Monday, November 30, 2020

WhatsAppలోని చాటింగ్ మిస్ అవ్వకుండా Mobile No మార్చడం ఎలా?

 

వాట్సాప్ ప్రపంచంలో అధిక మంది క్రియాశీల వినియోగదారులను కలిగి ఉండి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ లలో ఒకటిగా ఉంది. వినియోగదారులు ఎవరైనా సరే తమ యొక్క మొబైల్ నంబర్‌తో వాట్సాప్ అకౌంటును ఓపెన్ చేయవచ్చు. కాని వారు తమ యొక్క మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటే మాత్రం వారు తమ యొక్క అన్ని చాట్‌లు మరియు డేటాను కోల్పోవలసి ఉంటుంది. ఇది ఎంత వరకు నిజం వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.


 
వాట్సాప్ వినియోగదారుల కోసం దాదాపు ప్రతిరోజూ కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. కొన్ని నెలల క్రితం వాట్సాప్ తన వినియోగదారుల యొక్క చాటింగ్ సమాచారం, ఫోటోలు మరియు వీడియోలను కోల్పోకుండా వారి యొక్క మొబైల్ నెంబర్లను మార్చుకోవడానికి ఒక మార్గాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ప్రస్తుతం iOS మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందరికి అందుబాటులో ఉంది. కింద ఉన్న కొన్ని సాధారణ పద్దతులను పాటించి మీ యొక్క వాట్సాప్ నెంబర్‌ను సులభంగా మార్చవచ్చు.

మీ వాట్సాప్ నెంబర్‌ను మార్చే విధానం 
 
 స్టెప్ 1: మొదట మీరు మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి. 
 
స్టెప్ 2: మీ యొక్క ప్రొఫైల్‌ ఫోటో మీద క్లిక్ చేయండి.
 
 స్టెప్ 3: సెట్టింగ్ మెనుని ఎంచుకోండి. 
 
 స్టెప్ 4: ఆ తరువాత అకౌంట్ ఎంపికను ఎంచుకోవడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.
 
 స్టెప్ 5: ఇందులో అందుబాటులో గల చాలా ఎంపికలలో 'చేంజ్ నెంబర్' ఎంపిక మీద క్లిక్ చేయండి. 
 
 స్టెప్ 6: ఆ తరువాత "నెక్స్ట్" మీద క్లిక్ చేయండి. అలాగే తరువాత మీ యొక్క కొత్త మొబైల్ నెంబర్‌ను జోడించండి. 
 
 స్టెప్ 7: వాట్సాప్ మీ కొత్త నంబర్‌ను OTTతో ధృవీకరించిన తరువాత మొబైల్ నెంబర్ పూర్తిగా మారినట్లు చూడవచ్చు. 

 

వాట్సాప్ యొక్క ఫోన్ నంబర్ మార్చబడిన తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ లకు మార్చినట్లు తెలియజేయబడతాయి. వ్యక్తిగత పరిచయాలకు మాత్రమే కాకుండా గ్రూపులలో కూడా మీ కొత్త వాట్సాప్ నంబర్ గురించి తెలియజేయబడుతుంది. ఈ ఫీచర్ తో మీ యొక్క అన్ని చాట్‌లు, మీడియా ఫైల్‌లు మరియు వాట్సాప్‌లో షేర్ చేయబడిన ఇతర డేటా పూర్తిగా డెలిట్ అవ్వకుండా అలాగే ఉంటాయి. వాట్సాప్ ఫోన్ నంబర్ మార్చడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది.