అమెరికా అధ్యక్షుడి రాకతో భారత్ అంత హడావుడి నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ఏర్పాట్లతో తెగ హైరానా పడుతున్న భారత ప్రభుత్వం ఆయన ఆగ్రా పర్యటన రద్దు తో ఒక్కసారి కంగు తింది. ఏది ఏమైనా అది భద్రత కారణాల వల్లే అని స్పష్టమైంది. కాని మన దేశం లో భద్రత విషయం లో కొంచెం భయపడాల్సిన అవసరం ఉందని అగ్ర రాజ్య నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తుంది. అందుకే ఒబామా తన భారత పర్యటన ను కుదించుకున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఏ అమెరికా అధ్యక్షుడు కూడా మన దేశం లో పర్యటించటానికి వచ్చి మళ్ళి తమ ప్రణాళిక ను సవరించుకున్న దాఖాలాలు లేవు. ఇప్పుడు ఒబామా కొన్ని కారణాలతో తన ప్రణాళిక ను మార్చుకున్నాడు. ఏది ఏమైనా ఇది కొంచెం మన భారత ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఆయన గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే. ఇప్పటివరకు మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షులు ఎవరెవరన్నది కూడా ఆసక్తికరమైన విషయమే. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67 ఏళ్లయినా.. ఇప్పటికి ఒబామాతో కలిపి కేవలం ఆరుగురు అధ్యక్షులు మాత్రమే అమెరికా నుంచి వచ్చారు. ఎవరు కూడా ముందే నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం ఆ ప్రణాళిక ని అనుసరించిన వాళ్ళే కావటం గమనార్హం. ఇంతకుముందు 1959 సంవత్సరంలో ఐసన్ హోవర్, 1969లో రిచర్డ్ నిక్సన్, 1978లో జిమ్మీ కార్టర్, 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్, 2006లో జార్జ్ డబ్ల్యు బుష్, 2010లో బరాక్ ఒబామా మన దేశంలో పర్యటించారు. ఇప్పుడు ఒబామా.. రెండోసారి మన దేశానికి వస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఒబామా పర్యటన పట్ల భారత ప్రభుత్వం చాల శ్రద్ధ తీసుకొని కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది.