ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు మన మిత్రులు అలానే శ్రేయోభిలాషులకు సోషల్ మీడయా నెట్‌వర్క్స్ అలానే మొబైల్ టెక్స్ట్ మెసెజ్‌ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతుంటాం. ఒక్క పండుగ సమయాల్లో మాత్రమే కాదు గ్రూప్ కార్యక్రమాలు, పార్టీలు, హాలిడే మీటింగ్‌లు ఇలా అనేక కార్యక్రమాలను పురస్కరించుకుని బల్క్ ఎస్ఎంఎస్ ఆప్షన్‌లను వినియోగించుకుంటుంటాం. అయితే, ఇటీవల కాలంలో ప్రభుత్వం విధిస్తోన్న తాత్కాలిక ఆంక్షలు కారణంగా అన్ని వేళల్లో బల్క్ ఎస్ఎంఎస్‌లు సాధ్యం కావటం లేదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇన్‌స్టెంట్ మొబైల్ మెసేజిగంగ్ యాప్ వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను షేర్ చేసుకునేందుకు పలు తీరదైన దారులను ఇప్పుడు చూద్దాం.... మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది. అయితే మీ విలువైన సమయాన్ని కాస్తంత వెచ్చించి కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్‌ను షేర్ చేయవచ్చు. ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ 'కీ'ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి. మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి. ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్‌ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్‌ను పంపేందుకు కాపీ చేసుకోండి. వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.