Wednesday, August 18, 2021

రిలయన్స్ జియో చౌకైనా 4జి స్మార్ట్ ఫోన్ పై మరో బిగ్ న్యూస్.. మరి కొద్దిరోజుల్లోనే...

 

ఆసియా అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రపంచంలోని చౌకైన స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్‌ను ఈ ఏడాది జూన్‌లో 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టింది, అయితే ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి సమాచారం అధికారికంగా వెల్లడించలేదు. 

 

 

 రిలయన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంతో జియోఫోన్ నెక్స్ట్ తయారు చేశారు. జియోఫోన్ నెక్స్ట్ సేల్ సెప్టెంబర్ 10 నుండి భారతీయ మార్కెట్లో ప్రారంభం కానుంది. అయితే గతం నుంచే ఈ ఫోన్ ఫీచర్ల గురించి లీకైన నివేదికలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా ఈ ఫోన్ కొన్ని ఫీచర్లు బహిర్గతమయ్యాయి. ఇప్పుడు జియోఫోన్ నెక్స్ట్‌  ధరకి సంబంధించి లీకైన నివేదిక ఒకటి బయటపడింది.

 

జియోఫోన్ నెక్స్ట్‌  ధర, ఫీచర్ల గురించి

టిప్‌స్టర్ యోగేష్ ప్రకారం ధర గురించి మాట్లాడితే జియోఫోన్ నెక్స్ట్ ధర రూ. 3,499 ఉండనుంది. దీని సేల్ సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది.  ఆండ్రాయిడ్ 11  గో ఎడిషన్ జియోఫోన్ నెక్స్ట్‌లో అందించారు. అంతేకాకుండా ఫోన్ కి 5.5-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే, క్వాల్కమ్  QM215 ప్రాసెసర్, 2 లేదా 3 జి‌బి ర్యామ్, 16 లేదా 32జి‌బి స్టోరేజ్, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 308  జి‌పి‌యూ లభిస్తుంది.