డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వంటి కోర్సులు పూర్తిచేసి రైల్వే ఉద్యోగాలు పొందడానికి సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్. వివిధ జోన్ల పరిధిలో రైల్వే జాబ్స్ భర్తీకోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పూర్తి వివరాల్లోకెళ్తే..
RRB Jobs : రైల్వేశాఖ మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల.. 1376 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల
RRB Railway Paramedical Recruitment 2024 : రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. మరో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా మెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
భ్యర్థులు పూర్తి వివరాలకు
https://indianrailways.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
భర్తీ చేసే ఆర్‌ఆర్‌బీ రీజియన్లు ఇవే : అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పూర్, అజ్‌మేర్, గోరఖ్‌పూర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, సికింద్రాబాద్, బిలాస్‌పూర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం తదితర రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
విభాగాల వారీగా ఖాళీలు : 1376 డైటీషియన్ (లెవల్-7) పోస్టులు : 05
నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు : 713
అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు : 04
క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు : 07
డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు : 03
డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు : 20
హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-III పోస్టులు : 126
ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ పోస్టులు : 27
పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు : 02
ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II పోస్టులు : 20
ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు : 02
క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు : 02
ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) పోస్టులు : 246
రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టులు : 64
స్పీచ్ థెరపిస్ట్ పోస్టు : 01
కార్డియాక్ టెక్నీషియన్ పోస్టులు: 04
ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు: 04
ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 13
ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టులు: 94
ఫీల్డ్ వర్కర్ పోస్టులు: 19
ఇతర సమాచారం : అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష సబ్జెక్టులు: ప్రొఫెషనల్ ఎబిలిటీ (70 ప్రశ్నలు- 70 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ సైన్స్ (10 ప్రశ్నలు- 10 మార్కులు). మొత్తం మార్కులు 100లకు ఉంటుంది. పరీక్ష సమయం.. 90 నిమిషాల వ్యవధి ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు : ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఆగస్టు 17, 2024
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2024
దరఖాస్తు సవరణ తేదీలు: సెప్టెంబర్ 17 నుంచి 26 వరకు