గబ్బర్ సింగ్ చిత్రం సూపర్ హిట్‌తో శృతిహాసన్‌కు తెలుగులో డిమాండ్  పెరిగింది. అప్పటి వరకు చిన్న హీరోల సరసన నటించిన శృతి. ఒక్కసారిగా స్టార్  హీరోయిన్‌గా మారింది. రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇప్పుడు శ్రీమంతుడు  చిత్రంలో మహేష్‌బాబుతో జోడి కట్టింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఈ  చిత్రం ఆగస్ట్ 7న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్బంగా శృతి హాసన్ చిత్ర  విశేషాల గుర్చి ముచ్చటించారు.   మహేష్‌బాబుతో నటించిన అనుభూతి?   మహేష్‌బాబుతో కలసి పని చెయాలని ఎప్పటి నుండో ఉంది. శ్రీమంతుడి చిత్రంతో  కలసి పని చేస్తున్నాం. పెద్ద స్టార్ అయినా మహేష్ చాల సింపుల్‌గా ఉంటారు.  అందరితో కలసి పోయి అందరికి ఎనర్జీని పెంచుతాడు. సరదాగా ఉంటారు.   శ్రీమంతుడు చిత్రం మీకు ఎలా వచ్చింది?   దర్శకుడు కొరటాల శివ కథ చెప్పారు. నచ్చింది. కాలేజి స్టూడెంట్ పాత్ర నాది.  దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్బుతం. శ్రీమంతుడు లో నా పాత్ర  ఎంత బాగుంటుందో చిత్రం చూశాక తెలుస్తుంది.   చారుశీల పాత్ర ?   చారుశీల పాత్ర చాల సహజంగా ఉంటుంది. చారుశీల పాత్ర డిఫెరెంట్‌గా ఉంటుంది. ఈ  పాత్రలో కామెడి ఉండదు. ఆలోచనాత్మకంగా, సున్నిత బావోద్వేగాలతో                 సాగే పాత్ర ఇది.   ఈ చిత్రంలో సొంతంగా పాడలేదే ?   సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ను అడగాలి. తమిళ్‌లో అవకాశం ఇస్తే పాడాను.  శ్రీమంతుడు పాటలు బాగున్నాయి. సూపర్ హిట్ అయ్యాయి. ఆడియో సక్సెస్ అయినందుకు  చాల హ్యాపిగా ఉంది.   దర్శకుడు కొరటాల శివ గుర్చి చెప్పాండి?   దర్శకుడు శివ వ్యక్తిగతంగా చాల కామ్‌గా ఉంటారు. ఆయన చిత్రీకరణ చాల  అద్బుతంగా ఉంటుంది. పాత్రల్లో మాత్రం మంచి భావోద్వేగాలు పలికిస్తారు. తనకి  కావాలసిన ఔట్ ఫుట్‌ను చాలా చక్కగా రాబట్టుకుంటారు.   జగపతిబాబు తో నటించినప్పుడు ఎలా ఉంది?   జగపతిబాబు గారు ప్రేండ్లీగా ఉంటారు. ఒక సీనియర్ ఆర్టిస్ట్‌తో పని చెయడం చాల  హ్యాపిగా ఉంది. చాల సరదాగా ఉంటారు.   ఖాళీ టైమ్‌లో ఏమి చెస్తారు?   ఖాళీ సమయంలో టివి చూస్తాను. ఎక్కువగా పుస్తకాలు చదువుతాను, ఫ్రెండ్స్‌తో  కాలక్షేపం చేస్తాను.   లేడి ఓరియేంటేడ్ చిత్రాలు చేస్తారా?   అలాంటిది ఏమి ఉండదు. క్యారెక్టర్ బట్టి పాత్ర ఉంటుంది. ప్రతి సినిమాలో అని  మంచి పాత్రలు ఉంటాయి. సినిమా బట్టి ప్రధాన పాత్ర ఉంటుంది తప్ప లేడి  ఓరియేంటేడ్ అంటు సినిమాలు ఉండవు.   మీ చెల్లితో కలసి నటించే అవకాశం ఉందా?   తప్పకుండా ఉంటుంది. ఇద్దరికి సరిపడ మంచి సబ్జెట్ దొరికితే తప్ప కుండా కలసి  పని చేస్తాం.   నెస్ట్ చిత్రాలు?   తెలుగు, తమిళ్, హింది భాషల్లో ప్రస్తుతం బిజిగా ఉన్నాను. మంచి చిత్రం ఏ  భాషలో వచ్చినా వదలను.