ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తుంటుంది.కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాటించే విధంగా ఎపిపియస్‌సికి క్యాలండర్ విధానం లేకపోవడంతో నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పలేం. అయితే త్వరలోనే ఎపిపియస్‌సి నుంచి పలు పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. వాటిలో కొన్ని ముఖ్యమైన పోస్టులు, వాటి అర్హతలు, పరీక్షా విధానం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. గ్రూప్-2 ఎపిపియస్‌సి నిర్వహించే రిక్రూట్‌మెంట్లలో అన్నింటి కన్నా ఎక్కువగా అభ్యర్థులు పోటీపడేది గ్రూప్-2 పోస్టులే. ఇందులో రెండురకాల కేటగిరీ పోస్టులు ఉంటాయి. అవి 1. ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 2. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో డిప్యూటీ తహసిల్దార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసర్, సబ్ రిజిస్ట్రార్ వంటి పోస్టులు ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉంటాయి. వీటిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇప్పటి వరకు మూడు పేపర్లతో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించి ఆపై ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించేవారు. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కేవలం రాతపరీక్ష ఆధారంగా నియామకాలు జరిపేవారు. అయితే ఎపిపియస్‌సి సంస్కరణల్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలిపి గ్రూప్-1బి గా పేర్కొని ఇక నుండి వాటికి కూడా గ్రూప్-1లో మెయిన్స్ పరీక్షలు రాయాలని నిర్ణయించారు. అయితే అభ్యర్థుల కోరిక మేరకు రాబోయే నోటిఫికేషన్‌కు మాత్రమే పాత పద్ధతిలో ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తారు.ఇంటర్వ్యూ ఉండదు.ఆ తర్వాత రిక్రూట్‌మెంట్లకు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గ్రూప్-1 మాదిరిగా ప్రిలిమ్స్ మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల ఎంపిక విధానం ఉంటుంది. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కేవలం ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది.అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పొంది ఉండాలి. కొన్ని పోస్టులకు కామర్స్, ఎకనామిక్స్, మేథమెటిక్స్, లా సబ్జెక్టుల్లో డిగ్రీ, కంప్యూటర్స్‌లో సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. మొత్తం 3 పేపర్లు - ఆబ్జెక్టివ్ విధానం 1. జనరల్ స్టడీస్ - 150 మార్కులు 2. ఆంధ్రప్రదేశ్ సామాజిక, చరిత్ర, రాజ్యాంగ అవలోకనం - 150 మార్కులు 3. భారత ఆర్థికవ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ - 150 మార్కులు మొత్తం - 450 మార్కులు జూనియర్ లెక్చరర్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు పాఠాలు బోధించే జూనియర్ లెక్చరర్ పోస్టులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాతపరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. మొదటి దశ - రాతపరీక్ష - ఆబ్జెక్టివ్ విధానం. మొత్తం 2 పేపర్లు. 1. జనరల్‌స్టడీస్ - 150 మార్కులు 2. సంబంధిత సబ్జెక్టు - 300 మార్కులు మొత్తం - 450 మార్కులు. రెండవదశ ఇంటర్వ్యూ - 50 మార్కులు. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు డిగ్రీ కాలేజీలో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్ పోస్టులు. అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. ఇంకా నెట్ లేదా స్లెట్ పరీక్ష పాసై ఉండాలి. పి.హెచ్.డి పాసైన అభ్యర్థులకు నెట్/ స్లెట్ అర్హత నుంచి మినహాయింపు ఇస్తారు. ఎంపిక విధానం : ఎంపిక విధానం 2దశల్లో ఉంటుంది. -మొదటిదశ రాతపరీక్ష - ఆబ్జెక్టివ్ విధానం -మొదటి పేపర్ - జనరల్‌స్టడీస్ - 150 మార్కులు -ండవ పేపర్ - సంబంధిత సబ్జెక్టు - 300 మార్కులు -మొత్తం - 450 మార్కులు -ండవదశ - ఇంటర్వ్యూ - 50 మార్కులు గ్రూప్-4 పోస్టులు గ్రూప్-4 కింద వివిధ డిపార్ట్‌మెంట్లలో జూనియర్ అసి స్టెంట్ పోస్టులు, మరికొన్ని డిపార్ట్‌మెంట్లలో సూపర్‌వైజర్ వంటి అదే కేటగిరికి చెందిన పోస్టులు భర్తీ చేస్తారు. అర్హతలు : జూనియర్ అసిస్టెంట్లకు ఇంటర్, సూపర్‌వైజర్లకు ,ఎస్‌ఎస్.సి, లేదా తత్సమాన అర్హత. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. - రెండు పేపర్లు - ఆబ్జెక్టివ్ విధానం - పేపర్-1 జనరల్ స్టడీస్ - 150 మార్కులు - పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ - 150 మార్కులు - మొత్తం - 300 మార్కులు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వి.ఆర్.ఓ) గ్రామాలలో ప్రభుత్వ అధికారిగా శాంతిభద్రతల నుంచి అభివృద్థి పథకాల అమలు వరకు కీలక బాధ్యతలు నిర్వహించే విలేజ్‌రెవెన్యూ ఆఫీసర్ తహసిల్దార్ పర్యవేక్షణలో పనిచేస్తారు. విద్యార్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ద్వారా జరుగుతుంది. - రాత పరీక్షలో 100 మార్కులకు జనరల్‌స్టడీస్ పేపర్ ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటిసారిగా పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీని చేపడుతోంది. గ్రామీణా భివృద్ధిలో కీలక పాత్ర పోషించే గ్రామపంచాయితీకి సెక్రటరీగా ముఖ్యమైన విధులు, బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ర్టంలో 21,809 గ్రామాలు ఉన్నాయి. వీటికి పంచాయతీ సెక్రటరీని నియమించాల్సి ఉండగా కొన్ని చోట్ల కాంట్రాక్టు పద్ధతిలో పంచాయతి సెక్రటరీలను నియమించగా మరికొన్నిచోట్ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వీరిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడగా ఆన్‌లైన్ - దరఖాస్తుల పక్రియ ప్రారంభం కావాల్సిన దశలో వాయిదా పడింది. త్వరలో సెక్రటరీ పోస్టుల దరఖాస్తుల పక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ద్వారా ఉంటుంది. రాత పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. 1. జనరల్‌స్టడీస్ - 150 మార్కులు 2. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పేపర్ - 150 మార్కులు మొత్తం - 300 మార్కులు.
Notification,Syllabus,Model Papers, SBI Jobs, Material, SI, E Books Download, Online Results, Mobile Useful , Android, New Apps,Tech News,apk file,
Thursday, March 20, 2014
ఏ పోస్టుకు ఏం చదవాలి?