Saturday, August 31, 2024

బంపర్ ఆఫర్: 295కే ఇంటర్నెట్ + టీవీ చానెల్లు.. ఇక కేబుల్ టీవీ కనెక్షనే అక్కర్లేదు!

 



ఏపీలో రోజుకు రూ.10తో అపరిమిత వినోదం అంటూ కేబుల్ టీవీలు ఊదరగొడుతూ ఉంటాయి. దీని ప్రకారం నెలకు రూ.300 చెల్లించాలి. అయితే లిమిటెడ్ టీవీ చానెళ్లు మాత్రమే వస్తాయి. మళ్లీ ఇంటర్నెట్ కావాలంటే మరో 400 ఖర్చు పెట్టాలి. దీంతో సగటు కుటుంబానికి నెలకు రూ.700 మినిమం ఖర్చవుతుంది. అంతే కదా. అదే రూ.300లోపే అన్ని టీవీ చానెళ్లూ, ఇంటర్నెట్ రెండూ అందిస్తే.. ఏ వినియోగదారుడైనా తప్పకుండా 300లోపు అన్నీ అందించే సంస్థకే మారుతాడు. ఆ కనెక్షనే తీసుకుంటాడు. రైట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అదే పని చేస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 295కే టీవీచానెళ్లు, ఇంటర్నెట్ అందిస్తోంది.

త్వరలోనే కేబుల్ టీవీకి మంగళం 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటికీ అత్యంత చౌక ధరకే ఇంటర్నెట్, టీవీ చానెళ్లకు అందించడానికి గతంలో తీసుకొచ్చిన ఏపీ ఫైబర్ నెట్ ‌ని మరింత  విస్తరించాలని కంకణం కట్టుకుంది. ఒకటీ రెండూ కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల ఇళ్లకు తమ సేవలను అందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇది అమలైతే రాష్ట్రంలో ప్రధాన MSOలు, కేబుల్ టీవీ దాదాపు కనుమరుగు అవడం ఖాయం. దీంతో కేబుల్ టీవీ చానెళ్లలో పని చేసేవారు, కేబుల్ టీవీ రంగ కార్మికుల్లో ఆందోళన మొదలైంది.

అడ్డుకునే కుట్రలు  

గత కొంత కాలంగా తీవ్రంగా సబ్ స్క్రైబర్లను నష్టపోతున్న కేబుల్ టీవీ సంస్థలు ఇప్పుడు తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి తోడు ఈ ఏపీఫైబర్ నెట్‌ విస్తరిస్తే.. తమ మనుగడే ప్రశ్నార్థకం కానుంది. దీంతో కొందరు ఎలాగైనా ఏపీ ఫైబర్‌ నెట్‌ను తమ నెట్ వర్క్ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆలోచిస్తున్నారు. తమకు బాగా పట్టున్న విజయవాడ, నెల్లూరు, ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం తదితర నగరాల్లో ఏపీ ఫైబర్ నెట్ సేవలు విస్తరించకుండా పలుకుబడి కలిగిన ఎంఎల్‌ఏలు, ఎంపీల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు మొదలెట్టాలని కసరత్తు చేస్తున్నారు.

 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ఏపీ ఫైబర్ నెట్ తమ నెట్ వర్క్ పరిధిలోకి సేవలను విస్తరిస్తే.. వెంటనే అందులోకి మారిపోవాలని కూడా కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా నష్టాల బాట పట్టిన సంస్థ కు చెందిన సీనియర్ ఉద్యోగులు అయితే తమ బాస్ ఈ పాటికే ఏపీఫైబర్‌నెట్‌ లోకి మారేందుకు రంగం సిద్ధం చేసినట్లు కూడా చెబుతున్నారు.

