Friday, September 27, 2024

AP TET Model Papers Download

 GURU ACADEMY MODEL TEST


 SA Maths & Science Paper II Grand test 1 .pdf

SA Social Paper II Grand test 1.pdf

 AP TET SGT Top 1 Model Papers 2.pdf

 

 

Free Sewing Machine Scheme 2024 | ఉచిత కుట్టు మిషన్ స్కీమ్ 2024

 


Free Sewing Machine Scheme 2024 apply online: ప్రధానమంత్రి ఉచిత కుట్టు మిషన్ కావాలా ! ఇలా చెయ్యండి

మీలో ఎవరికైన ఈ మీకు ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి తెలుసా? PM విశ్వకర్మ యోజన పథకం అనే కొత్త పధకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా మీరు ఏ విధం గా
కుట్టు మిషన్ పొందాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసులుకుందాం ! ఈ పథకం ద్వారా కుట్టు మిషన్ కొనాలి అనుకున్న వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా 20,000 వరకు అందజేస్తుంది. ఈ పథకంలో మహిళలు కాకుండా పురుషులు కూడా అవకాశం కల్పించడం విశేషం అనే చెప్పాలి

 ఈ పథకంలో దరఖాస్తు చేరేందుకు అర్హతలు :

  1. వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  2. ఆధార్ కార్డు జిరాక్స్,
  3. బ్యాంకు ఖాతా జిరాక్స్,
  4. Voter ID,
  5. Pancard
  6. Driving Licence జిరాక్స్,
  7. ఆదాయ ధ్రువీకరణ పత్రం,
  8. Passport సైజ్ కలర్ ఫొటోస్ కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం :

ఉచిత కుట్టు మిషన్ కోసం అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు https://pmvishwakarma.gov.in/ లో లాగ్ ఇన్ అవ్వాలి. ఆన్లైన్ లో మేకు ఇబ్బంది అనిపిస్తే మీకు దగ్గర లో ఉన్నటువంటి CSC సెంటర్ కి వెళ్ళి అప్లై
చేసుకోవచ్చు. మీరు అప్లయ్ చేసుకున్నాక మీకు ఒక స్లిప్ ఇస్తారు, ఆ చీటీ మీ దగ్గర ఉంచుకోండి. మీ వివరాలు అన్ని చెక్ చేసి తర్మీవాత మీకు ఏప్రిల్ లోపల ఫ్రీగా కుట్టు మిషన్ మీ దగ్గరికి వస్తుంది.

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం :

PM విశ్వకర్మ పథకంలో బేసిక్, అడ్వాన్స్డ్ అనే రెండు రకాల ట్రైనింగ్ ఇస్తారు. ఈ పధకం లో చేరిన లబ్ధిదారులకు శిక్షణ కాలం లో రోజుకి రూ.500 చొప్పున స్తైఫెండ్ ఇస్తారు. అలాగే ఆధునిక యంత్ర పరికరాలు కొనుక్కోవడానికి కేంద్రం రూ.15,000 వరకూ మీకు ఆర్థికసాయం అందజేస్తారు. ఈ పధకం క్రింద మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని తెలిపారు. అంతే కాదు విశ్వకర్మ పథకంతో మన సంప్రదాయ కళాకారులకు, చేతి వృత్తి దారులకు కుడా మరింత ప్రోత్సాహం లభిస్తుందని. కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం యొక్క ప్రయోజనాలు:

ఈ పథకంలో చేరే చిన్న మరియు మధ్య తరగతి లబ్దిదారులు అయిన స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు ఇలాంటి లబ్దిదారులకు ఈ పథకం ద్వారా రూ.2 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. కాని వడ్డీ రేటు 5 % వరకు చెల్లించాలి. లబ్ధిదారులకు నైపుణ్య కోసం ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అంద జేయడం జరుగుతుంది. మార్కెటింగ్ చెయ్యడం కోసం మీకు అవసరం అయితే మద్దతు కూడా ఇస్తారు. అంటే మీ ఉత్పత్తులను అమ్మడం కోసం ప్రభుత్వం మీకు సహకరిస్తుంది.

PM Vishwakarma Yojana – ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన – అర్హులు ఎవరు

  1. చేనేత కార్మికులు
  2. స్వర్ణకారులు
  3. వడ్రంగులు
  4. లాండ్రీ కార్మికులు
  5. క్షురకులు
  6. కుమ్మరులు
  7. శిల్ప కళాకారులు
  8. రాళ్లు కొట్టేవారు
  9. తాపీ మేస్త్రీలు
  10. బుట్టలు అల్లేవారు
  11. చీపుర్లు తయారుచేసేవారు
  12. తాళాలు తయారుచేసేవారు
  13. బొమ్మల తయారీదారులు
  14. పూలదండలు తయారుచేసేవారు.
  15. మత్స్యకారులు దర్జీలు
  16. చేపల వలలు అల్లేవారు.

