CM Revanth Key Announcement On Digital Health Cards : నెలలోపు కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామన్నారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆస్పత్రిని, ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. హెల్త్‌కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని, సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.
"తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్లమంది ప్రజలకు హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ కార్డులు చేయాలని అధికారులకు ఆదేశించాం. దీనివల్ల పేషెంట్‌కు గతంలో ఉన్న వ్యాధుల వివరాలను సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఏ రకంగా వైద్యులు ట్రీట్ చేసున్నారో కూడా తెలుస్తుంది. దీంతో డాక్టర్ నెక్స్ట్ ఏరకంగా ముందుకు వెళ్లాలో వెసులుబాటు కలుగుతుంది. అందుకోసం మరో 30 రోజుల్లోనే ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డును తీసుకువస్తాం."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి