దేశంలోనే మొట్టమొదటి మోనో రైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ 2014 ఫిబ్రవరి 1న వడాలా డిపోలో రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 2014, ఫిబ్రవరి 2 నుంచి మోనోరైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రూ. 3,000 కోట్ల వ్యయమయ్యే ఈ మోనోరైలు ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేస్తున్నారు. మొదటి దశలో .9 కి.మీ. దూరం మేర వడాలా డిపో చెంబూరు సెక్షన్‌ను ప్రారంభించారు. రెండో దశలో వడాలా డిపోనుంచి దక్షిణ ముంబైలోని సంత్ గార్డెన్ మహారాజ్ చౌక్ వరకు విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ మలేషియాకు చెందిన స్కోమి ఇంజినీరింగ్ సంస్థతో కూడిన కన్సార్టియం చేపట్టింది. మోనోరైలు నిర్వహణను ముంబాయి మెట్రోపాలిటన్ రీజియస్ డెవలప్‌మెంట్ అథారిటీ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ. 3,000 కోట్లలో ఇప్పటికే రూ. 1,900 కోట్లను ఎంఎంఆర్‌డీఏ వ్యయం చేసింది. దూరాన్ని బట్టి రూ.5 నుంచి 11 వరకు ప్రయాణ చార్జీలు వసూలు చేస్తారు. టికెట్ ధరను అధికారులు నిర్ణయిస్తారు. మొదటి దశలో ఆరు మోనో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మరో పది రైళ్లు రెండో దశలో అందుబాటులోకి రానున్నాయి. మోనో రైలు ప్రత్యేకతలు -ఒక బోగీలో 20 మంది కూర్చొని, 130 మంది నిల్చుని ప్రయాణించే వీలుంది. మొత్తం నాలుగు బోగీల్లో ఒకేసారి 600 మంది ప్రయాణించవచ్చు. ఒక్క గంటలో సుమారు 20 వేల మందికి పైగా ప్రయాణించవచ్చు. -రైలు మార్గం పొడవు .93 కిలోమీటర్లు. వేగం గంటకు గరిష్టంగా 0 కిలోమీటర్లు. -మెట్రో రైలుతో పోల్చితే మోనో రైలు నిర్మాణ వ్యయం చాలా తక్కువ. -నగరాల్లో రోడ్ల విస్తరణకు స్థలం లభించని సమయంలో మోనోరైలు చాలా తక్కువ స్థలంలో పరిగెత్తనున్నాయి. ముఖ్యంగా భూమికి 20 నుంచి 30 అడుగుల ఎత్తుపై నుంచి వెళ్లే ఈ రైళ్లు రోడ్ల మధ్య ఉండే డివైడర్లపై ఒకే ఒక్క స్తంభంపై రెండు రైళ్లు పరిగెత్తేందుకు వీలుగా రైలు మార్గం ఏర్పాటు చేయవచ్చు. -మెట్రో రైళ్లు సాధారణంగా సమాంతరంగా ఉండే రెండు పట్టాలపై నడుస్తాయి. మోనో రైలుకు ఒకే పట్టా ఉంటుంది. పట్టా వెడల్పు కూడా రైలు కంటే తక్కువగా ఉంటుంది. తొలుత జర్మనీలో మోనో రైళ్లు ప్రారంభమయ్యాయి. జపాన్‌లో 1950లలో ఇవి ప్రాచుర్యం పొందాయి. ట్రాఫిక్ సమస్యనుంచి గట్టేక్కేందుకు జపాన్ వీటిని వాడుకలోకి తెచ్చింది