Thursday, August 15, 2024

ఆగస్టు నెలాఖరుకు డీఎస్సీ తుది కీ విడుదల.. 1:3 నిష్పత్తిలో ఫైనల్ సెలక్షన్‌ TG DSC 2024 Result

 


 తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కీ పై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఆగస్టు 20వ తేదీగా నిర్ణయించింది. జులై 18న ప్రారంభమై డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 5 తేదీతో ముగిశాయి. డీఎస్సీకి మొత్తం 2,79,957 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 2,45,263 మంది అంటే 87.61 శాతం మంది..


హైదరాబాద్‌, ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కీ పై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఆగస్టు 20వ తేదీగా నిర్ణయించింది. జులై 18న ప్రారంభమై డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 5 తేదీతో ముగిశాయి. డీఎస్సీకి మొత్తం 2,79,957 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 2,45,263 మంది అంటే 87.61 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది పరీక్షలకు దూరంగా ఉన్నారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులకు 92.10 శాతం హాజరు నమోదైంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్‌ ఆన్సర్‌ కీ తయారు చేసి, ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ కార్యచరణ రూపొందించింది. ఈ మేరకు ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్‌ ఆఖరి వారం నుంచి మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆగస్టు నెలాఖరుకు తుది ఆన్సర్‌ కీ విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తుంది.

మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు, డీఎస్సీ పరీక్ష రాసిన వారి వివరాలను క్రోడీకరిస్తున్నారు. రోస్టర్‌ విధానం, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి సారించారు. ఈసారి డీఎస్సీ పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించినందున ఫలితాలను తేలికగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఫైనల్‌ కీ విడుదలైన రోజే లేదంటే ఆ మరుసటి రోజు ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. అనంతరం వారం రోజుల్లో సీనియారిటీ జాబితాను రూపొందించి మెరిట్ జాబితా వెల్లడిస్తారు. రోస్టర్‌ విధానం, జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా, ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్‌ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతీ జిల్లాలోనూ టీచర్‌ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్‌ పద్ధతిన ఎంపిక చేసి, ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది. వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాలను పంపించేలా కార్యచరణ రూపిందిస్తున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్‌ మూడోవారంలో ముగించి, జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగోవారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు.

ఒక వేళ ఇదంతా అనుకున్నట్లు జరగకపోతే అక్టోబర్‌ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని విశ్వాస వర్గాలు తెలిపాయి. మొత్తం చూస్తే అక్టోబర్‌ చివరి నాటికి నియామక ఉత్తర్వులను అభ్యర్థులకు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాలన్నింటికీ షెడ్యూ ల్డ్‌ కులాల ఉప వర్గీకరణను అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్‌ కూడా తెస్తామన్నారు. అయితే, డీఎస్సీ నోటిఫికేషన్‌ను వర్గీకర ణపై తీర్పు రాక ముందే ఇచ్చారు గనుక ఈ నియామకాలకు వర్గీకరణ అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ ప్రభుత్వం వర్గీకరణ అంశంపై స్పందిస్తే ఉపాధ్యాయ నియామకాలు మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్‌ ఉంది.

 

Wednesday, August 14, 2024

టెలికాం కొత్త రూల్స్.. ఇలా చేస్తే రెండేళ్లు బ్లాక్ లిస్ట్‌లోకి.. సెప్టెంబర్ 1 నుండి

 


 

 ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ నుంచి బయటపడేందుకు TRAI ఈ కొత్త నిబంధనను అమలు చేస్తోంది. మోసం లేదా బోగస్ కాల్స్ గురించి కస్టమర్ ఫిర్యాదు చేస్తే టెలికాం కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రాయ్ హెచ్చరించింది.


న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ రూల్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి టెలికాం రంగంలో పెద్ద మార్పు రానుంది. అదేంటంటే టైం లిమిట్ ఉల్లంఘిస్తే, సిమ్ కార్డ్ బ్లాక్ లిస్ట్ అవుతుంది.

