Sunday, March 7, 2021

Whatsup లో ఫొటోలూ మాయం కానున్నాయి‌!

 

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్‌ ముందు వరుసలో ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల కొత్త ప్రైవేసీ నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రజలలో వాట్సాప్‌పై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాట్సాప్ తన‌ యూజర్లను నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కొద్దీ రోజుల క్రితమే స్టేటస్ మ్యూట్ వీడియో ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతుంది. 

 


 

వాట్సాప్‌లో ఇప్పటికే డిస్‌అపియరింగ్‌‌ మెసేజెస్‌ ఫీచర్ ఉంది. అయితే, ఈ ఫీచర్‌ యాక్టివ్‌ చేసుకుంటే వారం తర్వాత మెసేజ్‌లు ఆటో మెటిక్ గా డిలీట్‌ అవుతాయి. అదేవిదంగా ఇప్పుడు మీడియా డిస్‌అపియరింగ్‌ అనే ఫీచర్ తీసుకువస్తుంది. ఈ ఫీచర్‌తో ఫొటోలు/వీడియోలు అవతలి వ్యక్తి చూడగానే డిలీట్‌ అయిపోతాయి. దీని కోసం ఫొటో/వీడియోను షేర్‌ చేసే ముందు, యాడ్‌ కాప్షన్‌ అనే బాక్స్‌ పక్కన ఉండే గడియారం సింబల్‌ను టచ్‌ చేసి యాక్టివేట్ సరిపోతుంది. ఆ తర్వాత మీరు పంపిన ఫొటో/వీడియోను అవతలి వ్యక్తి చూశాక డిలీట్‌ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొంతమందికి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ తరహా ఫీచర్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటీకే స్వయంగా స్టిక్కర్ మేకర్ యాప్ ని కూడా ప్లే స్టోర్, యాప్ స్టోర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

 


Tags:  Telugu Tech News ,WhatsApp ,Telugu Tech News, New feature , Photos Disappearance