Tuesday, September 24, 2024

UNO : న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశం

 

 


సెప్టెంబ‌ర్ 23వ తేదీ న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’ జ‌రిగింది. 

ఈ స‌ద‌స్సులో మానవాళి విజయం సమష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఎన్నటికీ సమస్యల పరిష్కార వేదిక కాబోదని కుండబద్దలు కొట్టారు. 

ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, దేశాల నడుమ ఉద్రిక్తతలు, గ్లోబల్‌ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి’ అని మోదీ సూచించారు. 

ఉగ్రవాదం పెనుముప్పు 
ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్, స్పేస్, మారిటైమ్‌ క్రైమ్‌ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘మానవాళి సంక్షేమానికి ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యమివ్వాలి. సంక్షేమ, సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాం. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అన్నారు.

 ఐరాస భద్రతా మండలి.. కాలం చెల్లిన వ్యవస్థ..
ప్రారంభోపన్యాసం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివర్ణించారు. సరైన సంస్కరణలతో పనితీరును సరి చేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగింది’ అన్నారు. 

మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ శాంతిభద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావి తరాలు, అంతర్జాతీయంగా పాలన తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందం దృష్టి సారించింది.

పాలస్తీనా అధ్యక్షునితో భేటీ 
పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌తో మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్‌ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. కువైట్‌ రాకుమారుడు షేక్‌ సబా ఖలీద్‌ అల్‌ సబా, నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి తదితరులతో మోదీ సమావేశమయ్యారు.

10th పాస్ తో 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. AP, TS Can Apply.. SSC GD Constable Notification for 39,481 Posts..

 


  • 10th పాస్  అర్హత తో 39,481 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
  • భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.

📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (మహిళా, పురుష) అభ్యర్థులు మిస్ అవ్వకండి.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్, సిబ్బంది మరియు శిక్షణ విభాగం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారతీయ నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలను అందించడానికి.. 05.09.2024 న సూపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 05.09.2024 నుండి 14.10.2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి/ ఫిబ్రవరి 2025 లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.


అధికారిక వెబ్సైట్ :: https://ssc.gov.in/

అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :      05.09.2024 నుండి,

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :       14.10.2024.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:       15.10.2024.
రాత పరీక్ష నిర్వహించి తేదీ :        జనవరి/ ఫిబ్రవరి 2025.

 

 

 ఖాళీల వివరాలు:

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 39,481.


విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) - 15,654,
  2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) - 7,145,
  3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) - 11,541,
  4. సశాస్త్ర సీమా బల్ (SSB) - 819,
  5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) - 3,017,
  6. అస్సాం రిఫ్లెష్ (AR) - 1,248,
  7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) - 35,
  8. నార్కోటిస్ కంట్రోల్ బ్యూరో (NCB) - 22.
  9. ఇలా మొత్తం 39,481 పోస్టులను భర్తీకి ప్రకటించింది.

విద్యార్హత:

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్  నుండి 10th పాస్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి.


నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలను సంతృప్తి పరచలేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.


  1. NCC 'A', 'B', 'C' సర్టిఫికెట్లు కలిగిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి.
  2. NCC - C సర్టిఫికెట్ కలిగిన వారికి 5 శాతం మార్పులు, 
  3. NCC B సర్టిఫికెట్ కలిగిన వారికి 3 శాతం మార్పులు,
  4. NCC  A సర్టిఫికెట్ కలిగిన వారికి 2 శాతం మార్పులు బోనస్ గా ఇవ్వబడతాయి.


వయోపరిమితి:

  • దరఖాస్తు దారులు 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
  1. 02.01.2022 మరియు 01.01.2027 మధ్య జన్మించి ఉండాలి.
  2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;
  3. ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
  4. ఓబీసీ లకు 3 సంవత్సరాలు,
  5. మాజీ - సైనికులకు 3 సంవత్సరాలు.

 

ఎంపిక విధానం:

  • కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, శారీర దారుడ్య పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.