అందువల్ల, మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మీరు ప్రమాదానికి గురవుతారు. అవును, ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ నుంచి బయటపడేందుకు TRAI ఈ కొత్త నిబంధనను అమలు చేస్తోంది. మోసం లేదా బోగస్ కాల్స్ గురించి కస్టమర్ ఫిర్యాదు చేస్తే టెలికాం కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రాయ్ హెచ్చరించింది.
TRAI కొత్త నిబంధన ప్రకారం, కస్టమర్లకి  అన్ వాంటెడ్ కాల్స్, నకిలీ కాల్స్, మార్కెటింగ్ సహా ఎటువంటి క్యాంపైన్ కాల్స్ చేయలేరు. అలాగే, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఫేక్ కాల్స్‌ను అరికట్టాలి. ఇందుకోసం ఫేక్ కాల్స్ నియంత్రణకు కృత్రిమ మేధస్సు సాయం తీసుకోవాలని ట్రాయ్ సూచించింది.  కస్టమర్‌కు ఫేక్ కాల్స్ వస్తే టెలికాం ఆపరేటర్, ఫేక్ కాల్స్ చేసిన కంపెనీలు లేదా వ్యక్తులు శిక్షార్హులు అవుతారు. లేదా నకిలీ కాలింగ్ ఫోన్ నంబర్లు 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్ అవుతాయి.
కొత్త పద్ధతి, కొత్త మోడల్ ద్వారా కస్టమర్లకు ఫేక్ కాల్స్ చేస్తుంటారు. పలు కంపెనీలు వ్యక్తిగత ఫోన్ నంబర్లు, ప్రైవేట్ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి కస్టమర్లని వేధిస్తున్నట్లు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో స్పామ్ కాల్స్ నియంత్రణకు ట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంటోంది.

స్పామ్ కాల్స్ లేదా ఫేక్ కాల్స్‌పై కస్టమర్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇటీవల కంపెనీల ప్రమోషన్ కు సంబంధించి స్పామ్ కాల్స్ వస్తున్నాయి. అన్ వాంటెడ్  కాల్స్‌తో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఫేక్ కాల్స్‌తో మోసపోతున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. స్పామ్ కాల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్న ట్రాయ్.. ఈ మొత్తం సమాచారం ఆధారంగా ఇప్పుడు కొత్త నిబంధనను రూపొందించింది. అయితే, సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది.

 

 

TS DSC SGT - 2024 INITIAL KEY : Qustion Paper and with Answers

  Secondary Grade Teacher  

Secondary Grade TeacherTELUGU19th July 2024, 09.00 AM to 11.30 AMeyeSecondary Grade TeacherTELUGU19th July 2024, 02.00 PM to 04.30 PMeyeSecondary Grade TeacherTELUGU22nd July 2024, 09.00 AM to 11.30 AMeyeSecondary Grade TeacherTELUGU23rd July 2024, 09.00 AM to 11.30 AMeyeSecondary Grade TeacherTELUGU23rd July 2024, 02.00 PM to 04.30 PMeyeSecondary Grade TeacherHindi26th July 2024, 09.00 AM to 11.30 AMeyeSecondary Grade TeacherBengali26th July 2024, 09.00 AM to 11.30 AMeyeSecondary Grade TeacherKannada26th July 2024, 09.00 AM to 11.30 AMeyeSecondary Grade TeacherMarathi26th July 2024, 09.00 AM to 11.30 AMeyeSecondary Grade TeacherTamil26th July 2024, 09.00 AM to 11.30 AMeyeSecondary Grade TeacherUrdu26th July 2024, 09.00 AM to 11.30 AMeyeSecondary Grade TeacherTelugu1st August 2024, 09.00 AM to 11.30 AMeyeSecondary Grade TeacherEnglish1st August 2024, 09.00 AM to 11.30 AMeye

 

 

 

టీఎస్ డీఎస్సీ-2024 'కీ' విడుద‌ల‌.. అభ్యర్థి ప్రతిస్పందనల యొక్క అన్ని అభ్యంతరాలు మాస్టర్ ప్రశ్న పత్రంపై మాత్రమే ఆధారపడి ఉండాలి.



 పరీక్ష సమయంలో (ప్రతి సెషన్‌లో) ప్రశ్నలు మరియు ఎంపికలు గందరగోళంగా ఉంటాయి, ప్రారంభ కీపై అభ్యంతరాలను లేవనెత్తడానికి మాత్రమే అభ్యర్థి మాస్టర్ ప్రశ్న పత్రాన్ని ఉపయోగించాలి.

1) అభ్యర్థి "ప్రశ్న ఐడి"ని మ్యాప్ చేయాలి. అతని "రెస్పాన్స్ షీట్" నుండి "ప్రశ్న ఐడి"కి వ్యతిరేకంగా ఇచ్చిన రోజు మరియు ఇచ్చిన సెషన్ కోసం "మాస్టర్ క్వశ్చన్ పేపర్". "మాస్టర్ క్వశ్చన్ పేపర్"లో ఇవ్వబడిన ఎంపికలకు సంబంధించిన అభ్యంతరం(ల)ను మాత్రమే పెంచండి.

