Friday, August 23, 2024

E-SHRAM: కార్మికుల కష్టానికి “ఈ-శ్రమ్” సాయం.. ఈ కార్డు మీతో ఉంటే నెలకు రూ. 1000 !

 

 


 

  • కార్మికులు కష్టానికి తగిన ఫలితం
  • ఈ శ్రమ్ పేరిట కొత్త పోర్టల్
  • 2021లో ప్రారంభం
  • అసంఘటిత రంగా కార్మికుల కోసం పోర్టల్
  • ఆధార్‌తో అనుసంధానించబడిన అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్‌ను రూపొందించడమే లక్ష్యం
  • ఈ కార్డు మీతో ఉంటే నెలకు రూ. 1000

 

 

https://eshram.gov.in/

పలు రంగాలకు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిన కేంద్ర ఈ-శ్రమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ అయిన e-SHRAM పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ యొక్క ప్రధాన లక్ష్యం ఆధార్‌తో అనుసంధానించబడిన అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్‌ను రూపొందించడం. వలస కార్మికులు, గృహ కార్మికులతో సహా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ప్రయోజనం చేకూర్చడానికి ఈ పోర్టల్ ప్రారంభించింది. అ సంఘటిత రంగంలో పని చేసే ఎవరైనా ఇ-శ్రామ్ కార్డ్ లేదా ష్రామిక్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. దీని కింద అసంఘటిత రంగాల కార్మికులు 60 ఏళ్ల తర్వాత పెన్షన్, మరణ బీమా, వైకల్యం ఉంటే ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలను పొందవచ్చు. దీని కింద, లబ్ధిదారులు భారతదేశం అంతటా చెల్లుబాటు అయ్యే 12 అంకెల నంబర్‌ను పొందుతారు.

30 విస్తృత పారిశ్రామిక రంగాలలో 400 వృత్తుల క్రింద, ఒక అసంఘటిత కార్మికుడు స్వీయ-ప్రకటన ఆధారంగా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. వ్యవసాయ కార్మికులు, పాడి రైతు, కూరగాయలు, పండ్ల విక్రేత, వలస కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, మత్స్యకారులు, కలప కట్టర్లు, లేబులింగ్, ప్యాకింగ్ కార్పెంటర్, సెరికల్చర్ వర్కర్, ఉప్పు కార్మికుడు, భవనం, నిర్మాణ కార్మికులు, గృహోపకరణాలు పనిచేసేవారు, వార్తా గృహోపకరణ కార్మికులు ఆటో డ్రైవర్, సిల్క్ ఫ్యాక్టరీ కార్మికుడు, గృహ కార్మికులు, వీధి వ్యాపారులు తదితరులు ఈ కార్డును పొందేందుకు అర్హులు. 

 ఈ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇ-శ్రమ్ కార్డు పొందేందుకు 18-59 ఏళ్ల మధ్య ఉన్న కార్మికులు అర్హులు. ఈ కార్డు పొందేందుకు కార్మికుడు కచ్చితంగా భారతీయుడై ఉండాలి. ప్రతి నెలా 1,000 రూపాయల ఆర్థిక సహాయం కార్డుదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతే కాకుండా ఈ కార్డ్ హోల్డర్ రూ. 2 లక్షల వరకు వైద్య బీమా కవరేజీ కూడా పొందవచ్చు. భవిష్యత్తులో పెన్షన్‌కు కూడా వస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలు కూడా పొందుపరిచారు. 60 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.3,000 పెన్షన్ వస్తుంది.

 

Thursday, August 22, 2024

స్టూడెంట్స్​కు రూ.6 లక్షలు సాయం- రిలయన్స్ స్కాలర్‌షిప్​కు అప్లై చేసుకోండిలా!