పరీక్ష సెంటర్ల వివరాలు:

దేశవ్యాప్తంగా 9 రీజియన్ లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.

  • తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సౌతేర్న రీజియన్ రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, మరియు తెలంగాణ) లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి;

ఆంధ్రప్రదేశ్ లో

  1. చీరాల,
  2. గుంటూరు,
  3. కాకినాడ,
  4. కర్నూల్,
  5. నెల్లూరు,
  6. రాజమండ్రి,
  7. తిరుపతి,
  8. విజయనగరం,
  9. విజయవాడ,
  10. విశాఖపట్నం..

తెలంగాణ లో

  1. హైదరాబాద్,
  2. కరీంనగర్,
  3. వరంగల్..


పరీక్ష అంశాలు, విధానం:

  • ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో మొత్తం 160 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
  • పార్ట్ - ఏ, పార్ట్ - బీ, పార్ట్ - సి, పార్ట్ - డి నుండి క్రింది విధంగా ప్రశ్నలు వస్తాయి.
  • ప్రతి పార్ట్ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.
  • ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు.
  1. పార్ట్-ఎ లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు,
  2. పార్ట్-బి లో జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు,
  3. పార్ట్-సి లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 20 ప్రశ్నలు,
  4. పార్ట్-డీ లో ఇంగ్లీష్/ హిందీ నుండి 20 ప్రశ్నలు.
  5. 10వ తరగతి సిలబస్ స్టాండర్డ్ ను అనుసరించి పై విషయాల్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
  6. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది
  7. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్ కోత విధిస్తారు.


పరీక్ష పేపర్ ఇంగ్లీష్/ హిందీ మాద్యమాల తో పాటు 13 రీజనల్ ప్రాంతీయ మాధ్యమాల్లో ఉంటుంది. అవి;

  1. అస్సామీ, 
  2. బెంగాలీ, 
  3. గుజరాతి, 
  4. కన్నడ, 
  5. కొంకణి, 
  6. మలయాళం, 
  7. మణిపూరి, 
  8. మరాఠీ, 
  9. ఒడియా, 
  10. పంజాబీ, 
  11. తమిళ్, 
  12. తెలుగు మరియు 
  13. ఉర్దూ..

పరీక్ష సమయం 60 నిమిషాలు.


గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ 1 నుండి 3 ప్రకారం రూ.18,000 నుండి రూ.69,100/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం:

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు:

  1. అందరికీ రూ.100/-.
  2. ఎస్సీ/ ఎస్టీ/ మాజీ - సైనికులకు/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.






 

Monday, September 23, 2024

MHSRB - Staff Nurse JOBs తెలంగాణ ఆరోగ్యశాఖ 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ..

 

అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త! 

  • వివిధ అర్హతతో సొంత జిల్లా, మండల ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది. 
  • స్టాఫ్ నర్స్ కొలువుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 2050 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ.
  • ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి. 
  • దరఖాస్తు ప్రక్రియ 28.09.2024 నుండి అందుబాటులోకి వస్తుంది. 
  • నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ..

సంఖ్య పోస్టుల వారీగా ఖాళీలు : 

  1. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ - 1576,
  2. తెలంగాణ వైద్య విధాన పరిషత్ - 332,
  3. ఆయుష్ - 61,
  4. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ - 01,
  5. MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజనల్ క్యాన్సర్ సెంటర్ (MNJIO &RCC) - 80.


విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి జనరల్ నర్సింగ్ మరియు మిడ్-వైఫరీ (GNM)/ బీఎస్సీ నర్సింగ్ అర్హతలు కలిగి ఉండాలి. 
  2. అలాగే తెలంగాణ రాష్ట్ర మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.

వయో పరిమితి :

    01.07.2024 నాటికే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
    వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు తప్పక అధికారిక నోటిఫికేషన్ చదవండి.
    అధికారిక నోటిఫికేషన్ Pdf ఈ పేస్ దిగువన అందుబాటులో ఉంది.

