Saturday, April 3, 2021

యూట్యూబ్ వీడియోస్ కోసం అతిపెద్ద మార్పు.. త్వరలో ఇకపై ఆ ఫీచర్ కనిపించదు....

 




 

 మీరు వీడియో క్రియేటర్స్ లో ఒకరు అయితే, ఈ వార్త మీ కోసమే. సాధారణంగా యూట్యూబ్ వీడియోలకి లైక్ అండ్ డిస్‌లైక్ రెండూ బటన్లు మీరు చూస్తుంటారు అయితే వాటిని ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు యూట్యూబ్ తెలిపింది.

కాని ఇప్పుడు ప్రజలు దీనిని అవకాశంగా తీసుకొని తప్పుగా ఉపయోగించుకుంటున్నారని వెల్లడించింది, ఎందుకంటే ఒక వ్యక్తి లేదా యూట్యూబ్ఛానెల్ పై ఎక్కువ డిస్‌లైక్ లు చేయాలని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో డిస్‌లైక్ కౌంట్ మూసివేయాలని యూట్యూబ్ చూస్తోంది. అంటే, డిస్‌లైక్ బటన్ కనిపిస్తుంది కానీ ఎంత మంది డిస్‌లైక్ చేశారు అనేది కనిపించదు.



డిస్‌లైక్ బటన్ మునుపటిలాగే కనిపిస్తున్నప్పటికీ, త్వరలో డిస్‌లైక్ కౌంట్ నిలిపివేయబోతున్నట్లు యూట్యూబ్ ట్వీట్ చేసింది. కొత్త అప్ డేట్ గురించి స్క్రీన్ షాట్‌ను కంపెనీ షేర్ చేసింది. అలాగే ఈ నిర్ణయం వల్ల వీడియో క్రియేటర్స్ ప్రయోజనం పొందుతారని కంపెనీ తెలిపింది. డిస్‌లైక్ కౌంట్ మూసివేయడం వీడియో క్రియేటర్స్ కు రియల్ ఫీడ్ బ్యాక్ అందిస్తుందని యూట్యూబ్ తెలిపింది.

గత నెలలో యూట్యూబ్యు.ఎస్ కాకుండా ఇతర దేశాల యూట్యూబ్ వీడియో  క్రియేటర్స్ నుండి పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది, అంటే మీరు యూట్యూబర్ ఆఫ్ ఇండియా అయితే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది, అయితే ఉపశమనం ఏమిటంటే మీరు అమెరికన్ వ్యూస్ కి మాత్రమే పన్ను చెల్లించాలి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అమెరికన్ యూట్యూబ్ వీడియో  క్రియేటర్స్ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.