస్తున్నాయి. నవంబర్‌లో ఈ ఫోన్ యొక్క షిప్పింగ్ ప్రారంభమవుతుంది.

 


 

మోనీ మింట్ స్పెసిఫికేషన్స్ ప్రపంచంలోనే అతి చిన్న 4G స్మార్ట్‌ఫోన్ మోనీ మింట్ ఇది డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 854 × 450 రిజల్యూషన్‌తో 3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5GHz క్వాడ్-కోర్ CPU ద్వారా రన్ అవుతూ 3GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. అయితే ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 128GB వరకు విస్తరించబడుతుంది.

ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కస్టమ్ స్కిన్‌తో రన్ చేస్తుంది. అలాగే ఇది 1,250mAh పాలిమర్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందుభాగంలో 2 మెగాపిక్సెల్ కెమెరా మరియు వెనుక భాగంలో 5మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో వస్తుంది. అదనంగా ఈ డివైస్ అమెరికన్ మరియు యూరోపియన్ బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుంది. మీరు ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీరు ఇండిగోగో మైక్రో-సైట్‌కు వెళ్లి దీనిని మీ కోసం ఒక మోడల్‌ను ముందే బుక్ చేసుకోవచ్చు. పరికరం నవంబర్‌లో షిప్పింగ్ ప్రారంభమవుతుంది.