ఎంపిక విధానం :

  1. ఈ పోస్టులకు రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. 
  2. రాత పరీక్ష 80 మార్పులకు ఉంటుంది.
  3. అభ్యర్థి కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్/ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు సంస్థల్లో అందించిన సేవలకు 20 మార్పులు కేటాయిస్తారు. 
  4. 6 నెలలు గిరిజన ప్రాంతాల్లో సేవలందించిన వారికి 2.5 మార్కులు, గిరిజనేతర ప్రాంతాల్లో సేవలందించిన వారికి 2 పాయింట్లు కేటాయిస్తారు. 
  5. 📌 6 నెలలు పూర్తి గా సేవలందించిన వారికి మాత్రమే ఈ పాయింట్లు కేటాయించబడతాయి.
  6. ఇలా మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపికలు ఉంటాయి.


రాత పరీక్ష సెంటర్ల వివరాలు :

  • రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపీక చేసుకోవచ్చు. అవి;
  1. హైదరాబాద్ 
  2. నల్గొండ 
  3. కోదాడ 
  4. ఖమ్మం 
  5. కొత్తగూడెం 
  6. సత్తుపల్లి 
  7. కరీంనగర్ 
  8. మహబూబ్నగర్ 
  9. సంగారెడ్డి 
  10. ఆదిలాబాద్ 
  11. నిజామాబాద్ 
  12. వరంగల్ 
  13. నర్సంపేట మొదలగునవి.

 

గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి స్కేల్ ఆఫ్ రూ.36,750/- నుండి రూ.1,06,990/- వరకు రాష్ట్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు .

 దరఖాస్తు విధానం :

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు :

    దరఖాస్తు ఫీజు మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.500+200=700/-.
    ఎస్సీ/ ఎస్టీ/ బిసి/ ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
    ఇతర రాష్ట్రాల వారికి దరఖాస్తు ఫీజు మినహాయింపు లేదు.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.09.2024.


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.10.2024 @ 05:00PM.


దరఖాస్తు సవరణ ప్రక్రియ ప్రారంభం & ముగింపు తేదీలు :: 16.10.2024 @ 10:30 AM నుండి 17.10.2024 @ PM.


రాత (కంప్యూటర్ ఆధారిత) పరీక్ష తేదీ :: 17.11.2024.

అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/

అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

TG DSC Results 2024 : పూర్తికావొచ్చిన కసరత్తు - ఏ క్షణమైనా డీఎస్సీ ఫలితాలు..!

 


తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెట్ వివరాల సవరణ అవకాశం కూడా ముగిసింది. దీంతో ఏ క్షణంలోనైనా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… నియామక పత్రాలు అందజేస్తారు.
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలకు విద్యాశాఖ కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చింది. ఇటీవలే టెట్ వివరాల సవరణకు కూడా అవకాశం ఇచ్చింది. ఈ గడువు కూడా పూర్తి కావటంతో… జనరల్ ర్యాకింగ్ లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి చేయనుంది. మెరిట్‌ జాబితా జారీ విడుదల తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తారు. జనరల్ ర్యాకింగ్ లిస్టులను ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా విద్యాశాఖ కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం.

సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలను కూడా వాయిదా వేయకుండా షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసింది. ప్రాథమక కీలను కూడా త్వరగానే విడుదల చేసినప్పటికీ… ఫైనల్ కీ విడుదల చేసేందుకు సమయం తీసుకుంది. మరోవైపు టెట్ వివరాల అప్డేట్ కోసం రెండు రోజులకుపైగా ప్రత్యేకంగా గడువు ఇచ్చింది. చాలా మంది అభ్యర్థులు ఈ ఆప్షన్ ద్వారా…వారి టెట్ వివరాలను సవరించుకున్నారు. ఫలితంగా టెట్‌ మార్కులతో పాటు డీఎస్సీ మార్కులను కలిపి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను విడుదల చేస్తారు.