పై తెలిపిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే.

ఈ పథకం సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి రూ.2 లక్షల దాకా రుణసదుపాయం మరియు లబ్ధిదారులకు కావలసిన నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కూడా ఉంటుంది.

Free Sewing Machine Scheme 2024 apply online – ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం – అప్లై చేసే విధానం – కావలసిన డాక్యుమెంట్స్

కావలసిన డాక్యుమెంట్స్

  • ఆధార్ కార్డు జిరాక్స్
  • బ్యాంకు ఖాతా జిరాక్స్
  • భూమి పాస్ బుక్ జిరాక్స్
  • Voter ID జిరాక్స్
  • Pancard జిరాక్స్
  • Driving Licence జిరాక్స్
  • కౌలు రైతు అయితే రైతు నుంచి NOC.
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • తాజాగా తీసుకున్నటువంటి 3 Passport సైజ్ కలర్ ఫొటోస్

ఈ పథకానికి మీరు గాని అప్లై చేయాలి అనుకుంటే మీ సేవా సెంటర్ కి వెళ్ళి అప్లయ్ చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అయితే వాళ్లకి దగ్గర లో ఉన్నటువంటి సచివాలయంలో వెళ్ళి దరఖాస్తు చేసుకుని మీకు కావలసిన ఎలాంటి వివరాలు అయిన తెలుసుకోవచ్చు.

 

 

 

Thursday, September 26, 2024

30 రోజుల్లో డిజిటల్‌ హెల్త్‌కార్డులను తీసుకువస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth On Digital Health Cards

 


మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ రెనోవా క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం, విద్య, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

 

CM Revanth Key Announcement On Digital Health Cards : నెలలోపు కుటుంబ డిజిటల్‌ హెల్త్‌ కార్డులను తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ డిజిటలైజ్‌ చేస్తామన్నారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆస్పత్రిని, ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. హెల్త్‌కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాన్సర్‌ చికిత్స కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని, సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.

"తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్లమంది ప్రజలకు హెల్త్​ ప్రొఫైల్​ డిజిటలైజ్​ కార్డులు చేయాలని అధికారులకు ఆదేశించాం. దీనివల్ల పేషెంట్​కు గతంలో ఉన్న వ్యాధుల వివరాలను సులభంగా ట్రాక్​ చేయవచ్చు. ఏ రకంగా వైద్యులు ట్రీట్​ చేసున్నారో కూడా తెలుస్తుంది. దీంతో డాక్టర్​ నెక్స్ట్​ ఏరకంగా ముందుకు వెళ్లాలో వెసులుబాటు కలుగుతుంది. అందుకోసం మరో 30 రోజుల్లోనే ఫ్యామిలీ డిజిటల్​ హెల్త్​ కార్డును తీసుకువస్తాం."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి


CM Revanth Key Announcement On Digital Health Cards : నెలలోపు కుటుంబ డిజిటల్‌ హెల్త్‌ కార్డులను తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ డిజిటలైజ్‌ చేస్తామన్నారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆస్పత్రిని, ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. హెల్త్‌కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాన్సర్‌ చికిత్స కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని, సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.


Jowar Roti Benefits- జొన్న రొట్టెలు రోజూ తినడం వల్ల జరిగేది ఇదేనట! - నిపుణుల సూచనలు మీకోసం -


 ప్రస్తుత కాలంలో చాలా మంది జొన్నరొట్టెలకే మా ఓటు అంటున్నారు. హెల్దీగా ఉండాలన్నా.. ఊబకాయం రాకూడదన్నా ఇవే తినడం బెస్ట్‌ అంటున్నారు నిపుణులు కూడా. మరి.. రోజూ జొన్న రొట్టెలు తినడం వల్ల శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా?

 

Jowar Roti Benefits : బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహంతో బాధపడేవారు ఇలా చాలా మంది ప్రస్తుత కాలంలో రాత్రి అన్నం తినకుండా చపాతీలు తింటున్నారు. అయితే.. ఇటీవల జొన్న రొట్టెలు తినేవారి సంఖ్య పెరుగుతోంది. మరి.. రోజూ జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

జొన్నల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలున్నాయని NIH బృందం వెల్లడించింది. (National Library of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ముఖ్యంగా ఇతర తృణధాన్యాలతో పోలిస్తే.. జొన్నలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఫినోలిక్ సమ్మేళనాలున్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని వెల్లడించారు.

పోషకాలు అనేకం!

జొన్నలలో విటమిన్ బి3, బి1,​ బి2, ఖనిజాలు, ఫైబర్, ప్రొటీన్లు​ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందులోని ఫైబర్​ కండరాలను బలంగా ఉంచుతుంది. అలాగే పోషకాలు చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జొన్న రొట్టెలలో ఆక్సిజన్​ సరఫరా జరగడానికి అవసరమయ్యే ఇనుము ఎక్కువగా ఉంటుంది.