అసలు కారణం ఇదీ

​భారత్‌నెట్ ప్రాజెక్టును ఏపీలో విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్రం సాయం అందించాలని ఏపీ మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ కోరారు. ఆయన ఇటీవల దిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర టెలికమ్యూనికేషన్‌ శాఖ కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌ను ఏపీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శి సురేశ్‌కుమార్, ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ కె. దినేష్‌కుమార్‌లు కలిసి విజ్ఞప్తి చేశారు.

 

35 లక్షల బాక్సులు

భారత్ నెట్ ప్రాజెక్టును విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని సురేష్ కుమార్ కోరారు. భారత్ నెట్ సమర్ద వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ (Customer Premise(s) Equipment) బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారత్ నెట్ రెండో దశలో భాగంగా మల్టీ ప్రొటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ టెక్నాలజీ కోసం ఖర్చు చేసిన 650 కోట్ల రూపాయలు ఏపీకి తిరిగి చెల్లించాలని అధికారులు కోరారు.

ఇప్పటికే మిలియన్ కనెక్షన్లు

ఏపీ ఎస్​ఎఫ్​ఎల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 9.7 లక్షల గృహాలకు హైస్పీడ్ బ్రాండ్ బాండ్ సేవలందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 5 లక్షల కనెక్షన్లు క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపారు. తక్షణం 35 లక్షల సీపీఈ బాక్సులు అందిస్తే భారత్ నెట్ సేవలను మరింత విస్తృతపరుస్తామని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తెలిపింది. భారత్ నెట్ ఫేజ్-3 ప్రతిపాదనలు కూడా సమర్పిస్తామని కేంద్రానికి అధికారులు వివరించారు.

 నష్టాల బాటలో ఎంఎస్‌వోలు

ట్రాయ్ నిబంధనలు కఠినతరం చేయడం, గత ఏడాది కొత్త ఎన్టీవోని అమల్లోకి తీసుకురావడం, ప్రధాన చానెళ్లు తమ టారీఫ్‌లను పెంచడం, మరోవైపు వినియోగదారులు ఓటీటీలు, మొబైల్ కంటెంట్ ‌కి మారిపోవడంతో కేబుల్ టీవీ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. దీంతో పలు సంస్థకు ఇప్పటికే నష్టాలు రావడంతో అవి అటు సంస్థలను మూసేయలేక,  ఇటు కంటిన్యూ చేయలేక ఇబ్బంది పడుతున్నాయి. గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఖర్చులను తగ్గించుకుంటున్నా నష్టాలను మాత్రం ఆగడం లేదు.
  

50 శాతం ఉద్యోగుల లే ఆఫ్ 

కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలు కరోనా వచ్చినప్పటి నుంచి ఫీల్డ్ స్టాప్, కాల్ సెంటర్లు, కలెక్షన్ ఏజెంట్లు ఇతరత్రా డిపార్టు మెంట్లకు చెందిన వందల మంది ఉద్యోగులను తీసేసి.. వాటి స్థానంలో యాప్స్, ఇతర టెక్నాలజీని వాడుకుంటున్నారు. అయితే కొందరు ఎంఎస్‌వోలకు అత్యంత కీలకమైన, మంచి రెవెన్యూ అందించే స్థానిక చానెళ్ల ఉద్యోగులపై కూడా ఇప్పుడు వేటు పడేలా కనిపిస్తోంది. గత కొంత కాలం నుంచి కొత్త నియామకాలు జరుగకపోగా.. ఉన్న ఉద్యోగుల్లో 50 శాతం మందికి కోత పెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరోవైపు కంటెంట్ ఖర్చులు కూడా పెరగడంతో కొన్ని చానెళ్లను క్లోజ్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

Wednesday, August 28, 2024

5 Best Library Websites

 

 A well-structured, user-friendly library website is a vital asset for any modern library. It serves as a virtual extension of your physical space and provides an essential platform for patrons to access resources and services.

 1. https://openlibrary.org/

 



2. https://manybooks.net/

 


 

3.  https://z-lib.io/


4. https://ndl.iitkgp.ac.in/


5. http://library.mnit.ac.in/ndl

 


 

 

Tuesday, August 27, 2024

రంగంలోకి దిగితే ఎవరి మాటా వినని (ఏవీ) రంగనాథ్.. అసలు ఎవరీయన?

 

 


కాకినాడ నుంచి హైదరాబాద్ వరకు ఆయన పనిచేసిన ప్రతిచోటా సంచలన చర్యలు ఉండేవి.. లేదా అక్కడ సంచలన ఘటనలు జరిగేవి.. విధి నిర్వహణలో నిక్కచ్చి.. ఏ ప్రభుత్వం ఉన్నా ఆయనకు మంచి బాధ్యత.. ఇక ఏదైనా సమస్యను టేకప్ చేశారా..? దాని అంతు చూడాల్సిందే.. ఖమ్మంలో మైక్రో ఫైనాన్స్ ఆగడాలు అయినా.. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య అయినా.. కాకినాడలో పెట్రోల్ దొంగలు అయినా.. తోక ముడవాల్సిందే. ఆయనే తెలంగాణ సీనియర్ ఐపీఎస్ ఆవుల వెంకట (ఏవీ) రంగనాథ్. ఆయన గురించి బాగా తెలిసినవారు మాత్రం అక్రమాలు, అన్యాయాల విషయంలో ఎవరి మాటా వినని (ఏవీ) రంగనాథ్ అని చెబుతుంటారు. ఇప్పుడు హైడ్రాతో హడల్ పుట్టిస్తున్నారు ఈ సూపర్ కాప్.

కాకినాడలో డీజిల్ మాఫియాపై ఉక్కుపాదం రంగనాథ్ ఉమ్మడి ఏపీలో డీఎస్పీగా ప్రస్థానం ప్రారంభించారు. 2006 సమయంలో కాకినాడలో ఏఎస్పీగా పనిచేస్తున్న సమయంలో సముద్రం నుంచి డీజిల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న మాఫియా గుట్టును బయటపెట్టారు. ఓ రహస్య నివేదికను తయారుచేశారు. దీంతో అక్కడి రాజకీయ నాయకులు, పై అధికారులు కుట్ర చేశారు. రంగనాథ్ ను ఆఫీస్ కు రాకుండా తాళాలు వేశారు. కారు డ్రైవర్ ను పంపించివేశారు. అయినా ఆయన ధైర్యంగా నిలిచారు. తెరవెనుక జరుగుతున్న కుట్రను.. రంగనాథ్ కు కాకినాడలో ప్రముఖ మీడియా సంస్థ జర్నలిస్టు ఒకరు చేరవేసి అప్రమత్తం చేశారు. డీజిల్ మాఫియా సహా ఇదంతా అప్పట్లో పెద్ద సంచలనం అయింది.

ఖమ్మంలో మైక్రో ఫైనాన్స్ ఆగడాల ఆటకట్టు అప్పు తీసుకుంటే చెల్లించాల్సిందే.. అయితే, అది అమాయకులను వేధించేందుకు ఓ అస్త్రంగా మారితే..? అధిక వడ్డీలతో వారి ఉసురు పోసుకుంటంటే.. కాపాడేందుకు వచ్చేవారే పోలీస్. ఖమ్మం ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు రంగనాథ్ ఇదే పనిచేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ వేధంపులు, ఆగడాలను ఉక్కుపాదంతో అణచివేశారు. ఆయా సంస్థలు పదేళ్లయినా ఇప్పటికీ రంగనాథ్ పేరు చెబితే ఉలిక్కి పడుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఖమ్మంలో మైక్రో ఫైనాన్స్ దారుణాలు లేవంటే నమ్మాల్సిందే.