 


Reliance Foundation Scholarships 2024-25 : రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్ ద్వారా 2024-25 సంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తులను ఆహ్వానించింది. దీనిలో భాగంగా 5100 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఎంపిక చేయనుంది. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ ఎప్పుడు? అప్లై ఎలా చేసుకోవాలి? అభ్యర్థుల ఎంపిక ఎలా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పేద విద్యార్థులకు అండ
దేశంలోని 5,100 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ప్రారంభించింది. రిలయన్స్ ఫౌండేషన్ కొన్నేళ్లుగా ఈ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను కొనసాగిస్తోంది. దేశంలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్​కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

భారత్​లోనే అతిపెద్ద ప్రైవేట్ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్స్​లో ఒకటి
అండర్ గ్రాడ్యుయేట్ కళాశాల విద్యకు సంబంధించిన మెరిట్-కమ్-మీన్స్ ప్రమాణాల ఆధారంగా 5,000 మంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తారు. ఆర్థిక భారం లేకుండా చదువును కొనసాగించడానికి అవకాశం కల్పిస్తారు. రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్‌లో ప్రతిభావంతులైన 100 విద్యార్థులను ఎంపిక చేసి ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.2 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.6 లక్షలుగా స్కాలర్‌షిప్‌ను నిర్ణయించారు. ఇప్పటి వరకు రిలయన్స్ 23,000 ఉన్నత విద్యా స్కాలర్‌షిప్‌లను అందించింది. భారత్​లోనే అతిపెద్ద ప్రైవేట్ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్స్​లో ఒకటిగా రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ నిలిచింది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ దరఖాస్తును www.scholarships.reliancefoundation.org. వెబ్ సైట్ ద్వారా ఆన్‌ లైన్​లో చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆప్టిట్యూడ్, ఆర్థిక నేపథ్యాన్ని చూస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ కోసం అకడమిక్ అచీవ్‌ మెంట్స్, వ్యక్తిగత వివరాలు, ఇంటర్వ్యూలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా దేశవ్యాప్తంగా ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేస్తారు. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ దరఖాస్తులకు చివరి తేదీ 2024 అక్టోబర్ 6.

విద్యార్హతలు
దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ఈ ఏడాది ఏదైనా కోర్సులో చేరిన మొదటి సంవత్సరం/ సెమిస్టర్ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ కోర్సులు చదివేవారికి సైతం స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్​లో మరింత సమాచారం పొందవచ్చు.

TGPSC సంచలన నిర్ణయం..ఆ పరీక్ష సమయంలో మార్పులు

 

 


గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖలోని 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. జులై మొదటి వారంలో 1:50 నిష్పత్తి ప్రకారం 32 వేల మంది అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో TGPSC మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇది వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30వరకు అని వెబ్ నోట్ ఇచ్చామని, దాన్ని తాజాగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటలకు మార్చినట్లు వెల్లడించింది. అక్టోబరు 21 నుంచి అక్టోబర్ 27 వరకు హైదరాబాద్ నగరంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. 

Wednesday, August 21, 2024

JioTV+: సెట్‌టాప్‌- బాక్స్‌ అవసరం లేదిక.. స్మార్ట్‌టీవీల్లోనే జియోటీవీ+ సేవలు

 


JioTV+ | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio) తన జియో టీవీ+ (JioTV+) సేవలను విస్తృతం చేసింది. ఇప్పటివరకు జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ఫైబర్‌ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు సెట్‌-టాప్‌ బాక్స్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉండేది. ఇకపై ఆండ్రాయిడ్‌, యాపిల్, అమెజాన్‌ ఫైర్‌ ఓస్‌లోనూ జియో టీవీ+ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సబ్‌స్క్రైబర్లు సింగిల్‌ లాగిన్‌తో 800 డిజిటల్‌ ఛానెళ్లను వీక్షించొచ్చని జియో ఓ ప్రకటనలో తెలిపింది.