జిల్లాల వారీగా జనరల్ ర్యాంకులను ప్రకటించిన తర్వాత…. ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది. ఇందుకోసం ఒక్క పోస్టుకు ముగుగు చొప్పున ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి తర్వాత…పోస్టుకు ఒకరికి ఎంపిక చేస్తారు. వారికి నియామక ఉత్తర్వులను అందజేస్తారు. అయితే మొత్తం ప్రక్రియల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కీలకంగా ఉంటుంది. ఇందులోని ర్యాంకులను బట్టి అభ్యర్థులు ఓ అంచనాకు రావొచ్చు.
ఇక ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.

డీఎస్సీ జనరల్ ర్యాకింగ్ లిస్ట్ ను ఇలా చెక్ చేసుకోండి:
డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు  https://schooledu.telangana.gov.in/ISMS/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
డీఎస్సీ రిక్రూట్ మెంట్ - 2024 ఆప్షన్ పై నొక్కాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది.
ఇక్కడ కనిపించే హోం పేజీలో TG DSC జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది.
దీనిపై క్లిక్ చేస్తే జిల్లాల వారీగా అభ్యర్థుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

 

ఐక్యమత్యం ముఖ్యమనేది ఇందుకే.. ఈ సింహాలు చేసిన తప్పు చూసైనా నేర్చుకోవాలి

 

ఐక్యమత్యం ముఖ్యమనేది ఇందుకే.. ఈ సింహాలు చేసిన తప్పు చూసైనా నేర్చుకోవాలి 'ఒకరు చేయలేనిది, నలుగురు కలిసి చేయొచ్చ'ని చెబుతుంటారు. దీనినే కార్పొరేట్ ప్రపంచంలో టీమ్‌ వర్క్‌గా చెబుతుంటారు. నలుగురు కలిస్తే చేయలేని పని అంటూ ఏది ఉండదని అంటుంటారు. అందుకే టీమ్‌ వర్క్‌ ఉండాలని సూచిస్తుంటారు. అయితే జట్టు సభ్యుల మధ్య సమన్వయం లేకపోతే అంతే సంగతులు. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ఇది 100 శాతం నిజమని చెబుతోంది...

‘ఒకరు చేయలేనిది, నలుగురు కలిసి చేయొచ్చ’ని చెబుతుంటారు. దీనినే కార్పొరేట్ ప్రపంచంలో టీమ్‌ వర్క్‌గా చెబుతుంటారు. నలుగురు కలిస్తే చేయలేని పని అంటూ ఏది ఉండదని అంటుంటారు. అందుకే టీమ్‌ వర్క్‌ ఉండాలని సూచిస్తుంటారు. అయితే జట్టు సభ్యుల మధ్య సమన్వయం లేకపోతే అంతే సంగతులు. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ఇది 100 శాతం నిజమని చెబుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

అడవిలో 5 సింహాలు ఒక దున్నపోతుపై అటాక్‌ చేశాయి. దున్నపోతు అయితే దొరికింది. ఇక దానిని చంపేసి తినడమే తరువాయి. అయితే అంతలోనే వాటి మధ్య గొడవ షురూ అయ్యింది. పంపకాల విషయంలోనో మరే విషయంలో కానీ ఒకదానిపై మరొకటి దాడి చేసుకోవడం ప్రారంభించాయి. మొదట రెండు సింహాల మధ్య మొదలైన గొడవ క్రమంగా అన్ని సింహాలకు వ్యాపించాయి. దీంతో కష్టపడి పట్టుకున్న దున్నపోతును వదిలేసి మరీ గొడవ పడడం ప్రారంభించాయి. అదే పనిలో దున్నపోతును అక్కడే వదిలేసి వెళ్లిపోయాయి మరీ ఫైట్ చేసుకున్నాయి.

వైరల్ వీడియో..


 ఇదే అదునుగా భావించిన దున్నపోతు.. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంది. ఇలా సింహాలు ఒకదాంతో మరొకటి గొడవ పడడంతో కష్టపడి సాధించిన దున్నపోతును వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. టీమ్‌ వర్క్‌ లేకపోవడం అంటే ఇదే అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.