Wednesday, September 10, 2014

చదవక్కర్లేదు... విందాం!


ఫోన్‌... కంప్యూటర్‌... ట్యాబ్లెట్‌ దేంట్లోనైనా మేటర్‌ని చదవాల్సిందేనా? కళ్లు మూసుకుని హాయిగా వినలేమా? వినొచ్చు... అందుకు తగిన సర్వీసులు ఉన్నాయి! అవేంటో చూద్దాం!ళీ దొరికితే చాలు. బ్రౌజింగ్‌... బ్రౌజింగ్‌! ఆసక్తికరమైన వ్యాసం కనిపిస్తుంది. కళ్లు పెద్దవి చేసుకుని చదువుతాం. కాసేపటికి కళ్లు ఒత్తిడికి లోనవుతాయి. చిన్న విరామం తీసుకుంటాం. మళ్లీ చదువుతాం. వ్యాసం చదవడం పూర్తయ్యాక కళ్లు నలుపుకుంటూ ఇంకో సైట్‌లోకో... బ్లాగులోకో వెళ్తాం. ఇంత కష్టపడడం దేనికి? కావాల్సిన టెక్స్ట్‌ని సెలెక్ట్‌ చేసుకుని వింటే హాయిగా ఉంటుందిగా! అదెలా? అనే సందేహం వస్తే ఈ వెబ్‌ సర్వీసుల గురించి తెలుసుకోండి. కంప్యూటర్‌ యూజర్లు క్రోమ్‌ బ్రౌజర్‌కి జత చేసుకుని వాడుకోవచ్చు. ఆప్స్‌ రూపంలో మొబైల్‌లోనూ ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. సరాసరి సైట్‌లోకి లాగిన్‌ అయ్యి కూడా వాడుకోవచ్చు. మరి, ఆయా సర్వీసుల సంగతులేంటో తెలుసుకుందాం!పీసీ... ఫోన్‌ దేంట్లోనైనా టెక్స్ట్‌ని హాయిగా వినేందుకు వెబ్‌ సర్వీసులోకి వెళ్లండి. నెట్టింట్లో వార్తల్ని, వెబ్‌సైట్‌లు, బ్లాగులు, డాక్యుమెంట్స్‌ని చదివి వినిపిస్తుంది. ఉదాహరణకు బీబీసీ సైట్‌లోని వార్తల్ని ఎప్పటికప్పుడు వినాలనుకుంటే లింక్‌ని ఎంటర్‌ చేసి ఈమెయిల్‌కి అప్‌డేట్స్‌ వచ్చేలా చేయవచ్చు. ఉచితంగా సభ్యులై సర్వీసుని వాడుకోవచ్చు. ప్రీమియం వెర్షన్‌లో పీడీఎఫ్‌ డాక్యుమెంట్స్‌ని సైట్‌లోకి అప్‌లోడ్‌ చేసుకుని వినొచ్చు.విభాగంలోకి వెళ్లి మీరు నిత్యం బ్రౌజ్‌ చేసే వాటిని జాబితాగా పెట్టుకుని వాటిల్లో అప్‌డేట్స్‌ని ఆడియో రూపంలో వినొచ్చు. వినిపించే గొంతుల్ని కూడా మార్పులు చేసుకోవచ్చు. డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌, స్కైడ్రైవ్‌... లాంటి క్లౌడ్‌ సర్వీసులతో సింక్‌ అయ్యి డేటాని మేనేజ్‌ చేసుకోవచ్చు కూడా. ప్లే చేసుకున్న ఆడియో ఫైల్‌ని కావాలంటే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడుతున్నట్లయితే ఎక్స్‌టెన్షన్‌ రూపంలోనూ బ్రౌజర్‌కి జత చేయవచ్చు. అందుకు క్రోమ్‌ వెబ్‌స్టోర్‌ నుంచి ఎక్స్‌టెన్షన్‌న్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. బ్రౌజర్‌కి జత చేయగానే అడ్రస్‌బార్‌ పక్కనే స్పీకర్‌ ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి యాక్సెస్‌ చేయవచ్చు. