ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో క్రీయేటివిటీ వీడియోలు చాలా పాపులర్ అవుతుంటాయి. ఇక యూట్యూబ్‌లో కూడా ఇదే పరిస్థితి.
మీరు యూట్యూబ్‌లో ఎక్కువగా వీడియోలను చూస్తుంటారు. మనం యూట్యూబ్ లో ఉండే వీడియోలను ఒకోసారి షేర్ చేయాలనుకుంటున్నాం లేదా ఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటుంటాం కానీ కొందరికి ఎలా డౌన్ లోడ్ చేయాలో తెలిదు. ఈ రోజు యూట్యూబ్ నుండి వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.. యూట్యూబ్ యాప్ లో వీడియోలను ఎలా సేవ్ చేయాలి యూట్యూబ్ యాప్ లో వీడియోలను ఆఫ్‌లైన్ చూడటానికి యూట్యూబ్ లో సేవ్ చేయడం ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు, కానీ ఈ ఫీచర్ చాలా వీడియోలకు అందుబాటులో లేదు.
మీరు ఈ విధంగా వీడియోలను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, మొదట యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన వీడియో సెర్చ్ చేయండి. తరువాత వీడియొ కింద లైక్ అండ్ షేర్ బటన్లతో పాటు డౌన్‌లోడ్ బటన్ కూడా కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసిన వీడియోలను లైబ్రరీలో చూడవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియోను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి మీరు ఫోన్‌లో ఎప్పటికీ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే దీని కోసం మీరు థర్డ్ పార్టీ యాప్స్ అయిన స్నాప్‌ట్యూబ్ సహాయం తీసుకోవాలి. కాబట్టి మొదట ఈ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేయాలి. అప్పుడు మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన యూట్యూబ్ వీడియో లింక్‌ను కాపీ చేయండి. ఇప్పుడు ఈ యాప్ లో లింక్‌ను పేస్ట్ చేసి ఆపై డౌన్‌లోడ్ చేయండి
ల్యాప్‌టాప్‌లో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా మీరు మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో యూట్యూబ్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మీరు థర్డ్ పార్టీ వెబ్‌సైట్ సహాయం తీసుకోవాలి. వంటి థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల నుండి మీరు ల్యాప్‌టాప్‌లో యూట్యూబ్ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొదట మీరు వీడియో లింక్‌ను కాపీ చేసి, ఆపై ఈ వెబ్‌సైట్ సెర్చ్ బార్‌కు వెళ్లి పేస్ట్ చేయండి. ఈ వెబ్‌సైట్లలో మీరు వీడియో క్వాలిటీ కోసం అనేక ఆప్షన్స్ కూడా ఉంటాయి.