హైదరాబాద్ ట్రాఫికర్ కు చెక్ రంగనాథ్ నల్లగొండ ఎస్పీగా పనిచేసినప్పుడు.. అత్యంత సంచలనం రేపిన మారుతీరావు ఉదంతం చోటుచేసుకుంది. ఉమ్మడి ఏపీలో క్రిష్ణా జిల్లాలో ఉన్న సమయంలో అత్యంత సంచలనం రేపిన ఆయేషా మీరా ఘటన జరిగింది. ఇక రంగనాథ్ హైదరాబాద్ లో ట్రాఫిక్ విభాగానికి వచ్చాక కీలక చర్యలు చేపట్టారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఆయన తీసుకున్న చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వరంగల్ కమిషనర్ గానూ కొన్ని విషయాల్లో రంగనాథ్ తనదైన ముద్ర వేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రంగనాథ్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో రంగనాథ్ కు బాధ్యతలు అప్పగించారు. తన మానస పుత్రిక అయిన హైడ్రాకు ఐజీ స్థాయి అధికారి అయిన రంగనాథ్ ను కమిషనర్ గా నియమించి ఫుల్ పవర్స్ అప్పగించారు. వాటి ఆధారంగా హైడ్రాతో రంగనాథ్ తనదైన శైలిలో పనిచేస్తూ వెళ్తున్నారు. హైడ్రా దూకుడుకు పలుకుబడి కలిగిన వ్యక్తులే కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే ఆయన రంగంలోకి దిగితే ఎవరి మాటా వినని (ఏవీ) రంగనాథ్ అని అంటుంటారు. అయితే, రంగనాథ్ ఏ ప్రభుత్వం ఉన్నా ఒక అధికారిగా తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారు. అందుకే వైఎస్ నుంచి రేవంత్ వరకు ఏ సీఎం అయినా ఆయనకు మంచి బాధ్యతలు అప్పగిస్తున్నారు

 

ఏపీ టెట్‌-2024 హాల్ టికెట్లు విడుదల... ఎప్పుడంటే..? ఈ సారి రిజ‌ల్డ్స్‌ను..

 

ఏపీ టెట్‌-2024 ప‌రీక్ష‌ అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున దాదాపు 18 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. 

 

 


ఉదయం మొదటి సెషన్‌ 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండో సెషన్‌ 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లుల‌ను చేస్తుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

టెట్ హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో..
ఏపీ టెట్ 2024కు సంబంధించిన హాల్‌టికెట్లు సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత అందుబాటులో రానున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. 

ఏపీ టెట్ 2024 కీ కూడా..
ఏపీ టెట్ 2024 పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత.. అంటే అక్టోబర్ 4వ తేదీ తర్వాత నుంచి ఆ ముందు రోజుల ప్రాథమిక ‘కీ’లు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి కీ పై అభ్యంతరాల స్వీకరిస్తారు. అక్టోబర్‌ 27వ తేదీ తుది ఆన్సర్‌ ‘కీ’ విడుదల అవుతుంది. 

ఏపీ టెట్ ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..
ఏపీ టెట్‌ ఫలితాలు 2024 నవంబర్ 2వ తేదీ ప్రకటిస్తారు. క‌మ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు.. ఓసీ (జనరల్‌) కేటగిరీలో 60 శాతం ఆపైన‌ మార్కులు, బీసీ కేటగిరీలో 50 శాతం మార్కులు ఆపైన‌, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ కేటగిరీల వారికి 40 శాతం మార్కులు ఆపైన‌ వస్తేనే టెట్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకొనేందుకు ఈసారి భారీగా పోటీపడుతున్నారు.

మొత్తం 4,27,300 మంది..

ఆంధ్రప్రదేశ్‌ టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌కు పేపర్‌ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌ 1 బికు 2,662 మంది చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది దరఖాస్తు చేసుకోగా.. మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు అత్యధికంగా 1,04,788 మంది అప్లై చేసుకున్నారు.