ఉదాహరణ:
ప్రశ్న ఐడి అయితే. అభ్యర్థి రెస్పాన్స్ షీట్‌లో '1234567891' ఉంది, ఆపై అదే ప్రశ్న ఐడి ఎంపిక. అంటే, అభ్యంతరం తెలిపే ఉద్దేశ్యంతో మాస్టర్ ప్రశ్నాపత్రంలోని '1234567891'ని పరిగణించాలి.

అభ్యర్థి ప్రతిస్పందనల యొక్క అన్ని అభ్యంతరాలు మాస్టర్ ప్రశ్న పత్రంపై మాత్రమే ఆధారపడి ఉండాలి.

2) i. ప్రధాన ప్రశ్నాపత్రంలో ఆకుపచ్చ రంగులో మరియు ✓ చిహ్నంతో ఇచ్చిన ఎంపికలు సరైనవి

ii. మాస్టర్ ప్రశ్నాపత్రంలో ఎరుపు రంగులో మరియు X చిహ్నంతో ఇచ్చిన ఎంపికలు తప్పు

3) అభ్యర్థి ఎన్ని ప్రశ్న(ల)పై అయినా అభ్యంతరం(ల) లేవనెత్తవచ్చు కానీ "ఒక్కసారి" మాత్రమే. అందువల్ల, "https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్‌లోని "ప్రాథమిక కీపై అభ్యంతరాలు"ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో అభ్యంతర(ల)ను లేవనెత్తడానికి ముందు అన్ని అభ్యంతర(ల)ని జస్టిఫికేషన్‌తో పాటు జాబితా చేయాలని అభ్యర్థికి సూచించారు. "

4) సరైన సమర్థన లేకుండా సమర్పించిన అభ్యంతరం(లు) సారాంశంగా తిరస్కరించబడుతుంది.

5) ప్రారంభ కీపై అభ్యంతరాలు ఆన్‌లైన్ మోడ్ ద్వారా నిర్ణీత వ్యవధిలో మాత్రమే స్వీకరించబడతాయి, అభ్యంతరాల సమర్పణ యొక్క ఇతర పద్ధతులు పరిగణించబడవు.

6) లేవనెత్తిన అభ్యంతరాలు ఇచ్చిన ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి. అభ్యంతరాలు తెలిపేటప్పుడు పై సూచనలను ఖచ్చితంగా పాటించండి. ఏదైనా విచలనం ఉంటే, అభ్యంతరాలు పరిగణించబడవు.

 అభ్యంతరం(ల)ను పెంచడానికి పై మార్గదర్శకాలను నేను చదివి అర్థం చేసుకున్నాను.

 https://tgdsc.aptonline.in/tgdsc/Objections

 

Tuesday, August 13, 2024

కాకతీయ యూనివ‌ర్సిటీ దూర విద్యా కోర్సులకు నోటిఫికేషన్ -2024

 


 

కాకతీయ యూనివ‌ర్సిటీ దూర విద్యా కోర్సులకు నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఆగస్టు 31 వరకు గడువు 💥

దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాల కోసం కాకతీయ యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ అప్లికేషన్లకు ఆగస్టు 31వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. http://sdlceku.co.in/ వెబ్ సైట్ లోకి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్‌ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ నుంచి ప్రవేశాల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో యూజీ/ పీజీ/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను పేర్కొంది. ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 31వ తేదీని తుది గడువుగా ఉంది.

ముఖ్య వివరాలు:
ప్రవేశాల ప్రకటన - స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్‌ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, కాకతీయ వర్శిటీ.
యూజీ కోర్సులు: బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)/ BLIsc (వ్యవధి: మూడేళ్లు.)
పీజీ కోర్సులు - ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్). (వ్యవధి: )రెండేళ్లు.
డిప్లొమా కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్/ రిటైల్ మార్కెటింగ్/ ట్యాలీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్/ పీడీ అండ్‌ సి స్కిల్స్ (వ్యవధి: ఒక ఏడాది)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2024.
యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది. 


అధికారిక వెబ్ సైట్ - http://sdlceku.co.in/index.php
మెయిల్ - info@sdlceku.co.in