Wednesday, June 30, 2021

రోజుకు 3 జీబీ డేటా.. ఏకంగా సంవత్సరం పాటు.. జియో కొత్త ప్లాన్ వచ్చేసింది!

 

 


జియో కొత్త వార్షిక ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే జియో రూ.3,499 ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉండనుంది. రోజుకు 3 జీబీ డేటాను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు.

 జియో తన సరికొత్త వార్షిక ప్రణాళికను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే జియో రూ.3,499 ప్లాన్. ఈ ప్లాన్‌ను కంపెనీ వెబ్‌సైట్, మొబైల్ యాప్.. రెండిట్లోనూ చూడవచ్చు. జియో అందించే ప్లాన్లలో అత్యంత ఖరీదైన ప్లాన్ ఇదే. దీని ద్వారా రోజుకు 3 జీబీ డేటా లభించనుంది. జియో యాప్స్‌కు యాక్సెస్ కూడా ఈ ప్లాన్ ద్వారా అందించనున్నాయి. అయితే థర్డ్ పార్టీ ఓటీటీ ప్లాట్‌ఫాంలకు మాత్రం యాక్సెస్‌ను అందించబోవడం లేదు.

ఈ ప్లాన్‌ను జియో సైలెంట్‌గా, ఎటువంటి ప్రకటన లేకుండా తీసుకువచ్చింది. జియో రూ.3,499 ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉండనుంది. రోజుకు 3 జీబీ డేటా లభించనుంది. అంటే మొత్తంగా 1,095 జీబీ డేటా అందించనున్నారన్న మాట. ఈ 3 జీబీ డేటా అయిపోయాక.. బ్రౌజింగ్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి.

 దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్‌కు కూడా యాక్సెస్ లభించనుంది. అయితే ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 వంటి ఇతర థర్డ్ పార్టీ ఓటీటీ యాప్స్‌కు యాక్సెస్ అందించబోవడం లేదు.

ఇప్పటివరకు జియో.. రోజుకు 3 జీబీ డేటా అందించే ప్లాన్లను లాంచ్ చేయలేదు. జియో రూ.999 ప్లాన్ కూడా రోజుకు 3 జీబీ డేటాను అందించనుంది. కానీ దీని వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే. మిగతా లాభాలన్నీ రూ.3,499 తరహాలోనే ఉన్నాయి. దీంతోపాటు జియో రూ.401 ప్లాన్ ద్వారా 90 జీబీ డేటాను అందించనుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే రోజుకు 3 జీబీ పైమాటే అన్నమాట. దీంతోపాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది.

 జియో ఇటీవలే చవకైన 4జీ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. దీనికి జియోఫోన్ నెక్స్ట్ అని పేరు కూడా పెట్టింది. దీంతోపాటు తన గిగా ఫ్యాక్టరీస్ కోసం రూ.75 వేల కోట్ల పెట్టుబడులను కూడా సమీకరించనుంది. ఈ ఫ్యాక్టరీల ద్వారా రానున్న మూడేళ్లలో సోలార్ ఫొటోవొల్టయిక్ సెల్స్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీలు, ఫ్యూయల్ సెల్స్‌ను అందించనున్నారు. దీంతోపాటు మనదేశంలో 5జీని అందుబాటులోకి తెచ్చే మొదటి టెలికాంగా నిలవడానికి జియో కృషి చేస్తుంది.