ఎముకలు దృఢంగా..

జొన్న రొట్టెలలో ఎముకలు, దంతాలు దృఢంగా ఉండడానికి అవసరమయ్యే ఫాస్పరస్‌, కాల్షియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. రోజూ జొన్న రొట్టెలు తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్​ కలిగిన ధాన్యం..

గోధుమలతో పోలిస్తే జొన్నలు తక్కువ గ్లైసెమిక్​ ఇండెక్స్​ కలిగిన ధాన్యం. డయాబెటిస్​తో బాధపడేవారు జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా, స్థిరంగా పెరుగుతాయి. అందుకే.. మధుమేహంతో బాధపడేవారు వీటిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 2017లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. జొన్న రొట్టెలు తినడం వల్ల టైప్ 2 డయాబెటిక్ రోగులలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ కుమార్' పాల్గొన్నారు.

  • జొన్న రొట్టెలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • జొన్న రొట్టెలలో ఉండే ఫైబర్​ జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది.
  • అలాగే ఇవి రెండు రొట్టెలు తింటే చాలు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • జొన్నల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయం చేస్తాయి.
  • అలాగే కొలెస్ట్రాల్​ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
  • అందుకే.. జొన్న రొట్టెలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

 

 

 

 

Vijayawada: వరదనీటిలో తిరిగిన బాలుడు.. కుడి కాలును తీసేసిన వైద్యులు

 

వరదనీటిలో తిరిగిన బాలుడు.. కుడి కాలును తీసేసిన వైద్యులు మనిషి మాంసాన్ని తినే బ్యాక్టిరియా.. వరదనీటిలో తిరిగిన 12 ఏళ్ల కుర్రాడిని అటాక్ చేసింది. శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండానే.. బాలుడు శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎంటరవ్వడంపై వైద్యులు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 

12 ఏళ్ల భవదీప్‌ది ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట. సెప్టెంబర్ మొదటి వారంలో విజయవాడను వదరలు ముంచెత్తిన వేళ.. బాబు కుటుంబం ఉండే ఇంట్లోకి వరదనీరు చేరింది. ఆ వరదనీరు తగ్గే వరకు కుటుంబంతో అతడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోని సామాన్లు తడవకుండా అమ్మానాన్నలకు సాయం చేశాడు. అయితే అదే రోజు రాత్రి.. బాబు చలి జ్వరంతో పాటు వణుకుతో బాధపడ్డాడు. వైరల్ ఫీవర్ ఏమో అని స్థానిక ఆర్‌ఎంపీ దగ్గర చూయించారు. అతను యాంటిబయోటిక్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ చేశాడు. అయినా పరిస్థితి కుదుటపడలేదు. ఆ తర్వాత టెస్టులు చేయించగా డెంగ్యూ సోకినట్లు తేలింది. అయితే ఉన్నట్టుండి అకస్మాత్తుగా రెండు కాళ్లు తొడల నుంచి అరికాళ్ల వరకు వాచాయి. దీంతో విజయవాడలోని ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారు పేరెంట్స్. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు నిర్ఘాంతపోయే వార్త చెప్పారు. వారి కుమారుడికి అత్యంత అరుదున ‘నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌’ వ్యాధి సోకినట్లు తెలియడంతో.. ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఈ జబ్బుకు మరో పేరు ఫ్లెష్‌ ఈటింగ్‌ డిసీజ్‌. అంతేకాదు ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా భవదీప్ శరీరంలోకి చొచ్చుకుపోయి.. కండరాలను తినేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ఇన్‌ఫెక్షన్ మరింత పెరగకుండా.. ఈ నెల 17న కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. ఎడమ మోకాలి కింద భాగంలో కూడా 30శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేసినట్లు గుర్తించారు. అయితే మాములుగా ఈ వ్యాధి షుగర్ ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది. కానీ ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్‌ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎలా వెళ్లిందనే విషయం డాక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు. భవదీప్ పరిస్థితి తెలిసి.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య  రూ.10లక్షలు మంజూరుచేయించారు.

బాలుడి శరీరంలో కుళ్లిన భాగాల నుంచి తీసిన శాంపిల్స్ టెస్ట్ చేసిన డాక్టర్లు బాడీలోకి ఈ-కోలి, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వెళ్లినట్లు గుర్తించారు. వరదనీటిలో మురుగునీరు కలిసినప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా వ్యాప్తి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. జ్వరం వచ్చినప్పుడు కాళ్ల వాపులు లాంటివి కనిపిస్తే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో భవదీప్‌‌కు చికిత్స అందిస్తున్నారు.. అతను పూర్తిగా కోలుకునేందుకు రెండు, మూడు నెలల వరకు సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.