టెట్‌.. నాలుగు పేపర్లు..
➨    ఏపీ టెట్‌ను పేపర్‌–1ఎ,1బి,పేపర్‌–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లు­గా నిర్వహిస్తారు. బోధన తరగతుల వా­రీగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాల్సిన విధంగా ఈ పేపర్లను వర్గీకరించారు. 
➨    పేపర్‌–1ఎ: 1–5వ తరగతి వరకు ఉపాధ్యాయులకు అవసరమైన పరీక్ష.
➨    పేపర్‌–1బి: 1–5వ తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌కు అవసరమైన పరీక్ష.
➨    పేపర్‌–2ఎ: 6 నుంచి 8వ తరగతి వరకు స్కూల్‌ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్‌.
➨    పేపర్‌–2బి: 6 నుంచి 8వ వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు హాజరు కావల్సిన పరీక్ష.

అర్హతలివే..
పేపర్‌ను బట్టి ఇంటర్మీడియెట్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీతోపాటు డీఈడీ/ బీఈడీ/లాంగ్వేజ్‌ పండిట్‌ తత్సమాన అర్హతలు ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తుకు అర్హులే.
పరీక్ష విధానాలు : 
➨    పేపర్‌–1ఎ, 1బి: పేపర్‌–1ఎ,పేపర్‌–1బిలను 5 విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి; లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2 (ఇంగ్లిష్‌), మ్యాథమెటిక్స్‌; ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 150ప్రశ్నలు అడుగుతారు.ప్రతి ప్రశ్న­కు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.లాంగ్వేజ్‌–1 సబ్జెక్ట్‌ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమి­ళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.

పేపర్‌–2ఎ
➨    ఈ పేపర్‌లో నాలుగు విభాగాలు (చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 ప్రశ్నలు– 30 మార్కులు); లాంగ్వేజ్‌–1 (30 ప్రశ్నలు–30 మార్కులు); లాంగ్వేజ్‌–2 ఇంగ్లిష్‌ (30 ప్రశ్నలు–30 మార్కులు); సంబంధిత సబ్జెక్ట్‌ (60 ప్రశ్నలు–60 మార్కులు)గా పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
➨    సబ్జెక్ట్‌ విభాగానికి సంబంధించి మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ టీచర్స్‌ అభ్యర్థులు మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌ విభాగాన్ని, సోషల్‌ టీచర్లు సోషల్‌ స్టడీస్‌ విభాగాన్ని, లాంగ్వేజ్‌ టీచర్లు సంబంధిత లాంగ్వేజ్‌ను ఎంచుకుని పరీక్ష రాయాలి. అదే విధంగా సబ్జెక్ట్‌ పేపర్‌లో మ్యాథమెటిక్స్‌లో.. 24 కంటెంట్‌– 6 పెడగాజి ప్రశ్నలు ఉంటాయి. 
సైన్స్‌ సబ్జెక్ట్‌లో.. ఫిజికల్‌ సైన్స్‌ నుంచి 12 ప్రశ్నలు, బయలాజికల్‌ సైన్స్‌ నుంచి 12 ప్రశ్నలు చొప్పున కంటెంట్‌ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. మిగతా 3 ప్రశ్నలు సైన్స్‌ పెడగాజి నుంచి ఉంటాయి. సోషల్‌ విభాగంలో 48 కంటెంట్‌ ప్రశ్నలు–12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు. లాంగ్వేజ్‌ సబ్జెక్ట్‌ మెథడాలజీకి సంబంధించి 48 కంటెంట్‌–12 పెడగాజి ప్రశ్నలు ఉంటాయి. 

పేపర్‌–2బి
➨    పేపర్‌–2బిని కూడా పేపర్‌–2ఎ మాదిరిగా నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. మొదటి మూడు విభాగాలు పేపర్‌–2ఎలోవే ఉంటాయి. నాలుగో విభాగంగా మాత్రం డిజేబిలిటీ స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌ అండ్‌ పెడగాజి ఉంటుంది. ఈ విభాగంలో 60 మార్కులకు 60 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాలు కలిపి 150 ప్రశ్నలతో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
➨    నాలుగో విభాగంలో అభ్యర్థులు తాము స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్ట్‌ నుంచి 48 కంటెంట్, 12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు. 

