చైనా అధ్యక్షుడు షీ చిన్‌ఫింగ్‌ను భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా షీ చిన్ ఫింగ్ మాట్లాడు తూ త్వరలో చైనా - భారత్ సంబం దాల్లో కొత్త దశ రూప దాల్చనుందని అన్నారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో భారత విదేశాంగశాఖ మం త్రి సుష్మాస్వరాజ్‌కు చైనా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భం గా ఆయన తన భారత పర్యటన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గతంలో తాను భారత్ వచ్చిన సందర్భంలో అం దిన స్వాగతం అపూర్వమన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోడీ తనను ఆహ్వానించిన తీరును ఇప్పటికీ మరువలేనిదని అన్నారు. గత సెప్టెంబరులో ప్రధాని నరేంద్రమోడీని కలుసుకున్నానని పేర్కొన్నారు. భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధానికి తన అభినందనలు తెలియజేయాలని కోరారు. మోడీ పర్యటన అనంతరం ఇరు దేశాల మధ్య మరింత సుహృద్భావం వెల్లివిరిసిందని, ఇరు దేశాల అనుబంధంలో కొత్త దశ మొదలైందని అన్నారు. మున్నుందు ఈ బంధం మరింత దృఢపడి ఇరు దేశాల అభివృద్ధికి దోహదపడాలన్నారు. అలాగే త్వరలో జరగబోయే ఇరు దేశాల దె్వైపాక్షిక సమావేశాలు మరింత ప్రగతిని ప్రతిబింబించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కాగా ఈ నెల చివరిలో జరగనున్న చైనా నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని చైనావాసులకు శుభాకాంక్షలు తెలిపారని సుష్మా పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ఇరు దేశాల మధ్య జరగబోయే సమావేశాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నానని సుష్మా అన్నారు.