ప్రముఖ స్మార్ట్ ఫోన్ అండ్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్ స్మార్ట్ ఫోన్లకు ఇప్పుడు జూలై 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ తో కొత్త అప్‌డేట్‌ను అందుకుంటోంది. ప్యాచ్ అందుకున్న మొట్టమొదటి ఫోన్ సిరీస్ ఇది. ప్యాచ్‌తో పాటు, అప్ డేట్ కెమెరాతో పాటు వస్తుంది.


శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్ వీడియో పనితీరు మెరుగుదలలను పొందుతుందని, జూమ్ షూటింగ్ నాణ్యత కూడా అప్‌గ్రేడ్ అవుతుందని తెలిపింది. సరికొత్త శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 అప్‌డేట్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో విడుదలవుతోంది.గెలాక్సీ ఏ 51, ఏ 71 పరికర కస్టమర్లు ఇప్పుడు గెలాక్సీ ఎస్ 20 సిరీస్ యొక్క శక్తివంతమైన ఆవిష్కరణలను ఉపయోగించుకోగలుగుతారు.

 ట్విట్టర్‌లో ఒక కొరియా యూజర్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20  కొత్త అప్‌డేట్ అందుకున్న స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. షట్టర్ స్పీడ్ కంట్రోల్, మాన్యువల్ ఫోకస్‌తో సహా గెలాక్సీ ఎస్ 20 నుంచి వినియోగదారులు అనేక ప్రో మోడ్ ఫంక్షనాలిటీలను కూడా ఆస్వాదించవచ్చు. అప్ డేట్ తరువాత, మెరుగైన కీబోర్డ్ కార్యాచరణలు టైప్ చేసేటప్పుడు వినియోగదారులకు మరింత స్వేచ్ఛను ఇస్తాయి.

అప్ డేట్ ఫర్మ్ వేర్ వెర్షన్ అప్ డేట్ సైజ్ 386.35MB. ప్రస్తుతం ఈ అప్ డేట్ దక్షిణ కొరియాలో మాత్రమే ఉండగా, ఇది త్వరలో ఇతర దేశాలకు విస్తరించనుంది. ఈ ప్రాంతంలోని వారు అప్ డేట్ ఇంకా పొందక పోతే సెట్టింగులు> సాఫ్ట్‌వేర్ అప్ డేట్> డౌన్‌లోడ్ క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్20 సిరీస్ అప్‌డేట్ సరికొత్త జూలై 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌తో వస్తుంది.

ఇది మంచి మాగ్నిఫికేషన్ షాట్లు (జూమ్ షాట్లు), మెరుగైన వీడియో క్వాలిటీ వంటి కెమెరా ట్వీక్‌లను తెస్తుంది. ఇంకా, శామ్సంగ్ గెలాక్సీ ఎస్20 సిరీస్ అప్ డేట్ వల్ల వాయిస్ రికార్డింగ్ యాప్ ద్వారా ఆడియోను రికార్డ్ చేసేటప్పుడు బ్లూటూత్ మైక్రోఫోన్‌లను ఉపయోగించుకునేల సామర్థ్యాన్ని జోడిచింది. అప్ డేట్ మిర్రర్‌లింక్‌కు సపోర్ట్ గురించి కూడా పేర్కొంది. ఈ ఫీచర్ అనుకూల వాహనాల కోసం కార్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని ప్రారంభించింది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్‌లోని శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్20, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్20 ప్లస్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా ఉన్నాయి. మూడు ఫోన్‌లలోని కెమెరా, డిస్ ప్లే, బ్యాటరీలో తేడాలు తీసుకొచ్చింది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా స్మార్ట్ ఫోన్  చాలా ప్రీమియం మోడల్. సామ్‌సంగ్ సంస్థ  గెలాక్సీ ఎస్ 20 లైట్ మోడల్‌లో కూడా పనిచేస్తుందని, అక్టోబర్‌లో ఇది లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.