దాదాపు అన్ని స్మార్ట్‌టీవీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ జియో టీవీ+ సేవలు లభిస్తాయని జియో తెలిపింది. తద్వారా న్యూస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌, మ్యూజిక్‌ విభాగాలకు చెందిన ఛానెళ్లను వీక్షించొచ్చని పేర్కొంది. జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5 వంటి ఓటీటీ యాప్స్‌ను కూడా వినియోగించొచ్చని తెలిపింది. ఇందుకోసం ఆండ్రాయిడ్ టీవీల్లో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి జియో టీవీ+ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ ఫైబర్‌ సబ్‌స్క్రైబర్లు ఈ యాప్‌ ద్వారా కంటెంట్‌ను వీక్షించొచ్చు.

జియో ఎయిర్‌ఫైబర్‌ వినియోగదారులకు అన్ని ప్లాన్లపైనా, జియో ఫైబర్‌ పోస్ట్‌పెయిడ్‌ అయితే రూ.599, రూ.899 ఆ పై ప్లాన్లు తీసుకున్న వారు ఈ యాప్‌లో లాగిన్‌ అవ్వొచ్చు. జియో ఫైబర్‌ ప్రీపెయిడ్‌ యూజర్లు అయితే రూ.999 లేదా అంతకంటే ఆపై ప్లాన్లు కలిగి ఉండాలి. ఎల్‌జీ ఓఎస్‌ ఆధారిత టీవీలకు త్వరలో ఈ యాప్‌ సపోర్ట్ అందిస్తామని జియో తెలిపింది. శాంసంగ్‌ స్మార్ట్‌టీవీ యూజర్లు ఈ యాప్‌ను వినియోగించలేరు. అలాంటి వారు సెట్‌-టాప్‌ బాక్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

 

 

 

Tuesday, August 20, 2024

రాళ్ల ఉప్పు / సముద్రపు ఉప్పు Benifits of Crystal Salt

 


 

ఇదివరకు రక్తపోటు సమస్య చాలా తక్కువ. ఓ నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ బీపీ గురించి ఎవరూ విని ఉండరు కూడా.

రక్తపోటు ఇలా పెరిగిపోవడానికి కారణమేమిటని డాక్టర్లను ఆరాతీస్తే, అప్పట్లో బీపీ లేకపోవడానికి కారణం అయొడైజ్డ్ ఉప్పు లేకపోవడమేనని తెలిసింది. 

మళ్లీ రాళ్ల ఉప్పుకు ఎంత త్వరగా మారితే ఆరోగ్యానికి అంత మంచిదని కూడా వారు సలహా ఇస్తున్నారు.

మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, రక్త *దోషాలు పోవాలన్నా, రక్తపోటు మామూలు స్థితిలో ఉండాలన్నా అయొడైజ్డ్ ఉప్పుకు స్వస్తి చెప్పి, రాళ్ల ఉప్పును ఉపయోగించాల్సిందేనని వారు నొక్కి చెబుతున్నారు.

అయొడైజ్డ్ ఉప్పు అసలు ఉప్పే కాదని, అది నకిలీ ఉప్పని వారు తెలిపారు. సోడియం, క్లోరైడ్, అయొడిన్ అనే మూడు కృత్రిమ రసాయనాలతో ఈ అయొడైజ్డ్ ఉప్పును తయారు చేస్తారు.

అయితే, ఈ ఉప్పు నీటిలో కరగదు. స్ఫటికాల్లాగా మెరుస్తూ ఉంటుంది. నీళ్లలోనే కాదు, శరీరంలో కూడా అది కరగదు. మూత్రపిండాల్లో కూడా కరగకపోగా, వాటిల్లో రాళ్లను సృష్టిస్తుంది. పైపెచ్చు రక్తపోటును పెంచుతుంది. అయితే అయొడైజ్డ్ ఉప్పుకు ఎంతో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంటుంది.

ఇది చాలా పరిశుభ్రంగా ఉంటుందని, ఆరోగ్యకరమని, చక్కగా స్ఫటికాల్లా మెరిసిపోతుంటుందని చాలామంది భావిస్తుంటారు.