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి. ఇక మొబైల్‌లోనూ సర్వీసుని వాడుకోవాలంటే ఆప్‌ రూపంలో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌లోకి వెళ్లండి. విండోస్‌ మొబైల్‌ యూజర్లు విండోస్‌ ఫోన్‌ ఆప్‌ స్టోర్‌ నుంచి పొందొచ్చు.సులువైన ఇంటర్ఫేస్‌తో టెక్స్ట్‌ని వినాలనుకుంటే ఎక్స్‌టెన్షన్‌ని ప్రయత్నించొచ్చు. క్రోమ్‌ బ్రౌజర్‌ వాడితే క్రోమ్‌ వెబ్‌స్టోర్‌ నుంచి ఎక్స్‌టెన్షన్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నిత్యం బ్రౌజర్‌తో జతకట్టి పని చేస్తుంది. ఇన్‌స్టాల్‌ చేయగానే అడ్రస్‌బార్‌ పక్కన ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. ఇక మీరు ఏదైనా మేటర్‌ని వినాలనుకుంటే సెలెక్ట్‌ చేసి ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే చాలు, చదివి వినిపిస్తుంది. హాయిగా వింటూనే ఇతర పనుల్ని చక్కబెట్టేయవచ్చు. ఉదాహరణకు వికీపీడియాలో ఏదైనా టెక్స్ట్‌ మేటర్‌ని వినాలనుకుంటే ముందుగా టెక్స్ట్‌ మేటర్‌ని సెలెక్ట్‌ చేసి స్పీకర్‌ గుర్తుపై క్లిక్‌ చేయండి. 'ఆప్షన్స్‌'లోకి వెళ్లి వాయిస్‌ని కావాల్సినట్టుగా మార్పులు చేసుకోవచ్చు. ఆడ, మగ వాయిస్‌ల్లో మీకు కావాల్సిన వాయిస్‌ని చెక్‌ చేయవచ్చు. చదివే స్పీడ్‌ని కూడా 'ప్లేబ్యాక్‌ ఆప్షన్స్‌'లో సెట్‌ చేసుకోవచ్చు. షార్ట్‌కట్‌ ద్వారా ఎక్స్‌టెన్షన్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. ఉదాహరణకు వినాలనుకునే టెక్స్ట్‌ని సెలెక్ట్‌ చేసుకున్నాక మీటల్ని నొక్కి వినొచ్చు. బ్రౌజర్‌కి జత చేసుకుందాం అనుకుంటే లింక్‌లోకి వెళ్లండి. ఫైర్‌ఫాక్స్‌ యూజర్లు యాడ్‌ఆన్‌ రూపంలో పొందొచ్చు.నెట్టింట్లో ఎక్కడి టెక్స్ట్‌నైనా సెలెక్ట్‌ చేసి వినేందుకు మరో వేదిక ఎక్స్‌టెన్షన్‌. క్రోమ్‌ వెబ్‌స్టోర్‌ నుంచి ఎక్స్‌టెన్షన్‌ని పొందొచ్చు. 'ప్లేబ్యాక్‌' సెట్టింగ్స్‌ని కావాల్సినట్టుగా మార్చుకుని వినొచ్చు. అందుకు ఐకాన్‌ గుర్తుపై రైట్‌క్లిక్‌ చేసి పై క్లిక్‌ చేయాలి. 'వాయిస్‌' మెనూలోకి వెళ్లి వివిధ దేశాల ఆడ, మగ వాయిస్‌లను ఎంపిక చేసుకోవచ్చు. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి. వెబ్‌స్టోర్‌లోని ఎక్స్‌టెన్షన్‌లు ఒక్కటే కాదు. ఆప్స్‌ రూపంలోనూ కొన్ని సర్వీసుల్ని ఇన్‌స్టాల్‌ చేసుకుని టెక్స్ట్‌ మరింత అనువుగా వినొచ్చు. కావాలంటే ఆప్‌ని ప్రయత్నించండి. బ్రౌజర్‌కి జత చేసిన తర్వాత ద్వారా పొందొచ్చు. మేటర్‌ని సెలెక్ట్‌ చేసి రైట్‌క్లిక్‌ మెనూలో ఆప్షన్‌ని పొందొచ్చు.
by: Eenadu