టెట్‌ పరీక్షలో రాణించేలా..
చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి
శిశువు మనస్తత్వం సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు;శిశువు ప్రవర్తనలో మా­ర్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యస­న బదలాయింపు; ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం– నాయకత్వం–గైడెన్స్‌–కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. 

లాంగ్వేజ్‌
లాంగ్వేజ్‌–1లో అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో.. అదే విధంగా లాంగ్వేజ్‌–2గా పేర్కొన్న ఇంగ్లిష్‌లో భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధన పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్‌ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్‌ పుస్తకాలతోపాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌ డైరెక్ట్‌ స్పీచ్, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌
సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలపై ఒకటి నుంచి నుంచి అయిదో తరగతి వరకు; ఎన్విరాన్‌మెంటల్‌ పేపర్‌లో సైన్స్, సమకాలీన అంశాలపైనా దృష్టి పెట్టాలి.
➨    సైన్స్‌: ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు ఔపోసన పట్టాలి. పేపర్‌–2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్‌ వంటి వాటిపై దృష్టిపెట్టాలి. 
➨    సోషల్‌ స్టడీస్‌: హైస్కూల్‌ స్థాయి పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా ఒక అంశానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ చదవాలి. 
➨    మెథడాలజీ: ఈ విభాగంలో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌(టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. 


టెట్‌తోపాటే డీఎస్సీకి ప్రిపరేషన్‌ ఇలా..
➨    టెట్‌తోపాటు డీఎస్సీకి సమాంతర ప్రిపరేషన్‌ సాగించడం మేలు. అందుకోసం ఎస్‌జీటీ అభ్యర్థులు జీకే, కరెంట్‌ అఫైర్స్‌ సిలబస్‌పై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి. భౌగోళిక నామాలు, నదీతీర నగరాలు, దేశాలు–రాజధానులు, ప్రపంచంలో తొలి సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ అంశాలు, శాస్త్రసాంకేతిక అంశాలు తెలుసుకోవాలి.
➨    అదే విధంగా విద్యా దృక్పథాలు; విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంపై పూర్తి అవగాహన పొందాలి. కంటెంట్‌కు సంబంధించి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి.

Monday, August 26, 2024

Srinivasa Ramanujan: A Mathematical Prodigy

 


Srinivasa Ramanujan was an Indian mathematician who made extraordinary contributions to mathematical analysis, number theory, infinite series, and continued fractions. Despite having little formal training in pure mathematics, his intuition and insight led him to discover groundbreaking formulas and theorems.



Partition Functions: Ramanujan's work on partition functions, which count the number of ways a positive integer can be expressed as a sum of positive integers, was groundbreaking. His formulas and approximations revolutionized this area of number theory.
Infinite Series: He developed numerous formulas for infinite series, many of which were previously unknown. These series often had surprising and elegant properties.
Modular Forms: Ramanujan's work on modular forms, a deep connection between number theory and complex analysis, has had a profound impact on modern mathematics.
Continued Fractions: He studied and developed new formulas for continued fractions, a type of infinite expression that can represent certain numbers.


Ramanujan's mathematical journey was largely self-directed. He studied independently and developed his own techniques and notations. His notebooks, filled with thousands of formulas and theorems, are considered a treasure trove of mathematical ideas.
Recognition and Legacy:

Despite facing challenges due to his lack of formal education and social background, Ramanujan gained recognition for his work. He was elected a Fellow of the Royal Society and Trinity College, Cambridge. His contributions continue to inspire mathematicians and scientists around the world.

Would you like to know more about a specific aspect of Ramanujan's life or work? I can provide additional information on his early life, his collaboration with G.H. Hardy, or his mathematical discoveries.