కానీ, ఈ ఉప్పు సహజసిద్ధంగా తయారు చేసింది కాదు. ఇది కర్మాగారాల్లో తయారవుతుంది. అసలైన ఉప్పు, అంటే రాళ్ల ఉప్పు సముద్రం నుంచి వస్తుంది. దీన్ని ఎండలో ఎండబెడతారు.

ఇందులో సహజసిద్ధమైన 72 ఖనిజ లవణాలుంటాయి. ఇందులో కూడా సోడియం, క్లోరైడ్, అయొడిన్‌లు ఉంటాయి కానీ, అవి సహజమైనవి.

కృత్రిమమైనవి కావు. ఈ ఉప్పు నీళ్లలో వెంటనే కరిగిపోతుంది.

శరీరంలో కరిగిపోతుంది. మూత్రపిండాల్లో కరిగిపోతుంది.* *మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. పైగా రక్తపోటును అంటే బీపీని తగ్గిస్తుంది

కండరాలు మొద్దుబారిపోవడం, తిమ్మిర్లెక్కడం, దురదలు పెట్టడం వంటివి తగ్గిపోతాయి.

రాత్రివేళల్లో పిక్కలు, అరికాళ్లలో నొప్పులు వచ్చినా, పిక్కలు బిగపట్టుకుపోయినా ఓ అరగ్లాసు నీళ్లలో ఓ చెంచాడు రాళ్ల ఉప్పు వేసి, బాగా కలిపి, ఆ నీటిని తాగండి. అయిదు నిమిషాల్లో ఆ నొప్పులు, బాధలన్నీ మటుమాయమైపోతాయి.

రాళ్ల ఉప్పు వాడడం ప్రారంభించిన తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

శరీరం మందులకు స్పందించడం ప్రారంభమవుతుంది. మూత్రపిండాలు సజావుగా పని చేస్తున్నట్టు అనుభవపూర్వకంగా తెలుస్తుంది.

ముఖ్యంగా అధిక రక్తపోటు నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. ఇక 240/140 బీపీ ఉన్నప్పుడు కూడా రాళ్ల ఉప్పు కారణంగా అది సాధారణ స్థితిలోకి వచ్చేస్తోంది. రాళ్ల ఉప్పులో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి.

రోజూ రెండున్నర చెంచాల రాళ్ల ఉప్పును 15 గ్లాసుల నీటిలో కలిపి అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా తాగితే రక్తపోటు దరిదాపులకు కూడా రాదని చాలామంది డాక్లర్లు చెబుతున్నారు. బీపీ సాధారణ స్థితిలో ఉండాలన్నా, తలకు రక్తం సజావుగా చేరాలన్నా మిరపకాయల వాడకం, అరటి పండ్లు తినడం అనివార్యం.

ఇవి రెగ్యులర్‌గా వాడేవారికి గుండె సంబంధమైన సమస్యలు కూడా తలెత్తవని డాక్టర్లు సూచిస్తున్నారు. శరీరంలో సరైన పాళ్లలో సరైన ఉప్పు లేకపోతే నీరు నిలవడం అసాధ్యం. శరీరంలో నీరు నిలవకపోతే, రక్తనాళాలు సజావుగా పనిచేయవు. శరీరంలో నీటి శాతం ఏమాత్రం తగ్గినా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రక్తపోటు రావడం ఖాయం.

అయొడైజ్డ్ ఉప్పు వల్ల శరీరంలో నీళ్లు నిలవవు.

రాళ్ల ఉప్పు వల్ల శరీరంలో 95 శాతం వరకూ నీళ్లు నిలుస్తాయి. శరీరం నుంచి సరిగా మూత్రం బయటికి పోవడానికి, చెమటలు పట్టడానికి రాళ్ల ఉప్పు సహకరిస్తుంది.