జియో 5G నెట్‌వర్క్
ఇండియాలో 5G స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే దీని యొక్క ట్రయల్స్
మొదలుకానున్నాయి. అలాగే దీనితో పాటుగా వచ్చే ఏడాది ఫీల్డ్
డిప్లాయ్‌మెంట్‌కు సిద్ధంగా ఉంటున్నట్లు RIL కంపెనీ యొక్క 43 వ
వార్షికోస్తవ సమావేశంలో (AGM) ముఖేష్ అంబానీ ఈ ప్రకటన చేశారు.
5G అంటే ఏమిటి
5G అనేది తరువాతి తరం మొబైల్ బ్రాడ్‌బ్యాండ్. ఇది 4G LTE కనెక్షన్‌ను భర్తీ
చేస్తుంది. 5G తో మీరు ముందు కంటే అతి వేగవంతమైన డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్
వేగాన్ని ఆశించవచ్చు. అలాగే 5G అనేది తక్కువ జాప్యాన్ని కూడా ఇస్తుంది.
ఇండియాలో 5G స్పెక్ట్రం వేలం
5G స్పెక్ట్రం యొక్క వేలం ఇండియాలో ఇంకా జరగలేదు. ఇండియాలో ప్రస్తుతం
టెలికాం పరిశ్రమ ఆర్ధిక పరంగా కొన్ని సమస్యలను ఎదురుకుంటున్నది. ఈ కారణాల
వలన భారత ప్రభుత్వం 2021కు ప్రణాళికాబద్ధమైన 5G స్పెక్ట్రం వేలంను ఆలస్యం
చేసింది.
జియో 5G ప్లాట్‌ఫాం
జియో ప్లాట్‌ఫాంలో ఇప్పటికే 4G, 5G, క్లౌడ్ కంప్యూటింగ్, డివైజెస్ అండ్
ఓఎస్, బిగ్ డేటా, AI, AR / VR, బ్లాక్‌చెయిన్, నేచురల్ లాంగ్వేజ్
అండర్స్టాండింగ్, కంప్యూటర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రపంచ స్థాయి
సామర్థ్యాలను నిర్మించడానికి 20 కి పైగా స్టార్ట్‌అప్ లను భాగస్వాములగా
చేర్చుకున్నది అని అంబానీ తెలిపారు.