ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో 166 ఖాళీలు
బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాటిలైట్ సెంటర్ (ఐఎస్‌ఏసీ) టెక్నీషియన్-బి/ డ్రాట్స్‌మన్-బి/టెక్నికల్ అసిస్టెంట్/సైంటిఫిక్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్/నర్స్-బి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. |
టెక్నీషియన్ -బి: 120 విభాగాలు వారీ పోస్టులు: ఎలక్ట్రో-మెకానిక్/టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్/మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్/మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్-57; ఫిట్టర్-27; ఎలక్ట్రికల్- 14; ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్-4; ఎలక్ట్రోప్లేటింగ్-1; గ్రిండర్-3; ఫొటోగ్రాఫర్/డిజిటల్ ఫొటోగ్రాఫర్-2; కార్పెంటర్-2; డీజిల్ మెకానిక్-1; ప్లంబర్-4, టర్నర్-3.అర్హత: పదో తరగతి లేదా తత్సమాన అర్హతతోపాటు సంబంధిత విభాగంలో ఎన్‌సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ సర్టిఫికెట్ ఉండాలి. డ్రాట్స్‌మన్-బి (6): మెకానికల్ 5; సివిల్ 1 అర్హత: పదోతరగతి లేదా తత్సమాన అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ఎన్‌సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ సర్టిఫికెట్ ఉండాలి. క్యాడ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్: 33, విభాగాలు:మెకానికల్-13, ఎలక్ట్రానిక్స్-18, కంప్యూటర్‌సైన్స్-02, సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ)-3, లైబ్రరీ అసిస్టెంట్ -3, నర్స్-బి 1. వయసు: 2016 జూన్ 17 నాటికి 18-35 ఏళ్లు. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, నైపుణ్య పరీక్ష దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మే 28, 2016 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 17, 2016 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: www.isro.gov.in |