Today Amazon offers Link
ప్రపంచంలో షార్ట్ వీడియో పరంగా టిక్‌టాక్‌కు ఉన్న క్రెజ్ వేరొక యాప్ కు లేదని చెప్పుకోవాలి. కరోనా సమయంలో దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ టిక్‌టాక్ వల్ల సామాన్యులు కూడా సెలబ్రిటీ లాగా మారిపోయారు. భారత్ లో టిక్‌టాక్‌పై నిషేధం విదించాక ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలని చాలా కంపనీలు ప్రయత్నించాయి. ఇన్‌స్టాగ్రామ్ కూడా అందులో ఒకటి, అందుకే టిక్‌టాక్ రీతిలో కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్ రీమిక్స్ అనే క్రొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ రీమిక్స్ ఫీచర్ టిక్‌టాక్‌లో ఉన్న ‘డ్యూయట్’ ఆప్షన్ మాదిరిగానే ఉండటం విశేషం. రీమిక్స్ సహాయంతో టిక్‌టాక్‌ను పోలినట్లే డ్యూయట్ వీడియోలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పబ్లిక్ టెస్టింగ్‌లో ఉంది, కాబట్టి కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మాత్రమే అందుబాటులో ఉంది.