
మూడు పదుల వయసు దాటినా ముదురు భామ శ్రియ.. ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన  క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది. అందులో భాగంగా తాజాగా అమ్మడు ఓ బంపర్ ఆఫర్  కొట్టేసిందని సమాచారం. బాహుబలి రెండో భాగంలో ఓ కీలక పాత్ర కోసం శ్రియను  ఎంపిక చేశారని వినిపిస్తోంది.    బాక్సాఫీసును షేక్ చేసిన బాహుబలికి సీక్వెల్ గా బాహుబలి పార్ట్-2  తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో  నటించే అవకాశం శ్రియకు రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో ఈ  మూవీలో శ్రియ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయం పై రకరకాల ఊహాగానాలు  వినిపిస్తున్నాయి.    ముఖ్యంగా బాహుబలి-2 కథని కీలక మలుపు తిప్పే పాత్రలో శ్రియ కనిపించబోతుందని  టాక్. అయితే బాహుబలిలో రానా భార్య ఎవరో రివీల్ చేయలేదు జక్కన్న. దాంతో ఆ  పాత్రకే శ్రియను సెలెక్ట్ చేశారని వినికిడి. అంతేకాదు ఈ క్యారెక్టర్ లో  కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. ఏదేమైనా ఈ న్యూస్ నిజమైతే భల్లాలదేవుడి  భార్య నెగెటివ్ పాత్రలో శ్రియకు బంపర్ ఆపర్ దక్కినట్టే. చూద్దాం ఈ విషయం పై  ఎప్పుడు క్లారిటీ వస్తుందో!