Wednesday, April 8, 2020

కేవలం ఒక్క మిస్డ్ కాల్‌తో మీ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు SBI Account Balance Mini statement

SBI-Account-Balance-Mini-statement-proceesure-check-your-balance

  • ఎస్‌బీఐ నుంచి మిస్డ్ కాల్ సేవలు

  • అకౌంట్ బ్యాలెన్స్, మిని స్టేట్‌మెంట్ సహా పలు సర్వీసులు పొందొచ్చు

  • ఎలాంటి చార్జీలు ఉండవు.. చాలా సింపుల్

ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్‌ ఇస్తే చాలు.. మీ SBI అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిసిపోతుంది.
కేవలం ఒక్క మిస్డ్ కాల్‌తో మీ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
బ్యాంకు సేవలు పొందేందుకు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.
మీరున్న చోట నుంచే బ్యాంకు సేవల్ని పొందొచ్చు.
ఇందుకోసం మీకు కావాల్సింది ఓ ఫోన్.
అందులో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్.
బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇ-స్టేట్‌మెంట్, లోన్ ఆఫర్స్ ఇలా ఎలాంటి సేవలైనా సులువుగా పొందొచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇప్పటికే అనేక సేవలు పొందుతూ ఉండొచ్చు.
కానీ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కొన్ని సేవలు ఇంకా సులువుగా లభిస్తాయి.
ఖాతాదారులకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే అందించేందుకు మిస్డ్ కాల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించింది SBI.
మరి ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఏ సేవల్ని ఎలా పొందాలో తెలుసుకోండి.
SBI తన కస్టమర్లకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి సేవలతోపాటు మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సర్వీసులు కూడా అందిస్తోంది.

బ్యాంక్ ఖాతాదారులు చాలా సింపుల్‌గా ఒక్క మిస్డ్ కాల్‌తో బ్యాంక్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవచ్చు.

SBI మిస్డ్ కాల్ సర్వీసులు పొందాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.



ఇక గత ఆరు నెలల స్టేట్‌మెంట్ కోసం ESTMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి కోడ్ (ఏవైనా నాలుగు నెంబర్లు) ఎంటర్ చేసి 09223588888కు ఎస్ఎంఎస్ పంపాలి.

మీ ఈమెయిల్‌కు స్టేట్‌మెంట్ వస్తుంది.

దీన్ని ఓపెన్ చేయాలంటే మీరు ఎంటర్ చేసిన కోడ్‌ నెంబర్ అవసరం అవుతుంది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోన్ బ్యాంకింగ్ సేవలివే…

Generate ATM PIN: మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఏటీఎం పిన్ జెనరేట్ చేయొచ్చు.

PIN అని టైప్ చేసి ఆ తర్వాత మీ కార్డు నెంబర్ చివర్లో నాలుగు అంకెలు, అకౌంట్ నెంబర్లో చివరి నాలుగు అంకెలు కలిపి 567676 నెంబర్‌కు పంపాలి. మీ ఫోన్ నెంబర్‌కు OTP వస్తుంది.

ఆ OTP రెండురోజులే పనిచేస్తుంది.

SBI Balance Enquiry: మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.

లేదా ‘BAL’ అని టైప్ చేసి ఇదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

SBI Mini Statement: చివరి 5 లావాదేవీల మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే 09223866666 నెంబర్‌కు కాల్ చేయాలి.

లేదా అదే నెంబర్‌కు ‘MSTMT’ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.

SBI E-Statement: మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి ఆరు నెలల ఇ-స్టేట్‌మెంట్ పొందొచ్చు.

ఇందుకోసం ESTMT అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్ వస్తుంది.

SBI Cheque Book Request: మీకు చెక్ బుక్ కావాలంటే “CHQREQ” అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది.

ఆ తర్వాత మీ సమ్మతి తెలుపుతూ CHQACCY6-అంకెలు అదే నెంబర్‌కు రెండు గంటల్లో పంపాలి.