జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం?
మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నది సామెత. ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజలకు చేరాలంటే బ్యాంకు ఖాతాలు తెరవాల్సిందేనని ఆయన నొక్కి వక్కాణించారు. ఆగస్టు 28న దేశ వ్యాపిత కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కోటీ మందికిపైగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. అయితే ఈ ఖాళీ ఖాతాలతో ఏమిటి ప్రయోజనం అన్నదే ప్రధాన ప్రశ్న. ఇప్పటికే ఎన్నో ఎకౌంట్లు ఖాళీ గా వుండటం, వాటిని రద్దు చేసే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. అయితే ఈ ఖాతాల వల్ల జీవిత భీమా, తదితర ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులు నేరుగా ఖాతాదారుల ఖాతాల్లోకి వచ్చి చేరుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే భవిష్యత్తులో ఈ ఖాతాల ద్వారా పేద ప్రజలకు ఏ మేరకు మేలు జరుగనుందో చూడాల్సి వుంది.
by: 10tv