44 సంవత్సరాలు ఉన్న వారంతా అర్హులే.. ఈ అవకాశం సంవత్సరం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖల్లో 15,522 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా 3,783, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 9058, విద్యుత్‌శాఖ ద్వారా 2681 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వ కార్యదర్శి ఎన్. శివశంకర్ ఉత్తర్వులు విడుదల చేశారు. నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు. అన్ని శాఖలు తమ శాఖల పరిధిలో అనుమతి ఇచ్చిన ఖాళీలు, రోస్టర్ పాయింట్లు వివరాలను త్వరగా టీఎస్‌పీఎస్సీకి పంపించాలని ఆదేశించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్ పోస్టులను గుర్తించాలని పేర్కొన్నారు. హోంశాఖలో.. డీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్లు 12 ఖాళీలు. కానిస్టేబుళ్లు 174, డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విభాగంలో ఆర్మ్‌డ్ రిజర్వు పోలీస్ కానిస్టేబుల్ 2760, పోలీస్ కానిస్టేబుల్ (స్టేట్ ఆర్మ్‌డ్ రిజర్వు సెంట్రల్ పోలీస్ లైన్స్) 56, పోలీస్ కానిస్టేబుల్ 1810, పోలీస్ కానిస్టేబుల్ (టీఎస్ ఎస్పీ-15 బెటాలియన్) 349 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ (టీఎస్ ఎస్పీ-15 బెటాలియన్ కాకుండా)2860, సబ్ ఇన్‌స్పెక్టర్లు(సివిల్) 107, (ఏఆర్) 91 మంది, టీఎస్‌ఎస్‌పీ ఆర్‌ఎస్‌ఐ 288, సబ్ ఇన్‌స్పెక్టర్(కమ్యూనికేషన్స్) 35, సబ్ ఇన్‌స్పెక్టర్ (పీటీవో) ఆరు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసులో ఫైర్‌మెన్ 416, డ్రైవర్ ఆపరేటర్లు 85, స్టేషన్ ఫైర్ అధికారులు 9 ఖాళీల భర్తీకి అనుమతి లభించింది. కాగా, టీఎస్ జెన్‌కో అసిస్టెంట్ ఇంజనీర్లు 988, సబ్ ఇంజనీర్లు 92, టీఎస్ ఎన్‌పీడీసీఎల్‌లో అసిస్టెంట్ ఇంజనీర్లు 309, సబ్ ఇంజనీర్లు 314, టీఎస్ ఎస్పీడీసీఎల్‌లో అసిస్టెంట్ ఇంజనీర్లు 427, సబ్ ఇంజనీర్లు 153 , టీఎస్ ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజనీర్లు 224, సబ్ ఇంజనీర్లు 174 ఖాళీల భర్తీకి అనుమతి లభించింది. విద్యుత్ శాఖలో మొత్తం 2681 ఖాళీలకు అనుమతి లభించింది.